Mobiles: ఆపిల్ సంస్థకు షియోమీ షాక్.. ఆపిల్‌ని వెనక్కి రెండో స్థానాన్ని ఆక్రమించేసింది.. మొదటి స్థానం ఏ కంపెనీ అంటే..
Mobiles: స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమీ సంచలనం సృష్టించింది. యాపిల్ కంపెనీని సైతం వెనక్కి నెట్టేసి ప్రపంచంలో రెండో అతిపెద్ద..
Mobiles: స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమీ సంచలనం సృష్టించింది. యాపిల్ కంపెనీని సైతం వెనక్కి నెట్టేసి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఫోన్ల తయారీ సంస్థగా నిలిచింది. ఇక మరో మొబైల్ సంస్థ శాంసంగ్ అగ్రస్థానంలో ఉంది. టెక్నాలజీ మార్కెట్ అనలిస్ట్ నివేదిక ప్రకారం.. 2021 రెండో క్వార్టర్‌లో ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ అమ్మకాల ద్వారా షియోమీ రెండో స్థానానికి చేరుకుంది.
మొత్తం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో 19శాతం షేర్‌లతో దక్షిణ కొరియా దిగ్గజ కంపెనీ శాంసంగ్ టాప్ పొజిషన్‌లో ఉండగా, షియోమీ 17 శాతం షేర్ల వద్ద ముగిసింది. సాధారణంగా ఇప్పటి వరకు శాంసంగ్, యాపిల్‌ల్లో మాత్రమే ఏదో ఒకటి నెంబర్ వన్ స్థానంలో ఉంటూ వచ్చేది. కానీ మొదటి సారి షియోమీ రెండో స్థానానికి చేరుకుని సంచలనం సృష్టించింది.
కాగా, హువాయ్ పతనం తర్వాత మిగతా ఫోన్ కంపెనీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. అయితే ఈ స్థానాన్ని పూరించే పోటీలో షియోమీ పైచేయి సాధించింది. లాటిన్ దేశాలకు 300 శాతంకుపైగా, ఆఫ్రికా దేశాలకు 150 శాతం, పశ్చిమ యూరప్ దేశాలకు 50 శాతం షియోమీ ఫోన్ ఎగుమతులు అయ్యాయి. ఎంఐ11 అల్ట్రా లాంటి ఫోన్ల వల్లే షియోమీ క్రేజ్ మరింతగా పెరిగిందని, అదే సమయంలో ఒప్పో, వివో నుంచి గట్టి పోటీ ఎదురైందని టెక్నాలజీ మార్కెట్ అనలిస్ట్‌లు అభిప్రాయపడుతున్నారు.
Also read: