- Telugu News Photo Gallery Tokyo olympics 2020-21 photos Tokyo olympics 2021 american athlet gabby thomson is the second fastest women in world
Tokyo olympics 2021: టోక్యో ఒలింపిక్స్‌లో హార్వర్డ్ గ్రాడ్యుయేట్.. కాలేయంలో కణితితో ట్రయల్స్‌లో పాల్గొని సరికొత్త రికార్డు..!
అమెరికాకు చెందిన గాబీ థామస్.. ఒలింపిక్ ట్రయల్స్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పి ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ప్రస్తుతం ఆమె కళ్లు ఒలింపిక్ పతకంపై పడ్డాయి.
Updated on: Jul 16, 2021 | 5:37 PM

అమెరికాకు చెందిన గాబీ థామస్.. ఇటీవల జరిగిన ఒలింపిక్ ట్రయల్స్‌లో సరికొత్త రికార్డును నెలకొల్పింది. అక్కడ ఆమె 200 మీ. పరుగులో ప్రపంచంలో రెండవ అత్యంత వేగంగా పరిగెత్తిన మహిళా క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. కేవలం 21.61 సెకండ్స్‌లో చేరుకుంది. అయితే గాబా థామస్ హార్వర్డ్ నుంచి పట్టభద్రులయ్యారని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.

'బ్యూటీ విత్ బ్రెయిన్స్'కు గాబీ గొప్ప ఉదాహరణ. ఆమె హార్వర్డ్ నుంచి న్యూరోబయాలజీలో పట్టభద్రురాలయ్యింది. 100 మీటర్లు, 200 మీటర్లు, లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్‌లో శిక్షణ పొందింది. మూడేళ్లలో ఆరు వేర్వేరు ఈవెంట్లలో 22 కాన్ఫరెన్స్ టైటిల్స్ గెలుచుకుంది.

హార్వర్డ్‌లో ఆఫ్రికన్-అమెరికన్ హెల్త్‌కేర్ లో మాస్టర్స్ చేయాలని నిర్ణయించుకుంది. అందుకోసం టెక్సాస్ విశ్వవిద్యాలయంలో చేరింది. ఇక్కడే గాబీ థామస్ నల్లజాతి మహిళలకు అథ్లెటిక్స్‌లో శిక్షణ ఇచ్చే స్నోడ్-బెల్లీ ట్రాక్ క్లబ్‌లో చేరాలని నిర్ణయించుకుంది. ఈ క్లబ్ గాబీకి చాలా నమ్మకాన్ని ఇచ్చింది.

ఒలింపిక్ ట్రయల్స్‌కు ముందు గాబీ గాయపడింది. వైద్యులు ఆమెకు ఎంఆర్‌ఐ స్కాన్ చేయగా, గాబీ కాలేయంలో కణితి ఉందని తేలింది. అయినా ఒలింపిక్ ట్రయల్స్‌లో పాల్గొని రికార్డు సృష్టించి, టోక్యోకు అర్హత సాధించింది. దేశం కోసం ఒలింపిక్ పతకం సాధించేందుకు పయత్నింస్తోంది.

ఒలింపిక్స్‌లో దినా అషర్ స్మిత్, ప్రపంచ ఛాంపియన్ షెల్లీ ఎమ్ ఫ్రేజర్, డాఫ్నే స్కిప్పర్స్ నుంచి ఈ అమెరికన్ క్రీడాకారిణి గట్టి పోటీని ఎదుర్కోనుంది. గాబీ పతకం సాధించే రేసులో తప్పకుండా ఉంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. ట్రయల్స్‌లో ప్రముఖ గ్రిఫిత్ జాయ్నర్స్ నెలకొల్పిన 200 మీటర్ల ప్రపంచ రికార్డుకు చాలా దగ్గరగా వచ్చింది. ఒలింపిక్స్‌లో ఈ రికార్డును బద్దలు కొట్టాలని భావిస్తోంది.





























