Premi Vishwanath: “కార్తీక దీపం” సీరియల్‏కు నో చెప్పా.. వంటలక్క సంచలన వ్యాఖ్యలు..

TV9 Telugu Digital Desk

TV9 Telugu Digital Desk | Edited By: Rajitha Chanti

Updated on: Jul 14, 2021 | 10:03 PM

వంటలక్క.. తెలుగు రాష్ట్రా ప్రజలకు ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. "కార్తీక దీపం" సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ప్రేమి విశ్వనాథ్. నిజానికి.. తన పేరు కంటే..

Premi Vishwanath: కార్తీక దీపం సీరియల్‏కు నో చెప్పా.. వంటలక్క సంచలన వ్యాఖ్యలు..
Vantalakka

వంటలక్క.. తెలుగు రాష్ట్రా ప్రజలకు ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. “కార్తీక దీపం” సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ప్రేమి విశ్వనాథ్. నిజానికి.. తన పేరు కంటే.. వంటలక్కగానే గుర్తింపు పొందింది ఈ మలయాళీ నటి. బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్‌లో వంటలక్క క్యారెక్టర్ చేస్తూ తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ప్రతి రోజు అందరి ఇంటి మనిషిగా ప్రేక్షకులను పలకరిస్తుంది. వంటలక్క-డాక్టర్ డాబు.. ఈ రెండు పేర్లు బుల్లితెరపై ఓ రేంజ్‏లో క్రేజ్ సంపాదించుకున్నాయి. డాక్టర్ బాబు, వంటలక్క ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు సీరియల్‏కు దూరమైన ప్రేక్షకులు భరించడం కష్టంగా మారిపోయింది. ఒకరోజు ఎపిసోడ్‏లో ప్రేమి విశ్వనాథ్.. అదెనండీ మన వంటలక్క.. కనిపించకపోతే.. ఇంకేమైన ఉందా.. కానీ వంటలక్క నిజాంగానే సీరియల్‏కు దూరమైతే ఎలా ఉంటుంది. బుల్లి తెర ప్రేక్షకులకు.. వంటలక్క అభిమానులకు ఈ విషయం నమ్మడం కాస్త కష్టమే. కానీ నిజాంగానే వంటలక్క .. ఈ సీరియల్‏ను వదిలేద్దామనుకుందట. ఇప్పుడు కాదండోయ్.. గతంలో ఒకానొక సమయంలో మన వంటలక్కకు ఆ ఆలోచన తట్టిందట. ఎందుకో తెలుసుకుందామా.

Premi Vishwanth

Premi Vishwanth

ఇటీవల ఓ ఛానెల్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వంటలక్క కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. తనకు మలయాళంలో కంటే తెలుగులోనే ఎక్కువగా గుర్తింపు వచ్చిందని.. ఒరిజినల్ కంటే ఇక్కడే ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిందని చెప్పుకొచ్చింది వంటలక్క. తెలుగు ఆడియన్స్ తనను ప్రతీ ఇంట్లోనూ ఆడపడుచులా చూస్తున్నారని.. అది తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పింది ప్రేమీ విశ్వనాథ్. మలయాళంలో వచ్చిన “కరత ముత్తు” సీరియల్‌కు “కార్తీక దీపం” తెలుగు వర్షన్. అక్కడ ఇప్పటికే సీరియల్ అయిపోయింది కానీ తెలుగులో మాత్రం మరో ఆర్నెళ్లకు పైగానే ఉండేలా కనిపిస్తుంది. మన ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా సాగుతూనే ఉంది కార్తీక దీపం. దీనిని ఇక్కడ రాజేంద్ర తెరకెక్కిస్తున్నాడు. అయితే కరత ముత్తు తర్వాత తెలుగులో ఈ సీరియల్ చేయాలనుకున్నపుడు తాను చేయలేనని ముందుగానే చెప్పిందట. తనకు తెలుగు రాదని.. అందుకే కార్తీక దీపం సీరియల్ చేయలేనని చెప్పిందట. కానీ డైరెక్టర్ రాజేంద్ర పట్టుబట్టడంతో సీరియల్ చేయాల్సి వచ్చిందని.. ఇప్పుడు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. ఒకవేళ ప్రేమి విశ్వనాథ్ ఈ సీరియల్ చేయకపోయి ఉంటే.. ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ మిస్సయిపోయుండేది.

Also Read: Rajini Kanth: “అన్నాతే” కంప్లీట్ చేయడానికి కోల్‏కత్తాలో అడుగుపెట్టిన రజినీ.. సూపర్ స్టార్ ఫైనల్ షెడ్యూల్..

Actress Pragathi: పాపం ఎంత కష్టమొచ్చింది.. ట్రెడ్‏మిల్ పై నటి ప్రగతి వర్కవుట్స్ మాములుగా లేవుగా..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu