AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajini Kanth: “అన్నాతే” కంప్లీట్ చేయడానికి కోల్‏కత్తాలో అడుగుపెట్టిన రజినీ.. సూపర్ స్టార్ ఫైనల్ షెడ్యూల్..

సూపర్ స్టార్ రజినీ కాంత్ ప్రస్తుతం డైరెక్టర్ శివ దర్శకత్వంలో నటిస్తోన్న సినిమా అన్నాత్తే. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఎన్నో అవాంతరాలు, వాయిదాలు దాటుకుంటూ... షూటింగ్

Rajini Kanth: అన్నాతే కంప్లీట్ చేయడానికి కోల్‏కత్తాలో అడుగుపెట్టిన రజినీ.. సూపర్ స్టార్ ఫైనల్ షెడ్యూల్..
Rajinikanth
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 14, 2021 | 7:35 PM

Share

సూపర్ స్టార్ రజినీ కాంత్ ప్రస్తుతం డైరెక్టర్ శివ దర్శకత్వంలో నటిస్తోన్న సినిమా అన్నాత్తే. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఎన్నో అవాంతరాలు, వాయిదాలు దాటుకుంటూ… షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తలైవా అభిమానులకు తాజాగా మరో క్రేజీ అప్‍డేట్ వచ్చేసింది. దాదాపు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈమూవీకి సంబంధించి ప్యాచ్ వర్క్ కొన్ని సీన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. వీటిని కంప్లీట్ చేసేందుకు మేకర్స్ ఫైనల్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఇక ఈ మూవీ ఆఖరు షూటింగ్‏ను కోల్‏కత్తాలో చేయనున్నారు. ఇందుకోసం చిత్రయూనిట్ ఇప్పటికే బెంగాల్‏లో ల్యాండ్ అయ్యింది. ఇటీవల అమెరికా నుంచి వచ్చిన రజినీ కూడా అన్నాతే షూటింగ్ కంప్లీట్ చేసేందుకు బెంగాల్‏లో అడుగుపెట్టారు. ఈరోజు నుంచి ఈ మూవీ షెడ్యూల్ ప్రారంభం అయ్యింది.

వాస్తవానికి ఈ సినిమా షూట్ ఎప్పుడో కంప్లీట్ కావాల్సింది. కానీ అటు తమిళనాడు పొలిటికల్ ఇష్యూ.. రజినీ రాజకీయాల్లోకి ఎంట్రీ.. హైదరాబాద్‏లో అనారోగ్యానికి గురికావడం ఇలా పలు సమస్యలతో షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇక సూపర్ స్టార్ ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత అన్నాత్తే షూటింగ్ కొంచెం కంప్లీట్ చేశారు. ఆ తర్వాత లాక్‏డౌన్ కారణంగా చిత్రీకరణకు మరోసారి బ్రేక్ పడింది. ఇక రజినీ తన రెగ్యూలర్ హెల్త్ చెకప్ కోసం అమెరికా వెళ్లడంతో.. సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇటీవల రజినీ అమెరికా ట్రిప్ ముగించుకుని వచ్చిన తర్వాత.. తాజాగా ఈరోజు అన్నాత్తే షూట్ తిరిగి ప్రారంభమైంది. ప్రస్తుతం చివరి దశలో ఉన్న షూట్ కంప్లీట్ కాగానే.. వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి.. నవంబర్ నాటికి ప్రేక్షకుల ముందుకు అన్నాత్తే చిత్రాన్ని తీసుకురావాలని భావిస్తున్నారు మేకర్స్. ఇందులో జగపతి బాబు, ఖుష్బూ, నయనతార, కీర్తి సురేష్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.

Also Read: Actress Pragathi: పాపం ఎంత కష్టమొచ్చింది.. ట్రెడ్‏మిల్ పై నటి ప్రగతి వర్కవుట్స్ మాములుగా లేవుగా..

Samantha Akkineni: ఫ్రీ టైం ఎంజాయ్ చేస్తున్న అక్కినేని వారి కోడలు.. పెంపుడు కుక్క పిల్లతో కలిసి బెలూన్ ఆట..

Gopichand: సక్సెస్‏ఫుల్ డైరెక్టర్‏తో గోపిచంద్ సినిమా.. మరోసారి హ్యాట్రిక్ కాంబో రిపీట్..

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..