Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Covid Cases: ఆంధ్రప్రదేశ్‌ కరోనా బులెటిన్ విడుదల.. ఇవాళ ఎన్ని పాజిటివ్ కేసలు నమోదు అయ్యాయంటే..

AP Covid Cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 81,740 సాంపిల్స్..

AP Covid Cases: ఆంధ్రప్రదేశ్‌ కరోనా బులెటిన్ విడుదల.. ఇవాళ ఎన్ని పాజిటివ్ కేసలు నమోదు అయ్యాయంటే..
Corona Virus
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 16, 2021 | 5:54 PM

AP Covid Cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 81,740 సాంపిల్స్ పరీక్షించిన అధికారులు. 2,345 మంది కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 508 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక గత 24 గంటల్లో 3,0001 మంది కరోనా బాధితులు రికవరీ అయ్యారు. కరోనా కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 16 మంది ప్రాణాలు కోల్పోగా.. అత్యధికంగా గుంటూరు జిల్లాలో ముగ్గురు చనిపోయారు. ఆ తరువాత అనంతపురంలో ఇద్దరు, చిత్తూరులో ఇద్దరు, తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, కర్నూలులో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, విశాఖపట్నంలో ఒక్కరు చొప్పున కరోనాకు బలి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24,854 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కాగా, రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేట్ 2.8 శాతం ఉండగా.. రికవరీ రేటు 98 శాతం ఉంది. అలాగే మరణాల రేటు 0.68 శాతంగా ఉంది.

ఆంధ్రప్రదేశ్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 19,34,450 మంది కరోనా బారిన పడగా.. వీరిలో 18,96,499 మంది కోలుకున్నారు. మిగిలిన 13,097 మంది కరోనా బాధితులు వైరస్ ప్రభావంతో మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24,854 యాక్టీవ్ కేసలు ఉన్నాయి. వీరిలో చాలా వరకు కరోనా బాధితులు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతుండగా.. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ అదుపులో ఉందని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గని నేపథ్యంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. సరైన జాగ్రత్తలు పాటించాలన్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు. ఒకవేళ వెళ్లినట్లయితే.. తప్పకుండా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలని సూచించారు.

Also read:

Navjot Singh Sidhu: వీడని ఉత్కంఠ.. సోనియా, రాహుల్‌తో భేటీ అయిన నవోజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ..

Tokyo olympics 2021: టోక్యో ఒలింపిక్స్‌లో హార్వర్డ్ గ్రాడ్యుయేట్.. కాలేయంలో కణితితో ట్రయల్స్‌లో పాల్గొని సరికొత్త రికార్డు..!

Maha Pushpa Yagam:పద్మావతి అమ్మవారి ఆలయంలో కనకాంబర సహిత కోటి మల్లెపూల మహాయాగం ప్రారంభం.. ఆనలైన్‌లో టికెట్లు లభ్యం