Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RAPO 19 Movie : రామ్ సినిమాలో నదియా.. లుక్ రివీల్ చేసిన చిత్రయూనిట్.. ఆకట్టుకుంటున్న ఫోటో

అత్తారింటికి దారేది సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అత్త పాత్రలో నటించి మెప్పించారు నదియా. ఈ సీనియర్ నటి సెకండ్ ఇండింగ్స్ చాలా సక్సెస్ ఫుల్ గా కంటిన్యూ అవుతుంది.

RAPO 19 Movie : రామ్ సినిమాలో నదియా.. లుక్ రివీల్ చేసిన చిత్రయూనిట్.. ఆకట్టుకుంటున్న ఫోటో
Rapo 19
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Jul 15, 2021 | 9:40 AM

అత్తారింటికి దారేది సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అత్త పాత్రలో నటించి మెప్పించారు నదియా. ఈ సీనియర్ నటి సెకండ్ ఇండింగ్స్ చాలా సక్సెస్ ఫుల్ గా కంటిన్యూ అవుతుంది. ఆ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. పవన్ సినిమా తర్వాత మిర్చి, దృశ్యం, బ్రూస్లీ ,అ ఆ, నా పేరు సూర్య, మిస్ ఇండియా వంటి సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ‘గని’ ‘వరుడు కావలెను’ చిత్రాల్లో నటిస్తున్న నదియా. అలాగే ఇప్పుడు ఓ యంగ్ హీరో సినిమాలో కీలక పాత్రలో నటించనున్నారు నదియా. ఎనర్జిటికి స్టార్ రామ్ ప్రస్తుతం తమిళ్ దర్శకుడు లింగు స్వామి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రామ్ సరసన ‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకురుస్తున్నారు.

ఈ సినిమాకు ఉస్తాద్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరెక్కుతుందని తెలుస్తుంది. ఇప్పటికే సెట్స్ లో రామ్ కు సంబంధించిన ఫోటోని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ క్రమంలో దర్శకుడు లింగుస్వామి ఇన్స్టాగ్రామ్ వేదికగా సీనియర్ నటి నదియా లుక్ ని రివీల్ చేశారు. ఫొటోలో నదియా పసుపు చీరలో కళ్ళద్దాలు ధరించి హుందాగా కన్పిస్తోంది. అయితే ఈ సినిమాలో రామ్ తల్లి పాత్రలో నదియా నటిస్తుందని అంటున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే హైదరాబాద్ లో ప్రారంభం అయింది. ప్రస్తుతం హీరో రామ్ తో పాటుగా ఇతర ప్రధాన పాత్రలు పాల్గొనే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు జాతీయ స్థాయి గుర్తింపు పొందిన హీరోయిన్.. ఎవరో తెలుసా..

Premi Vishwanath: “కార్తీక దీపం” సీరియల్‏కు నో చెప్పా.. వంటలక్క సంచలన వ్యాఖ్యలు..

Kudi Yedamaithe: అమలపాల్ ప్రధాన పాత్రలో నటించిన కుడి ఎడమైతే ట్రైలర్ లాంచ్ లైవ్ వీడియో..