టోక్యో ఒలింపిక్స్‌లో శరణార్థుల టీం.. ఒలింపిక్ పతాకంతో బరిలోకి.. ప్రపంచ శాంతి కోసమే అంటోన్న ఐఓసీ
Tokyo Olympics 2021: టోక్యో ఒలింపిక్స్ బరిలో శరణార్థులు నిలవనున్నారు. ఒలింపిక్ అసోసియేషన్ చేసిన ఓ మంచి ఆలోచనతో శరణార్థులకు చక్కటి అవకాశం అందింది.
Tokyo Olympics 2021: టోక్యో ఒలింపిక్స్ బరిలో శరణార్థులు నిలవనున్నారు. ఒలింపిక్ అసోసియేషన్ చేసిన ఓ మంచి ఆలోచనతో శరణార్థులకు ఇలాంటి చక్కటి అవకాశం అందింది. ఈమేరకు వారు ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ అథ్లెట్లతో తలపడే అవకాశం దక్కింది. మొదటిసారిగా 2016 ఒలింపిక్స్‌లో శరణార్థుల టీం అగుడుపెట్టింది. ఇది రెండవసారి. యుద్ధాలు, అంతర్గత పోరాటాలు, సైనిక పోరాటాలు ఇలా ఎన్నో కారణాలతో సొంత దేశాన్ని విడిచిపెట్టి చాలామంది పరాయి దేశాలకు చేరుకుంటున్నారు. ఇలాంటి వారిలో మనోధైర్యం నింపేందుకు ఒలింపిక్ కమిటీ ఇలాంటి నిర్ణయం తీసుకుంది.
ఇక 2016 జట్టులో ఇథియోపియా, ది డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సిరియా, సౌత్ సుడాన్ దేశాలకు చెందిన అథ్లెట్లు పాల్గొన్నారు. గతేడాదిలాగే టోక్యో ఒలింపిక్స్ 2021లో 29 మందితో కూడిన జట్టును ఐఓసీ బరిలోకి దింపనుంది. ఇందులో సిరియా, అఫ్ఘానిస్తాన్, సుడాన్, ఇరాన్ లాంటి మొత్తం 13 దేశాలకు చెందిన అథ్లెట్లు ఉన్నారు. బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, తైక్వాండో, సైక్లింగ్, షూటింగ్, జూడో, కరాటే, స్విమ్మింగ్ లాంటి మొత్తం 12 ఆటల్లో శరణార్థులు తలపడనున్నారు. కాగా, ఇందులో గత ఒలింపిక్స్‌లో పాల్గొన్న వాళ్లలో ఆరుగురు మరోసారి టోక్యోలో కనిపించనున్నారు. వీరు ఒలింపిక్ పతాకంతో ఆరంభ వేడుకల్లో పాల్గొననున్నారు. అలాగే ఒకవేళ పతకం గెలిస్తే.. మెడల్ ప్రధానం చేసే సమయంలో ఒలింపిక్ గీతాన్ని వినిపించనున్నారు.
An #Olympics team of 29 refugee athletes competing across 12 sports at the Tokyo Games will compete under the Olympic flag pic.twitter.com/LaWD5PxZmq
— Reuters (@Reuters) July 16, 2021
Also Read:
టెస్టు క్రికెట్‌లో 400 పరుగులు కొట్టిన తొలి బ్యాట్ప్‌మెన్.. 99 ఏళ్ల వరకు రికార్డు చెక్కుచెదరలేదు
Tokyo Olympics 2021: ఒలింపిక్స్‌లో తొలిసారి ఎంట్రీ ఇవ్వనున్న క్రీడలేవో తెలుసా?