Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vellampalli: టీడీపీ ఐదేళ్ల పాలనలోని అవినీతి చిట్టా అంతా బయటకు తీస్తాం: మంత్రి వెల్లంపల్లి

టీడీపీ ఐదేళ్ల పాలనలోని అవినీతి చిట్టాను బయటకు తీస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు...

Vellampalli: టీడీపీ ఐదేళ్ల పాలనలోని అవినీతి చిట్టా అంతా బయటకు తీస్తాం: మంత్రి వెల్లంపల్లి
Vellampalli
Follow us
Venkata Narayana

|

Updated on: Jul 12, 2021 | 2:44 PM

Minister Vellampalli – Vijayawada: టీడీపీ ఐదేళ్ల పాలనలోని అవినీతి చిట్టాను బయటకు తీస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సంక్షేమం, అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పిన మంత్రి.. టీడీపీ ప్రభుత్వంలో విజయవాడ అభివృద్ధి శిలాఫలకాలే పరిమితమైందన్నారు. సోమవారం ఆయన బెజవాడ పశ్చిమ నియోజకవర్గంలో పర్యటించారు. 44వ డివిజన్‌లో ప్రజా సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.

పర్యటన అనంతరం వెల్లంపల్లి మీడియాతో మాట్లాడారు. లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ కాలనీలో 48 కుటుంబాలకు పునరావాసం కల్పిస్తామన్నారు. మంచినీటి, డ్రైనేజి సమస్యలు త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. త్వరలో భవానీపురం ప్రజలకు మున్సిపల్‌ స్టేడియం అందిస్తామని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు.

గంటల వ్యవధిలో రెండు సిఐడి కేసులకు ఆదేశించిన జగన్ సర్కారు

కాగా, నిన్న (ఆదివారం) గంటల వ్యవధిలో రెండు సిఐడి కేసులకు ఆదేశించింది ఆంధ్రప్రదేశ్ లోని జగన్ సర్కారు. చంద్రబాబునాయుడు హయాంలో ఏపీ ఫైబర్ నెట్ లో జరిగిన అవకతవకలుపై సిఐడి దర్యాప్తుకి జగన్ ప్రభుత్వ ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే, గత ప్రభుత్వంలోని మరో అంశంపై గంటల వ్యవధిలోనే మరో సిఐడి దర్యాప్తుకు ఆదేశించింది.

తాజాగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో జరిగిన అవినీతి పైనా సిఐడి దర్యాప్తుకు ఆదేశాలు వెలువడ్డాయి. షెల్ కంపెనీలకి నిధులు మళ్లించారంటూ రెండు కంపెనీల పై దర్యాప్తు కోరింది జగన్ సర్కార్. 241.78 కోట్ల రూపాయలు షెల్ కంపెనీల ద్వారా నిధులు మళ్లించినట్టు గుర్తించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

సిమెన్స్, డిజైన్ టెక్ కంపెనీలు ఈ అవకతవకలకు పాల్పడినట్టు ఏపీ సర్కారు సదరు కంపెనీలపై అభియోగాలు మోపింది. ప్రభుత్వ వాటా అయిన రూ. 370.78 కోట్ల రూపాయల నుండి ఈ మొత్తం తరలించినట్టు ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఇది గుర్తించి ప్రభుత్వానికి తెలిపినట్లు ఉత్తర్వులులో పేర్కొంది. ఈ అంశంపై తగిన చర్యలు తీసుకోవాలని సిఐడి అడిషనల్ డిజికి ఆదేశాలు జారీ చేసింది.

Read also: YSRCP Vijayasai reddy: చంద్రన్న, అయ్యన్న కొడుకులు విశాఖను చెరబట్టారు : విజయసాయిరెడ్డి