Paruveta Utsavam: రేపు కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పార్వేట ఉత్సవం.. ఏకాంతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి
Paruveta Utsavam In Tirupati: కలియుగదైవం శ్రీవారు కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి. శ్రీవారి ఆలయం నిత్యకల్యాణం పచ్చతోరణంగా రోజుకో ఉత్సవంలో భక్తుల రద్దీతో కలకాలాడుతూ..
Paruveta Utsavam In Tirupati: కలియుగదైవం శ్రీవారు కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి. శ్రీవారి ఆలయం నిత్యకల్యాణం పచ్చతోరణంగా రోజుకో ఉత్సవంలో భక్తుల రద్దీతో కలకాలాడుతూ ఉంటుంది. తాజాగా సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి నడిచిన మార్గం శ్రీవారి మెట్టు అని భక్తులు విశ్వసిస్తారు. ఈ మార్గం సమీపంలో శ్రీనివాసమంగాపురంలో శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఈ స్వామివారి సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు వైభవంగా ముగిశాయి. అనంతరం పార్వేట ఉత్సవం నిర్వహించడానికి టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవం మరుసటి రోజైన జులై 16వ తేదీన పార్వేట ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ ముఖ మండపంలో ఉదయం10నుంచి11 గంటల వరకు ఏకాంతగా ఆణివార ఆస్థానం, పార్వేట ఉత్సవం ఆస్థానం నిర్వహించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల ఆదేశాల మేరకు కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలలో భాగంగా ఆలయంలో ఏకాంతంగా స్నపన తిరుమంజనం, వాహన సేవలు, ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read: హిందూసాంప్రదాయంలో స్త్రీ జడ విశిష్టత ఏమిటి.. జడకి మూడు పాయలే ఎందుకు అల్లుతారో తెలుసా..!
తిరుపతిలోని ప్రభుత్వాస్పత్రిలో ఉద్యోగాలనియామకం.. రేపే చివరి తేదీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే..
ఈ రోజు ఏ రాశివారికి ఏఏ రంగాలు అనుకూలంగా ఉన్నాయి.. ఏ రాశివారు ఏ పూజ చేస్తే శుభఫలితాలు పొందుతారంటే..