Maharashtra: అవినీతి అక్రమాస్తుల కేసులో ఈడీ దూకుడు.. మాజీ హోంమంత్రికి చెందిన రూ.4.20 కోట్ల స్థిరాస్తులు సీజ్!

అవినీతి కేసులో మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ.4.20 కోట్లు విలువచేసే స్థిరాస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారంనాడు జప్తు చేసింది.

Maharashtra: అవినీతి అక్రమాస్తుల కేసులో ఈడీ దూకుడు.. మాజీ హోంమంత్రికి చెందిన రూ.4.20 కోట్ల స్థిరాస్తులు సీజ్!
Anil Deshmukh
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 16, 2021 | 7:37 PM

ED Attaches Maharashtra Ex Home Minister Assets: అవినీతి కేసులో మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ.4.20 కోట్లు విలువచేసే స్థిరాస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారంనాడు జప్తు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈ ఆస్తులను సీజ్ చేసినట్లు ఈడీ తెలిపింది. జప్తు చేసిన ఆస్తుల్లో వోర్లిలోని రూ.1.54 కోట్లు విలువచేసే ఒక రెసిడెన్షియల్ ఫ్లాట్, రాయ్‌గఢ్ జిల్లాలోని ఉరన్‌లో 2.68 కోట్ల బుక్ వాల్యూ కలిగిన స్థలాలు ఉన్నట్టు ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది.

రాష్ట్ర హోం మంత్రిగా ఉన్న సమయంలో బార్ ఓనర్ల నుంచి అక్రమంగా రూ.4.70 కోట్ల ముడుపులు వసూళ్లు చేస్తున్న అభియోగాలను దేశ్‌ముఖ్ ఎదుర్కొంటున్నారు. ఈ అక్రమ సొమ్మును శ్రీ సాయి శిక్షణ సంస్థ పేరుతో ఉన్న ట్రస్టుకు వచ్చిన నిధులుగా దేశ్‌ముఖ్ కుటుంబ సభ్యులు చూపిస్తున్నట్టు ఈడీ ఆరోపించింది. ఈ కేసులో అనిల్ దేశ్‌ముఖ్ ప్రైవేటు కార్యదర్శి సంజీవ్ పలాండే, ప్రైవేట్ అసిస్టెట్ కుందన్ షిండేలను ఇటీవల ఈడీ అరెస్టు చేసింది. దేశ్‌ముఖ్‌పై ముంబై పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ చేసిన అవినీతి ఆరోపణకు సంబంధించి ఓవైపు సీబీఐ దర్యాప్తు జరుపుతుండగా, మరోవైపు ఆయన ఆర్థిక లావాదేవీలపై ఈడీ దర్యాప్తు సాగిస్తోంది.

Read Also…   COVID Precautions: “వ్యాన్‌ దగ్గరకు రండి..చేతులు శుభ్రం చేసుకోండి”.. పరిశుభ్రతతో కరోనాకు చెక్.. టీవీ9 వినూత్న కార్యక్రమం