ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు జాతీయ స్థాయి గుర్తింపు పొందిన హీరోయిన్.. ఎవరో తెలుసా..

TV9 Telugu Digital Desk

TV9 Telugu Digital Desk | Edited By: Rajitha Chanti

Updated on: Jul 14, 2021 | 9:15 PM

ఇటీవల కొద్ది రోజులుగా స్టార్ హీరోయిన్స్‏కు సంబంధించిన రేర్ ఫోటోలు, చైల్డ్‏హుడ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కరోనా లాక్‏డౌన్ వలన షూటింగ్స్ నిలిచిపోవడంతో..

ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు జాతీయ స్థాయి గుర్తింపు పొందిన హీరోయిన్.. ఎవరో తెలుసా..
1

ఇటీవల కొద్ది రోజులుగా స్టార్ హీరోయిన్స్‏కు సంబంధించిన రేర్ ఫోటోలు, చైల్డ్‏హుడ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కరోనా లాక్‏డౌన్ వలన షూటింగ్స్ నిలిచిపోవడంతో.. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండాల్సి వచ్చింది. దీంతో పలువురు సెలబ్రెటీలు దొరికిన సమయాన్ని తమ కుటుంబంతో గడిపేందుకు ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా.. తమ అభిమానులకు సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వస్తున్నారు. అప్పుడప్పుడూ లైవ్‌లు, మరికొన్ని సార్లు త్రోబ్యాక్ ఫోటోలతో హీరోలు, హీరోయిన్లు.. అభిమానులను అలరిస్తున్నారు. ఇక ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేశాయి. ఆ కోవలోనే ఈ ఫోటోలోని చిన్నారి ఎవరో గుర్తుపట్టండి.. చూద్దాం.

2

గుర్తుపట్టలేకపోయారా ? తండ్రి ఒళ్లో అన్నప్రసాన చేయించుకున్న ఈ చిన్నారి ఎవరో కాదు.. ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న అందాల భామా కీర్తి సురేష్. తమిళ్‏లో పలు సినిమాలు కీర్తి సురేష్.. రామ్ సరసన “నేను శైలజ” సినిమాతో తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ తర్వాత వరుసగా తెలుగులో ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది ఈ చెన్నై భామ. ఆ తర్వాత నాగా అశ్విన్ తెరకెక్కించిన “మహానటి” సినిమాతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబు సరసన “సర్కారు వారి పాట” సినిమాలో చేస్తుంది. ఇటీవల నితిన్‏కు జోడిగా “రంగ్ దే” సినిమా చేసిన.. హిట్ అందుకోలేకపోయింది. దీంతో ఇప్పుడు ఈ చెన్నై భామ ఆశలన్నీ సర్కారు వారి పాట మూవీపైనే ఉన్నాయి. మరి ఈ సినిమాకు కీర్తికి ఎలాంటి సక్సెస్ అందించబోతుందో చూడాలి.

ట్వీట్..

Also Read: Premi Vishwanath: “కార్తీక దీపం” సీరియల్‏కు చెప్పా.. వంటలక్క సంచలన వ్యాఖ్యలు..

Rajini Kanth: “అన్నాతే” కంప్లీట్ చేయడానికి కోల్‏కత్తాలో అడుగుపెట్టిన రజినీ.. సూపర్ స్టార్ ఫైనల్ షెడ్యూల్..

Actress Pragathi: పాపం ఎంత కష్టమొచ్చింది.. ట్రెడ్‏మిల్ పై నటి ప్రగతి వర్కవుట్స్ మాములుగా లేవుగా..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu