Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elephant: ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఏనుగుల ముందుకెళ్లారు.. ఆ తరువాత లుంగీ చేతపట్టి పరుగులు తీశారు.. ఫన్నీ వీడియో..

Elephant: అతివిశ్వాసం కొన్ని కొన్ని సార్లు ప్రమాదం బారిన పడేస్తాయి. ఇక్కడ ఇద్దరు యువకులు అదే పరిస్థితి ఎదుర్కొన్నారు.

Elephant: ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఏనుగుల ముందుకెళ్లారు.. ఆ తరువాత లుంగీ చేతపట్టి పరుగులు తీశారు.. ఫన్నీ వీడియో..
Elephants
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 16, 2021 | 9:52 PM

Elephant: అతివిశ్వాసం కొన్ని కొన్ని సార్లు ప్రమాదం బారిన పడేస్తాయి. ఇక్కడ ఇద్దరు యువకులు అదే పరిస్థితి ఎదుర్కొన్నారు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఓ సాయంత్రం వేళ అటవీ ప్రాంతంలో ఒక ఏనుగుల మంద రోడ్డును దాటుతోంది. అదే సమయంలో అటవీ శాఖ సిబ్బంది రోడ్డుపై ట్రాఫిక్‌ను నియంత్రిస్తోంది. ఇంతలో ఇద్దరు యువకులు.. అతివిశ్వాసంతో ఆ ఏనుగుల మందను దాటేందుకు ప్రయత్నించారు. అయితే, వారి రాకను గమనించిన ఓ ఏనుగు.. వారి వాహనంపై దాడి చేసేందుకు పరుగెత్తుకుంటూ వెళ్లింది. దాంతో హడలిపోయిన ఆ ఇద్దరు యువకులు బైక్‌ని వెంటనే వెనక్కి తిప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నంలో వారు బైక్‌తో సహా కింద పడిపోయారు. అప్పటికే ఏనుగు సమీపించడంతో బైక్‌ను వదిలేసి ఓ యువకుడు లుంగీ చేతపట్టి పరుగులు తీయగా.. మరో యువకుడు భయం భయంగా వెనుకడుగు వేశాడు. మరోసారి కింద పడిపోయిన బైక్‌ను తీసుకునేందుకు ప్రయత్నించగా.. ఏనుగు వారిని భయపెట్టే ప్రయత్నం చేసింది. మొత్తానికి ఆ ఇద్దరు యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. ఏనుగులు తమ దారిని తాము వెళ్లిపోయాయి.

అయితే, ఏనుగుల మంద రోడ్డు దాటుతుండటాన్ని అటవీశాఖ అధికారులు వీడియో తీశారు. వారి డేటాబేస్ కోసం ఏనుగులను ఫోటో తీశారు. అదే సమయంలో యువకులు రావడం, బైక్‌పై నుంచి పడిపోవడం.. అంతా ఆ వీడియోలో రికార్డ్ అయ్యింది. అయితే, ఈ వీడియోను ‘ఇండియన్ వైల్డ్ లైఫ్ అఫిషియల్’ ఇన్‌స్టాగ్రమ్ పేజీలో షేర్ చేయగా.. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. వాస్తవానికి అడవులను నరికివేయడం, నివాస స్థలాలు పెరగడంతో అడవిలో ఉండాల్సిన జంతువులు.. జనావాసాల్లోకి వస్తున్నాయి. ఫలితంగా జనాలే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే.. ఏనుగుల మంద ఎక్కువగా జనావాసాల్లోకి రావడం నిత్యం చూస్తుంటాం. వాటిని తరిమేందుకు ప్రయత్నిస్తే.. వాటి ఆగ్రహానికి గురవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏదేమైనా ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెడింగ్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. వారి అతివిశ్వాసంపై సెటైర్లు పేల్చుతున్నారు.

Viral Video:

Also read:

Viral Video: తండ్రికి తగ్గ తనయుడు.. బౌలింగ్‌లో దుమ్మురేపుతున్న జూనియర్‌ మురళీధరన్‌.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న వీడియో..!

Amarnath Temple: జియో మరో సంచలనం.. అమర్‌నాథ్ క్షేత్రం నుంచి ప్రత్యక్ష ప్రసారం.. వర్చువల్ పూజా కార్యక్రమాలు..

AP Covid Cases: ఆంధ్రప్రదేశ్‌ కరోనా బులెటిన్ విడుదల.. ఇవాళ ఎన్ని పాజిటివ్ కేసలు నమోదు అయ్యాయంటే..