Srikanth: ఆ సమయంలో చాలా డిప్రషన్ లోకి వెళ్ళిపోయా.. ఆ స్టార్ హీరోలేకపొతే…
ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు హీరో శ్రీకాంత్. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేస్తూనే మధ్య మధ్యలో మాస్ ఆడియన్స్ మెచ్చే సినిమాలను కూడా చేసి ఆకట్టుకున్నారు..

Srikanth: ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు హీరో శ్రీకాంత్. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేస్తూనే మధ్య మధ్యలో మాస్ ఆడియన్స్ మెచ్చే సినిమాలను కూడా చేసి ఆకట్టుకున్నారు ఈ సీనియర్ హీరో. ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు. రామ్ చరణ్ నటించిన గోవిందుడు అందరివాడే, బన్నీ నటించిన సరైనోడు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు. ఆతర్వాత ఒకటి రెండు సినిమాలో విలన్ గా నటించి మెప్పించారు. అయితే గత కొంత కాలంగా శ్రీకాంత్ సినిమాలకు గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడు నటసింహం బాలయ్య తో తలపడేందుకు సిద్ధం అయ్యారు. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ అఖండలో శ్రీకాంత్ విలన్ గా నటిస్తున్నారు. గతంలో లెజెండ్ సినిమాలో విలన్ గా రీఎంట్రీ ఇచ్చిన జగపతిబాబు ఇప్పుడు బిజీగా మారారు. అలానే ఇప్పుడు శ్రీకాంత్ కూడా సెకండ్ ఇనింగ్స్ తో ఫుల్ బిజీ అవుతారని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇటీవల శ్రీకాంత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కెరీర్ ఆరంభంలో విజయాలను అందుకున్నప్పటికీ ఆతర్వాత నిలదొక్కుకోవడానికి చాల కష్టపడ్డానని అన్నారు. ఆసమయంలో ఒకే ఏడాది ఏకంగా ఏడు సినిమాలు ప్లాప్ అయ్యాయి. దాంతో ఎం చేయాలో అర్ధంకాలేదు.. డిప్రెషన్ లోకి వెళ్లి పోయాను అని అన్నారు. సినిమాలు మానేసి ఊరు వెళ్లి వ్యవసాయం పనులు చూసుకోవాలా అని అనుకునేవాడిని.. ఆసమయంలో చిరంజీవి అండగా నిలిచారు. ఆయన ఇచ్చిన సలహాలు, ప్రోత్సాహం వల్ల మళ్లీ ఇండస్ట్రీలో నిలబడగలిగాను అంటూ చెప్పుకొచ్చారు.
మరిన్ని ఇక్కడ చదవండి :