సడెన్ గా రైడర్ అవతారమెత్తిన సద్గురు.. బైక్ పై రయ్యిమంటూ చక్కర్లు .. వీడియో వైరల్
ఎప్పుడు తలపాగాతో కాషాయపు వస్త్రాలు లేదా తెలుపు రంగు దుస్తులు ధరించి నీతివాక్యాలు చెప్తూ.. యోగ గురించి యోగక్షేమాల గురించి
ఎప్పుడు తలపాగాతో కాషాయపు వస్త్రాలు లేదా తెలుపు రంగు దుస్తులు ధరించి నీతివాక్యాలు చెప్తూ.. యోగ గురించి యోగక్షేమాల గురించి తెలుపుతూ ఉండే సద్గురు జగ్గీ వాసుదేవ్ సడెన్ గా బైక్ రైడర్ గా మారారు. హెల్మెట్ పెట్టుకొని స్పోర్ట్స్ జాకెట్ వేసుకొని రయ్యిమంటూ బైక్ పై చక్కర్లు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అయితే సద్గురు బైక్ నడపడం కొత్తేమీకాదు గతంలో ఆయన చాలా సార్లు బైక్ నడిపి ఆకట్టుకున్నారు.
ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ గురించి చాలా మందికి తెలిసే ఉంటారు. మన దేశంలోనే కాకుండా అనేక దేశాల్లో ఆయన ఇషా ఫౌండేషన్ ద్వారా యోగ కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఆయన కార్యక్రమాలు నిర్వహించారు. తమిళనాడు కోయంబత్తూరు ఔటర్ ప్రాంతంలో ఇషా ఆశ్రమం ఉంది. ఈ సంస్థ అనేక సామాజిక ఆభివృద్ధి కార్యక్రమాలలో కూడా పాల్గొంటుంది, సద్గురు జగ్గీ వాసుదేవ్ ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఆది యోగి విగ్రహాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. 112 అడుగుల భారీ పరమశివుడి విగ్రహాన్ని ఆయన నిర్మించారు.
ఇదిలా ఉంటే కొద్దిరోజుల క్రితం విదేశాలు వెళ్లిన ఆయన ఇటీవల తిరిగి వచ్చారు. ఎయిర్ పోర్ట్ నుంచి కోయంబత్తూరులోని ఇషా యోగి సెంటర్ కు ఇలా బైక్ పై వచ్చారు. సద్గురు జగ్గీ బైక్ నడిపిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.
View this post on Instagram
మరిన్ని ఇక్కడ చదవండి :