Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adi Saikumar: “అమరన్” ప్రారంభించిన ఆది.. తొలిసారి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్న హీరో..

డైలాగ్ కింగ్ సాయి కుమార్ కుమారుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆది.. "ప్రేమ కావాలి" సినిమాతో మంచి గుర్తింపు పొందాడు.

Adi Saikumar: అమరన్ ప్రారంభించిన ఆది.. తొలిసారి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్న హీరో..
Adi Sai Kumar
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Rajitha Chanti

Updated on: Jul 16, 2021 | 10:07 PM

డైలాగ్ కింగ్ సాయి కుమార్ కుమారుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆది.. “ప్రేమ కావాలి” సినిమాతో మంచి గుర్తింపు పొందాడు. ఇక ఆ తర్వాత “లవ్లీ”, “సుకుమారుడు” వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ఆది. ప్రారంభంలోనే వరుస ఆఫర్లను అందుకున్న ఆది.. ఆ తర్వాత.. సరైన హిట్ అందుకోలేదు. ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ రీసెంట్‌గా వచ్చిన ‘శశి’ రెండు సినిమాలు ఆశించినంత హిట్ కాలేకపోయాయి. దీంతో ప్రస్తుతం స్టోరీలను ఎంచుకునే విషయంలో కాస్త జాగ్రత్తలు పాటిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం ఎస్.బాలవీర్ రచన దర్శకత్వంలో ‘అమరన్‌ ఇన్‌ ది సిటీ చాప్టర్‌-1’అనే సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్‏తో ఈ చిత్రాన్ని ఎస్‌వీఆర్ నిర్మిస్తుండగా.. ఇందులో ఆదికి జోడిగా అవికా గోర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఇందులో సాయి కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఇందులో ఆది తొలిసారిగా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌ పాత్రలో కనిపించబోతున్నాడు. దాదాపు రెండేళ్లపాటు ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి ప్రస్తుతం షూటింగ్‌కి సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. తాజాగా భారీ ఖర్చుతో రూపొందించిన పోలీస్ సెట్‏లో కొన్ని సన్నివేశాలతోపాటు.. నగర శివార్లలో మరిన్ని సీన్స్ తీయనున్నారు. అంతేకాకుండా..ఇందులో గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యత ఉండబోతుందట. ఈ సినిమాలో ఆదిత్య ఓం, కృష్ణుడు, మనోజ్‌ నందన్‌, వీర శంకర్, అయన్, శృతి, రోషన్, మధు మణి తదితరులు నటిస్తున్నారు.

Also Read: Elephant: ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఏనుగుల ముందుకెళ్లారు.. ఆ తరువాత లుంగీ చేతపట్టి పరుగులు తీశారు.. ఫన్నీ వీడియో..

ICC T20 World Cup 2021: దాయాదుల పోరులో టీమిండియాదే పైచేయి.. 5 విజయాలతో పాకిస్తాన్‌పై ఆధిపత్యం.. మరోసారి ఆసక్తి రేపుతోన్న గ్రూప్ 2!

Mobiles: ఆపిల్‌ సంస్థకు షియోమీ షాక్‌.. ఆపిల్‌ని వెనక్కి రెండో స్థానాన్ని ఆక్రమించేసింది.. మొదటి స్థానం ఏ కంపెనీ అంటే..

Ram Gopal Varma: మరో సీక్వెల్ ప్లాన్ చేస్తున్న ఆర్జీవి.. “ఐస్‏క్రీమ్” ఫ్రాంచైజీని తెరకెక్కించనున్న వర్మ ?