- Telugu News Photo Gallery Tokyo olympics 2020-21 photos From rafael nadal to neymar and saina nehwal star athletes not appearing in the tokyo olympic games
Tokyo Olympics 2021: టోక్యో ఒలింపిక్ క్రీడల్లో కనిపించిన 9 మంది స్టార్ ఆటగాళ్లు వీరే..!
Tokyo Olympics 2021: కరోనా కారణంగా గతేడాది జరగాల్సిన సమ్మర్ ఒలింపిక్స్.. ఈ ఏడాది టోక్యో వేదికగా జరగనున్నాయి. అయితే ఈసారి చాలామంది స్టార్ ఆటగాళ్లు ఒలింపిక్స్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వారెవరో చూద్దాం..
Updated on: Jul 15, 2021 | 6:21 PM

స్పానిష్ లెజెండ్ రఫెల్ నాదల్ ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్ నుంచి వైదొలిగాడు. ఈమేరకు నాదల్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టులో తన నిర్ణయాన్ని వెల్లడిస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఫిట్‌నెస్ సమస్యతో టోక్యో ఒలింపిక్స్ నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నాడు.

గాయం కారణంగా టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనడం లేదంటూ స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ మంగళవారం అభిమానులకు తెలియజేశాడు. అయితే, గతంలో ఒలింపిక్స్‌లో తప్పకుండా పాల్గొంటానని పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా, ఫెదరర్ ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలిగి, వింబుల్డన్‌లో యువ ఆటగాడి చేతిలో ఓడిపోయాడు.

బ్రెజిల్ సూపర్ స్టార్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు నేమార్ కూడా ఒలింపిక్స్ నుంచి తప్పుకున్నాడు. తాను ఒలింపిక్స్‌లో ఆడతానని ఇదివరకు చెప్పిన ఈ స్టార్ ఆటగాడు.. చివరి నిముషంలో తప్పుకున్నాడు. అందుకే ఒలింపిక్ జాబితా నుంచి పేరును తొలగించినట్లు తెలుస్తోంది.

చివరి ఒలింపిక్స్ ఆడాలని భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కల నెరవేరలేదు. ఈ ఏడాది జరగబోయే టోక్యో ఒలింపిక్స్‌కు సైనా నెహ్వాల్ అర్హత సాధించలేకపోయింది. ఆమెతోపాటు కిదాంబి శ్రీకాంత్ కూడా అర్హత సాధించలేకపోయాడు. BWF నిబంధనల మేరకు టాప్ 16 ఆటగాళ్లు నేరుగా ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారనే సంగతి తెలిసిందే. కానీ, వీరిద్దరు టాప్ 16లో చోటు సంపాదించలేకపోయారు.

సెరెనా విలియమ్స్ టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనడంలేదని వీసీలో వెల్లడించింది. కానీ, దీనికి ఆమె ఎలాంటి కారణం మాత్రం వెల్లడించలేదు. 39ఏళ్ల సెరెనా 2012 లండన్ ఒలింపిక్స్ లో సింగిల్స్, డబుల్స్ రెండింటిలోనూ బంగారు పతకంతో సహా మొత్తం నాలుగు బంగారు పతకాలను గెలుచుకుంది.

డోపింగ్ నియంత్రణ నిబంధనలను ఉల్లఘించిన కారణంగా 100మీటర్ల ప్రపంచ ఛాంపియన్ క్రిస్టియన్ కోల్మన్కు రెండేళ్ల పాటు నిషేధానికి గురయ్యాడు. ఈ కారణంగా అతను టోక్యో ఒలింపిక్స్‌లో ఆడడం లేదు.

ఒలింపిక్ ఛాంపియన్ మో ఫరా కూడా ఈసారి టోక్యో క్రీడల్లో పాల్గొనడం లేదు.10,000 మీటర్ల ఈవెంట్‌లో ఫరా ఈసారి అర్హత సాధించలేకపోయాడు. లండన్, రియో ఒలింపిక్స్‌లో 5వేల, 10వేల మీటర్లలో బంగారు పతకాలు సాధించాడు. బ్రిటీష్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో అర్హత సాధించాడానికి చివరి అవకాశం లభించినా, అందులో అర్హత సాధించలేకపోయాడు.

4వ నెంబర్ ఆస్ట్రియాకు చెందిన డొమినిక్ థీమ్ రాబోయే టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనడం లేదు. 'అందరికీ హలో, మీ అందరితో పంచుకోవడానికి ఓ విచారకమైన వార్త ఉందంటూ' ట్విట్టర్లో ప్రకటించాడు. నా టీమ్‌తో మాట్లాడిన తరువాత ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నాను, టోక్యో ఒలింపిక్స్ నుంచి తప్పుకుంటున్నానని తెలిపాడు.

అమెరికా నంబర్ వన్ గోల్ఫర్, స్టార్ ప్లేయర్ డస్టిన్ జాన్సన్ కూడా ఈ సారి ఒలింపిక్స్‌లో కనిపించడు. మొదట కరోనా కారణంగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని అభిమానులు భావించారు. కానీ, అమెరికా నుంచి జపాన్ ప్రయాణం చాలా కష్టమని వింత సమాధానం చెప్పి ఒలింపిక్స్ నుంచి తప్పుకున్నాడు.

ఈ ఆటగాళ్లే కాకుండా, ఈ సారి ఉత్తర కొరియా దేశం కూడా టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనడం లేదు. 1988 తరువాత ఉత్తర కొరియా ఒలింపిక్స్‌లో పాల్గొనపోవడం ఇదే మొదటిసారి.




