Khanamet Lands: ఇవి భూములు కాదు.. బంగారు గనులు.. తెలంగాణ సర్కార్ గల్లా పెట్టె ఘళ్లు మణిపించే ఖానాపేట్ సేల్స్!

ఖానామెట్‌ భూముల ఈ ఆక్షన్‌ ముగిసింది. ఖానామెట్‌లోని దాదాపు 15 ఎకరాల్లో 5 ప్లాట్లకు వేలం జరిగింది. కోకాపేటలో భారీ రేటు వచ్చిందనుకుంటే.. ఖానామెట్ భూములకు అంతకు మించిన గిరాకీ వచ్చింది.

Khanamet Lands: ఇవి భూములు కాదు.. బంగారు గనులు.. తెలంగాణ సర్కార్ గల్లా పెట్టె ఘళ్లు మణిపించే ఖానాపేట్ సేల్స్!
Khanamet Lands E Auction
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 16, 2021 | 7:57 PM

Khanamet Lands E-Auction: ఖానామెట్‌ భూముల ఈ ఆక్షన్‌ ముగిసింది. ఖానామెట్‌లోని దాదాపు 15 ఎకరాల్లో 5 ప్లాట్లకు వేలం జరిగింది. కోకాపేటలో భారీ రేటు వచ్చిందనుకుంటే.. ఖానామెట్ భూములకు అంతకు మించిన గిరాకీ వచ్చింది. ప్రభుత్వ ఖజానాకు కోట్లు.. కోట్లు వచ్చి పడ్డాయి. ఊహించినదాని కంటే భారీ ఆదాయం వచ్చింది. రియల్ భూమ్ కాదు.. అంతకు మించిన రేట్లు పలికాయి.. సైబర్ టవర్స్‌కు కూత వేటు దూరంలో ఉన్న భూముల విక్రయంతో రూ.729.41 కోట్ల ఆదాయం వచ్చింది.

ఖానామెట్‌లో ఎకరం భూమి ధర అత్యధికంగా రూ.55 కోట్లు పలికింది. మంజీరా కన్‌స్ట్రక్షన్స్‌ రూ.160.60 కోట్లతో 2.92 ఎకరాలు.. జీవీపీఆర్‌ ఇంజినీర్స్‌ లిమిటెడ్‌ రూ.185.98 కోట్లతో 3.69 ఎకరాలు.. లింక్‌వెల్‌ టెలీసిస్టమ్స్‌ రూ.153.09 కోట్లతో 3.15 ఎకరాలు.. అప్‌టౌన్‌ లైఫ్‌ ప్రాజెక్ట్స్‌ రూ.137.34 కోట్లతో 3.15 ఎకరాలు కొనుగోలు చేశాయి. రూ.92.40 కోట్లతో మరో 2 ఎకరాలను లింక్‌వెల్‌ టెలీసిస్టమ్స్‌ కొనుగోలు చేసింది.

కోకాపేటలోని 49.94 ఎకరాల భూమిని నిన్న తెలంగాణ ప్రభుత్వం విక్రయించింది. ఎనిమిది ప్లాట్లుగా విభజించి వేలం పెట్టింది. ఈ వేలంలోనూ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రభుత్వం ఊహకు అందని రేట పలికింది. గరిష్టంగా ఎకరం భూమి.. 60 కోట్ల రూపాయలు పలికింది. మొత్తం 49 ఎకరాల విక్రయం ద్వారా 2వేల కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వచ్చింది. ఇవాళ వేలంలో సుమారు 730 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే మొత్తంగా 65 ఎకరాలు అమ్మితే.. 2,730కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు వచ్చి పడింది.

Read Also…  Maharashtra: అవినీతి అక్రమాస్తుల కేసులో ఈడీ దూకుడు.. మాజీ హోంమంత్రికి చెందిన రూ.4.20 కోట్ల స్థిరాస్తులు సీజ్!

అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