Amarnath Temple: జియో మరో సంచలనం.. అమర్‌నాథ్ క్షేత్రం నుంచి ప్రత్యక్ష ప్రసారం.. వర్చువల్ పూజా కార్యక్రమాలు..
Jio TV: దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులకు ఇది నిజంగా శుభవార్త. ఆమర్‌నాథేశ్వరుడిని దర్శించుకోలేకపోతున్న ప్రజలకు ఆ దైవ దర్శనం
Amarnath Temple : దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులకు ఇది నిజంగా శుభవార్త. ఆమర్‌నాథేశ్వరుడిని దర్శించుకోలేకపోతున్న ప్రజలకు ఆ దైవ దర్శనం కల్పించేలా రిలయన్స్ జియో సంచలన నిర్ణయం తీసుకుంది. అమర్‌నాథ్ పుణ్యక్షేత్రంలో జరిగే పూజా కార్యక్రమాలను, ఆర్తి ని ప్రత్యక్ష ప్రాసరం చేస్తోంది. జియో టీవీ, ఇతర జియో యాప్స్ ద్వారా భక్తులకు ఈ సౌకర్యాన్ని అందిస్తోంది జియో. ఈ పూజా కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం అందించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను, వ్యవస్థలను, బ్యాండ్ విడ్త్‌ను జియో ఏర్పాటు చేసింది. అయితే, అమర్‌నాథ్ క్షేత్రంలోని వాతావరణ పరిస్థితులు, ఎత్తైన పర్వతపంక్తులు నేపథ్యంలో నిరంతర ప్రత్యక్షప్రసారం సాధ్యం కాని నేపథ్యంలో.. తక్కువ వ్యవధిలో ప్రత్యక్ష ప్రసారాలను అందిస్తోంది.
భక్తులు అమర్‌నాథ్ క్షేత్రాన్ని సందర్శించకపోయినప్పటికీ.. వర్చువల్ ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి, పూజా కార్యక్రమాలను వీక్షించడానికి జియో డిజిటిల్ లైఫ్ అద్భుతమైన ప్లాట్‌ఫామ్‌ని అందిస్తోంది. జియో టీవీలో అమర్‌నాథ్ క్షేత్రం నుంచి ప్రత్యక్ష ప్రసారాలు, జియో మీట్ ద్వారా వర్చువల్ పూజా, హవాన్ కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి అవకాశం జియో కల్పిస్తోంది. కాగా, ఈ వర్చువల్ పూజా విధానం ద్వారా.. పూజ గదిలో నేరుగా పూజలు వీక్షించే అద్భుతమైన అనుభూతిని భక్తులకు కల్పిస్తోంది జియో.
కరోనా వ్యాప్తి కారణంగా.. 2021కి సంబంధించి అమర్‌నాథ్ యాత్రను రద్దు చేశారు. దాంతో లక్షలాది మంది భక్తులు ఈసారి అమర్‌నాథ్‌లో పరమశివుడిని దర్శించులేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే అమర్‌నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. వర్చువల్ మోడ్‌లో స్వామివారి దర్శనం కల్పించాలని డిసైడ్ అయ్యింది. పరమేశ్వరుని దర్శనం, హారతిని భక్తులకు అందించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటికే వివిధ రకాల ఆన్‌లైన్ సేవలను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో జియో వర్చువల్, లైవ్ స్ట్రీమింగ్‌ను ప్రారంభించింది.
Also read:
Covid-19 Third Wave: ఇండోనేషియాలో మరణ మృదంగం.. ఒక్కరోజే కరోనాతో 1,205 మంది మృతి