Karthika Deepam: ప్రియమణిని ఏసీపీ ఎంక్వైరీ .. మోనిత ను 25వ తేదీ పెళ్లి కావాలా జైలు కావాలా తేల్చుకో అంటున్న దీప

Karthika Deepam: రోజుకో ట్విస్ట్ తో తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకుని ఈరోజు 1093వ ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది. మోనిత ఏఎస్పీ రోషిణి కి తాను మోసపోయానని కంప్లైట్ ఇచ్చిన..

Karthika Deepam: ప్రియమణిని ఏసీపీ ఎంక్వైరీ .. మోనిత ను 25వ తేదీ పెళ్లి కావాలా జైలు కావాలా తేల్చుకో అంటున్న దీప
Karthika Deepam
TV9 Telugu Digital Desk

| Edited By: Surya Kala

Jul 15, 2021 | 11:16 AM

Karthika Deepam: రోజుకో ట్విస్ట్ తో తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకుని ఈరోజు 1093వ ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది. మోనిత ఏఎస్పీ రోషిణి కి తాను మోసపోయానని కంప్లైట్ ఇచ్చిన నేపథ్యంలో ఎంక్వైరీ చేశారా అని అడగడానికి రోషిణి ఇంటికి వస్తుంది. అప్పడు రోషిణి మోనిత కు ఊహించని షాక్ ఇస్తూ రిప్లై ఇస్తుంది.. వాళ్ళందరూ నీవల్ల ఎదురైన పరిస్థితికి బెదరకుండా సంతోషంగా ఉంటున్నారు. తప్పు చేశానన్న గిల్టీ ఫీలింగ్ నాకు అతనిలో కనిపించలేదు.. నా భర్త తప్పు చేశాడు అని అతని భార్య నమ్మడం లేదు.. ఈ కేసు చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది. ఈ ఏసీపీ డ్యూటీ చేస్తే.. ఆ కేసు అంతు చూస్తేనే గానీ వదిలి పెట్టాడు.. నీ కడుపులో బిడ్డ ఉంది కనుక మీకు న్యాయం చేయాలని చూస్తున్నా.. ఎంక్వైరీలో మీ వైపు తప్పుతుంటే మీకు శిక్ష.. వాళ్ళ వైపు తప్పుంటే వాళ్ళకి శిక్ష అంటుంది రోషిణి.. దీంతో మోనిత షాక్ తింటుంది. ఈవిడ నాకు సపోర్ట్ చేస్తుందా వాళ్లకి చేస్తుందా.. నాకంటే కాంప్లికేటెడ్ పర్సన్ గా ఉంది అని అనుకుంటూ వెళ్లిపోతుంది.

కార్తీక్ ని దీప భోజనానికి రమ్మని పిలుస్తుంది. ఆకలి లేదంటే.. అబద్ధాలు చెప్పకండి.. అలవాటు అయిపోతుంది. ఏమి ఆలోచిస్తున్నారు.. కేసు గురించా.. మోనిత గురించా అంటే.. కాదు అంటాడు.. మరి మామయ్యగారు రావడం గురించా అంటే.. అవును అంటే.. తినకుండా ఉంటె.. సమస్య పరిష్కారం అయిపోతుందా అంటుంది దీప. తింటే సమస్య తీరుతుంది అంటే చెప్పు.. కడుపునిండా తింటా అంటాడు కార్తీక్. నేను చెప్పేది వింటే దొరుకుంటుంది అంటుంది దీప.. రేపు పొద్దున్న మీరు పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళండి.. అంటే.. నువ్వు కూడా నాకు కొత్త సమస్య తీసుకుని వస్తున్నావా.. రేపు మీరు పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళండి.. రేపు నేను ఓ ముఖ్యమైన పని చూసుకుని వస్తాను.. అంటుంది.. మీరు ఇక్కడ జనతా హాస్పటల్ పెట్టడం వలన అందరం ఇక్కడే ఉన్నట్లు చెప్పండి అంటుంది. అప్పుడు కార్తీక్ రేపు అంత ముఖ్యమైన పని ఏమిటీ అంటే.. వెళ్లి వచ్చాక మీకే తెలుస్తుంది అంటుంది దీప.. దీంతో కార్తీక్ దీప తో తినడానికి ఇంట్లోకి వెళతాడు. శ్రావ్య దీపుకి పాల డబ్బా తీసుకుని రమ్మని అంటే.. ఆదిత్య కోపం చూపిస్తాడు.. వదిన ఫోన్ చేసి.. డాడీకి ఏమీ చెప్పొద్దూ అంటుంది. ఇన్ని రోజులు అమ్మ ఉంటె నాకు ఏమీ తెలిసేది కాదు.. నాకు అన్నీ తెలుస్తున్నాయి.. అమ్మలాగే వదిన కూడా ఏమీ చెప్పడం లేదు అంటుంది.

ప్రియమణిని రోషిణి ఎంక్వైరీకి పిలుస్తుంది. నిజం చెప్పకపోతే లాఠీలకు పనిచెబుతా అంటుంది రోషిణి. అసలు నాకు ఏమీ తెలియదమ్మా అని ప్రియమణి అంటే.. లాఠీలకు పనిచెబుతా అంటుంది రోషిణి.. నాకు తెలిసిన నిజం అంతా చెబుతా అంటుంది ప్రియమణి. ఫోన్ ఆన్ చేయవద్దని.. మోనితకు ఎంక్వైరీ కి వచ్చినట్లు చెప్పవద్దని అంటుంది రోషిణి. మరోగదిలోకి వచ్చిన ప్రియమణి.. మోనితకు మొగుడులా ఉంది .. నిజం చెబితే మోనిత చంపేస్తుంది.. చెప్పకపోతే ఇక్కడ చంపేస్తారు. అనుకుంటూ.. మోనిత ఫోన్ చేసి.. ఆమె ఏమి చెప్పమంటే అదే చెబుతా.. అప్పుడు ఏ గొడవా ఉండదు అనుకుంటూ మోనిత కు ఫోన్ కాల్ చేయడానికి ట్రై చేస్తుంది.

