Hyderabad IT Hub: హైదరాబాద్ శివారులో మరో ఐటీ హబ్.. పది లక్షల మందికి ఉద్యోగాలు.. ఫ్లాన్ రెడీ చేసిన హెచ్ఎండీఏ!

హైదరాబాద్ నగరానికి నలువైపులా ఐటీ రంగం విస్తరిస్తోంది. తాజాగా మరో ఐటీ హబ్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది

Hyderabad IT Hub: హైదరాబాద్ శివారులో మరో ఐటీ హబ్.. పది లక్షల మందికి ఉద్యోగాలు.. ఫ్లాన్ రెడీ చేసిన హెచ్ఎండీఏ!
It Hub In Hyderabad

IT Hub in Hyderabad: హైదరాబాద్ నగరానికి నలువైపులా ఐటీ రంగం విస్తరిస్తోంది. తాజాగా మరో ఐటీ హబ్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉన్న ఇదుళ్లనాగులపల్లి, కొల్లూరు ప్రాంతాల్లో కొత్త ఐటీ హబ్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

హైదరాబాద్‌ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోంది. ఇదే క్రమంలో ఐటీ రంగానికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలన్నీ భాగ్యనగరం బాట పట్టాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ అన్ని హంగులతో కూడిన సదుపాయాలను సమకూర్చుతోంది. ఇదే క్రమంలో రానున్న కాలంలో మరో ఐటీ హబ్ రూపాంతరం చెందనుంది. ఔటర్ రింగ్ రోడ్డుకు అత్యంత సమీపంలో ఉన్న కొల్లూరు, ఇదుళ్లనాగులపల్లి ప్రాంతాలు ఇందుకు అనువుగా ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలోని పరిసర గ్రామాల్లో ఐటీ హబ్‌కు అనుకూలంగా ఉందని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఔటర్ రింగ్ రోడ్డుకు 1.3 కిలోమీటర్ల దూరంలో ఉన్న 640 ఎకరాల భూమిని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) గుర్తించింది. హైటెక్ సిటీ తరహాలో ఈ హబ్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం హెచ్‌ఎండీఏ రూపొందించిన ప్రాంతీయ అభివ‌ృద్ధి ప్రణాళికకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేయాల్సి ఉంది.

అయితే, ఇందుకోసం సమీకరించే భూములకుగాను భూ యజమానులకు ఎకరాకు 600 గజాల అభివృద్ధి చేసిన ప్లాట్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేస్తున్న వివిధ సంస్థల ద్వారా దాదాపు పది లక్షల మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయని హెచ్‌ఎండీఏ ప్రాథమిక అంచనా వేస్తోంది. ఐటీ అనుబంధ సేవా రంగాలు కూడా అక్కడ భారీగా విస్తరించే అవకాశం ఉందని భావిస్తోంది.

Read Also…  Cyber Crime Alert: ఎవరైనా క్యూఆర్‌ కోడ్‌ ద్వారా డబ్బులును చెల్లిస్తామంటున్నారా..? అయితే జాగ్రత్త

Click on your DTH Provider to Add TV9 Telugu