Viral Video: చిన్నారిపై పగబట్టిన పాము.? జెట్ స్పీడ్‌తో దూసుకొచ్చి.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!

పాము.. ఈ పేరు వింటేనే మనుషులు భయపడతారు. దాన్ని ఆమడదూరం నుంచి చూస్తే చాలు.. గుండె ఆగిపోయినంత పనవుతుంది..

Viral Video: చిన్నారిపై పగబట్టిన పాము.? జెట్ స్పీడ్‌తో దూసుకొచ్చి.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!
Snake
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 17, 2021 | 10:25 AM

పాము.. ఈ పేరు వింటేనే మనుషులు భయపడతారు. దాన్ని ఆమడదూరం నుంచి చూస్తే చాలు.. గుండె ఆగిపోయినంత పనవుతుంది. ఇదిలా ఉంటే అసలు నాగుపాము పగ పడుతుందా.? పగబట్టి వెంటాడుతుందా.? వెంటాడి కాటేస్తుందా.? ఇవి సమాధానాలు లేని ప్రశ్నలు. వీటికి కొంతమంది అవునని అంటారు. మరికొందరు కొట్టిపారేస్తారు. తాజాగా మరోసారి ఈ చర్చకు ఆస్కారమిచ్చేలా వియత్నాంలో ఓ ఘటన చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వైరల్ వీడియో ప్రకారం.. ఇంటి ముందు స్థలంలో పిల్లోడు సరదాగా ఆడుకుంటున్నాడు. ఆ చిన్నారి తాత, తండ్రి కూడా అక్కడే ఉన్నారు. అయితే ఈలోపే అకస్మాత్తుగా పిల్లవాడి తండ్రి.. ఎదురుగా వస్తోన్న నాగుపామును గమనించి.. వడివడిగా చిన్నారి దగ్గరకి వెళ్లి.. అతడిని తీసుకుని లోపలికి పరిగెత్తి తలుపులు మూసేస్తాడు. అంతటితో ఆ పాము శాంతించలేదు. లోపలికి వెళ్లేందుకు శతవిధాల ప్రయత్నించింది. కొద్దిసేపు ఆ తలుపును తన పడగతో కొట్టింది. ఇక చివరికి ప్రయోజనం లేకపోయేసరికి.. వెనుదిరిగి వెళ్లిపోతుంది. కాగా, ఈ ఘటనను పక్కింటివారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్తా వైరల్‌గా మారింది. ‘పిల్లాడి అదృష్టం బాగుంది’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read:

గోడ నుంచి వింత శబ్దాలు.. తీరా చూసి ఖంగుతిన్న అధికారులు.!

ఈ ఫోటోలో పిల్లి దాగుంది.. దాన్ని గుర్తించడం చాలా కష్టం.. మీరు కనిపెట్టగలరా.?

వరల్డ్‌ స్నేక్‌ డే రోజు.. శ్రీవారి భక్తులకు భారీ నాగుపాము షాక్..!

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్‌కార్డుల పంపిణీకి తేదీ ఖరారు..