మోనిత ప్రియమణి ఎక్కడ అని ఆలోచిస్తుంటే భాగ్యం వస్తుంటే.. గెట్ అవుట్ అంటుంది.. భాగ్యం తిరిగి వెళ్ళిపోతే నేను కసిరితే దెబ్బకు భయపడి వెళ్ళిపోయింది. అనుకుంటుంటే.. దీప వస్తుంది.. మోనిత దీపని చూసి.. ప్రియమణిని దీప దాచిందా నా రహస్యాలను అన్నీ తెలుసుకుందా అని ఆలోచిస్తుంటే.. భాగ్యం వచ్చి.. ఏమిటే గెట్ అవుట్ అంటావా నువ్వే ఊరు బయట ఉంటావే.. ఇద్దరిలో ఒకరికి సమాధానం చెప్పు.. ఇన్నాళ్లు మాకు దమ్ములేక నీ నాటకాలను చూస్తూ ఉరుకున్నామని అనుకున్నావా ఉప్పు పాతర వేస్తా ఏమనుకున్నావో అంటుంటే.. ఎగిరి పడింది చాలు .. అంటూ ఎందుకు వచ్చావు అని మోనిత అడిగితే.. ఎందుకొచ్చానో నీకు తెలియాదా అంటుంది దీప.. నువ్వు ఎందుకొచ్చావో నాకు ఎలా తెలుస్తుంది అంటే.. భాగ్యం దీనికి ఎలా తెలుస్తుంది.. పెళ్ళైన వాడిని వలలో వేసుకోవడం తెలుస్తుంది.. కడుపు తెచ్చుకోవడం ఇంకా తెలుస్తుంది. మాటలు జాగ్రత్తగా రానీ అంటుంది మోనిత ..

భాగ్యాన్ని ఆపిన దీప..పోలీస్ కంప్లైంట్ ఇచ్చావంట అంటే.. అవును మీరు అందరూ కలిసి నాకు అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నిస్తుంది మోనిత.. చేసిన పనికి సిగ్గు లేకుండా నువ్వే కంప్లైంట్ ఇస్తావా .. అని భాగ్యం అంటే.. దీప ఏకంగా పోలీసు ఆఫీసర్నే మా ఇంటికి పంపించావు అంటే మా ఇంటి పరువు బయట పడేద్దామనా అని దీప అంటే.. అవును అంటుంది మోనిత నాకు న్యాయం జరగకపోతే.. ఏకంగా వీథిలోనే నాటకం మొదలు పెడతా అంటుంది మోనిత.. దీప నవ్వుతు అలాగా సోఫాలో కూర్చుని ఏమి న్యాయం కావాలి నీకు నా భర్తకు భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారని తెలుసు.. అయినా కూడా తప్పుఒప్పులు ఆలోచించకుండా తొందరపడింది నువ్వు.. అంతా జరిగిపోయాక న్యాయం గురించి మాట్లాడితే.. ఎవరు నీకు సపోర్ట్ చేస్తారు అని దీప అంటే.. అందుకే చట్టానికి అప్పగించా అంటుంది మోనిత. ఆ చట్టానికి నిన్నే అప్పగించడానికి వచ్చాను.. ఈ కడుపు.. 25న పెళ్లి కాసేపు పక్కన పెట్టు.. నీకు దుర్గ , కొంతకాలంగా మాదగ్గర పని చేశాడు .. దుర్గ పేరు చెప్పగానే నీకు చెమటలు పట్టేశాయి.. దుర్గకు నీ రహస్యాలు అన్నీ తెలుసు.. కదా మోనిత .. అంజి కూడా గుర్తుండే ఉంటాడు.. మాయా డ్రైవర్ అంటే.. గతం అన్ని గుర్తు తెచ్చుకుని వనుకుంటుంది. భాగ్యం చచ్చింది గొర్రె.. దీప మిగిలింది కూడా చెప్పమ్మా.. అంజికి కూడా నీ రహస్యాలు అన్నీ తెలుసు.. వాళ్లిద్దరూ నాకు తోడబుట్టిన అన్నలతో సమానం.. దీప చిటిక వేస్తె.. క్షణంలో వస్తారు.. ఎక్కడికంటే అక్కడికి వచ్చి నీ చరిత్రని .. వద్దులే నీకు చాల క్లియర్ గా పిక్చర్ అర్ధమైంది అనుకుంటా.. ఏసీపీ గారి ముందు వాళ్లిదరికి హాజరు పరిచాక అప్పుడు మాట్లాడుకుందాం సరేనా.. అంటూ.. పెళ్ళికి డేట్ పెట్టిన డేట్ వైపు చూస్తూ..నా భర్తను, నన్ను అందరినీ అందించాలని చూస్తున్నట్లు ఉన్నావు.. గుర్తు పెట్టుకో.. ఇదే 25వ తేదీ నీకు పెళ్లి కావాలా జైలు కావాలా తేల్చుకో అంటే.. భాగ్యం పెళ్లా జైలా అంటూ అడుగుతుంది. దీప పడిపోయేలా ఉంది అంటుంది.

Also Read: రేపు కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పార్వేట ఉత్సవం.. ఏకాంతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu