Covid-19 Third Wave: ఇండోనేషియాలో మరణ మృదంగం.. ఒక్కరోజే కరోనాతో 1,205 మంది మృతి
Indonesia Covid-19: ప్రపంచమంతా కరోనావైరస్ విలయతాండవం కొనసాగుతూనే ఉంది. సెకండ్ వేవ్ అనంతరం ప్రస్తుతం పుట్టుకొస్తున్న కోవిడ్ వేరియంట్లతో అంతటా ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో
Indonesia Covid-19: ప్రపంచమంతా కరోనావైరస్ విలయతాండవం కొనసాగుతూనే ఉంది. సెకండ్ వేవ్ అనంతరం ప్రస్తుతం పుట్టుకొస్తున్న కోవిడ్ వేరియంట్లతో అంతటా ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో అత్యంత ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ అనేక దేశాలకు వ్యాపించి ఆందోళనకు గురిచేస్తోంది. ఈ తరుణంలో ఇండోనేషియాను థర్డ్ వేవ్ వణికిస్తోంది. డెల్టా ప్లస్ వేరియంట్‌తో ఆ దేశంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. డెల్టా వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య భారీగా పెరిగింది. దీంతోపాటు మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో ఆక్సిజన్ కొరత, బెడ్ల కొరత కూడా తీవ్రంగా వేధిస్తోంది. ఇండోనేషియాలో డేల్టా వేరియంట్ శరవేగంగా వ్యాప్తి చెందుతుండటంతో కేసులు గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా నమోదవుతున్నాయి. గత కొన్నిరోజుల నుంచి నిత్యం 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.
ఇండోనేషియాలో గత 24 గంటల్లో 54,000 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు 1,205 మరణాలు సంభవించాయి. కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారని అధికారులు పేర్కొంటున్నారు. నెల నుంచి నిత్యం 50 వేల నుంచి 57 వేల వరకూ కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తున్న వేళ మెడికల్ ఆక్సిజన్ నిల్వలు లేకపోవడం దేశంలో ఆందోళన కలిగిస్తోంది. కరోనా మరణాల్లో చాలా మంది ఆక్సిజన్ అందకపోవడంతోనే మరణిస్తున్నారని పేర్కొంటున్నారు.
Also Read: