Covid-19 Kit: ఐఐటీ హైదరాబాద్ ప్రోఫెసర్ల అద్భుత ఆవిష్కరణ.. ఇక ఇంట్లోనే కరోనా టెస్ట్‌..

Covid-19 Kit: హైదరాబాద్ మరో ఆవిష్కరణకు వేదికగా నిలిచింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) హైదరాబాద్ ప్రొఫెసర్స్ 'కోవిహోమ్'..

Covid-19 Kit: ఐఐటీ హైదరాబాద్ ప్రోఫెసర్ల అద్భుత ఆవిష్కరణ.. ఇక ఇంట్లోనే కరోనా టెస్ట్‌..
Covihome
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 15, 2021 | 6:35 PM

Covid-19 Kit: హైదరాబాద్ మరో ఆవిష్కరణకు వేదికగా నిలిచింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) హైదరాబాద్ ప్రొఫెసర్స్ ‘కోవిహోమ్’ పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పని చేసే కోవిడ్ -19 టెస్ట్ కిట్‌ను అభివృద్ధి చేశారు. నిపుణుల పర్యవేక్షణ లేకుండానే ఇంట్లో ఉండి ఈ కిట్ ద్వారా కోవిడ్ 19 టెస్ట్ చేసుకోవచ్చని ఐఐటి ప్రొఫెసర్స్ తెలిపారు. ఈ టెస్ట్ కిట్ పరీక్ష ఫలితాలను 30 నిమిషాల్లోనే వెల్లడిస్తుందని పేర్కొన్నారు. ఆర్ఎన్‌ఏను పసిగట్టేందుకు ఆర్‌టి-పిసిఆర్, బిఎస్ఎల్ 2 ల్యాబ్ సౌకర్యం అవసరం లేదని, ఈ టెస్ట్ కిట్ కరోనా వైరస్‌ను ఇట్టే పసిగడుతుందని తెలిపారు. ఈ కారణంగానే నిపుణుల పర్యవేక్షణ లేకుండానే ఇంట్లోనే ఉండి పరీక్ష చేసుకోవచ్చునని హైదరాబాద్ ఐఐటి పేర్కొంది.

కాగా, ఈ కోవిహోమ్ టెస్టింగ్ కిట్‌ను డాక్టర్ సూర్యస్‌నాట త్రిపాఠి, సుప్రాజా పట్టా, స్వాతి మొహంతి, ఐఐటి హైదరాబాద్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ శివ్ గోవింద్ సింగ్ నేతృత్వంలోని ఇతర విద్యార్థుల పరిశోధనా బృందం అభివృద్ధి చేసింది.

సులువైన టెస్టింగ్ విధానాల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించడమే కోవిహోట్ టెస్ట్‌ కిట్‌ను అభివృద్ధి చేయడం వెనుక పరిశోధనా బృందం లక్ష్యం అని ఐఐటీ హైదరాబాద్ పేర్కొంది. ఇప్పటికే దీనికి సంబంధించి పేటెంట్ రైట్స్ కోసం దరఖాస్తు చేసినట్లు తెలిపింది. ఈ టెస్టింగ్ కిట్‌లను ఉత్పత్తి చేయడానికి, సాంకేతిక పరిజ్ఞానం కోసం పరిశ్రమ భాగస్వాములను వెతుకుతున్నామని ప్రొఫెసర్ శివ్ గోవింగ్ సింగ్ తెలిపారు. కాగా, హైదరాబాద్‌లోని ఇఎస్ఐసి మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడం జరిగిందని, ఈ ట్రయల్స్ సక్సెస్ అయ్యాయని ప్రొఫెసర్ తెలిపారు.

ఐసిఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం.. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్-సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CSIR-CCMB) ఆధ్వర్యంలో ఈ టెస్టింగ్‌కి కిట్‌ను పరిశీలించడం జరిగిందని తెలిపారు. ఈ ట్రయల్స్‌లో కిట్ సామర్థ్యం 94.2 శాతం, సెన్సిటివిటీ 91.3 శాతం, నిర్ధిష్టత 98.2 శాతం నమోదైనట్లు ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్ తెలిపారు. ఈ టెస్టింగ్ కిట్ ద్వారా ప్రతీ పరీక్షకు దాదాపు రూ. 400 ఖర్చు అవుతుందన్నారు. అయితే, పూర్తిస్థాయిలో ఇది అందుబాటులోకి వస్తే రూ. 300 లకు లభించే అవకాశం ఉందన్నారు.

Also Read:

Minister KTR: ఆ రోడ్లను మూసివేయకుండా ఆదేశాలివ్వండి.. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌కి మంత్రి కేటీఆర్ లేఖ..

AP Govt: అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన మంత్రి కన్నబాబు.. వారందరికీ ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయంటూ..

Telangana TDP: తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి ఎంపికలో చంద్రబాబు నయా స్ట్రాటజీ!.. పూర్వ వైభవం దక్కేనా?