AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: ఫ్లడ్‌లైట్ల వెలుగులో ప్రాక్టీస్ మ్యాచ్.. రాహుల్ ద్రవిడ్ ఆలోచన మాములుగా లేదుగా.. ఎందుకో తెలుసా?

శిఖర్ ధావన్ సారథ్యంలోని భారత జట్టు మరో రెండు రోజుల్లో శ్రీలంంతో పరిమిత ఓవర్ల సిరీస్‌లో తలపడనుంది. ఆదివారం నుంచి కొలంబో వేదికగా ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఇరు జట్లు మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లో తలపడనున్నాయి.

IND vs SL: ఫ్లడ్‌లైట్ల వెలుగులో ప్రాక్టీస్ మ్యాచ్.. రాహుల్ ద్రవిడ్ ఆలోచన మాములుగా లేదుగా.. ఎందుకో తెలుసా?
Ind Vs Sl Rahul Dravid
Venkata Chari
|

Updated on: Jul 16, 2021 | 7:20 PM

Share

IND vs SL: శిఖర్ ధావన్ సారథ్యంలోని భారత జట్టు మరో రెండు రోజుల్లో శ్రీలంంతో పరిమిత ఓవర్ల సిరీస్‌లో తలపడనుంది. ఆదివారం నుంచి కొలంబో వేదికగా ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఇరు జట్లు మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో.. పలు ప్రాక్టీస్ మ్యాచ్‌లాడిన టీమిండియా యువ జట్టు.. తాజాగా చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ప్రాక్టీస్ మొదలుపెట్టింది. భారత జట్టులోకి కొత్తగా ఐదుగురు క్రికెటర్లు వచ్చారు. వీరిలో కొంతమందికి ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఆడిన అనుభవం లేదు. అందుకే రాహుల్ ద్రవిడ్ సూచన మేరకు డై/నైట్ ప్రాక్టీస్ మ్యచ్ ఆడారు. ఈ నెల 18న ఫస్ట్ వన్డే మ్యాచ్‌తో శ్రీలంక టూర్ ప్రారంభం కానుంది. అనంతరం జులై 20న, రెండో వన్డే, 23న మూడో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్‌లన్ని మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్నాయి.

వన్డే సిరీస్ అనంతరం టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. మొదటి టీ20 ఈనెట 25న జరగనుంది. అలాగే జులై 27న రెండో టీ20, 29న మూడవ టీ20 జరగనుంది. టీ20 మ్యాచులన్ని రాత్రి 8 గంటలకు మొదలుకానున్నాయి. దీంతో శ్రీలంక పర్యటన పూర్తికానుంది. కాగా, ఈ సిరీస్‌కు సంబంధించి సోనీ ఛానెల్ ప్రత్యక్ష ప్రసారాన్ని అందించనుంది. అయితే, ఈ మేరకు సోనీ ఛానల్ ఫేస్‌బుక్‌తో ఓ ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు భారత్, శ్రీలంక సిరస్‌కు సంబంధించిన హైలెట్స్, వీడియోలు ప్రసారం చేసేందుకే ఫేస్‌బుక్‌ తో టై అయిందని ప్రకటించింది. మూడు వన్డేలు, మూడు టీ20 లకు సంబంధించిన హైలెట్స్, వీడియోలను ఫేస్‌బుక్ వాచ్ ద్వారా చూడవచ్చని సోనీ ఛానెల్ పేర్కొంది.

భారత జట్టు జులై 28, 2012 నుంచి శ్రీలంకలో ఒక్క వన్డేలోనూ ఓడిపోలేదు. శ్రీలంకలో వరుసగా 8 వన్డేల విజయ పరంపరను కొనసాగిస్తోంది టీమిండియా జట్టు. శ్రీలంకలో ఇప్పటి వరకు వరుసగా ఇన్ని వన్డేల్లో ఇతర విజిటింగ్ జట్టు గెలవలేదు. 2017 లో టీమిండియా శ్రీలంక జట్టును 5-0తో క్లీన్ స్వీప్ చేసింది. యువకులతో కూడిన జట్టుకు ధావన్ నాయకత్వం వహించనున్నాడు. హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ వంటి ప్లేయర్లు శ్రీలంక టూర్‌లో ఉన్నారు. ఇప్పటి వరకు టీమిండియా జట్టు శ్రీలంకలో 61 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 28 మ్యాచుల్లో గెలవగా, 27 మ్యాచుల్లో ఓడిపోయారు. అలాగే 6 మ్యాచుల్లో మాత్రం ఫలితం తేలలేదు. ఇప్పటి వరకు శ్రీలంకలో ఎక్కువ మ్యాచులు గెలిచిన జట్టుగా భారత్ రికార్డు సాధించింది. ఇతర జట్లేవీ ఇన్ని మ్యాచుల్లో గెలవలేదు.

భారత జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్య, నితీశ్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), యుజ్వేందర్ చాహల్, రాహుల్ చాహర్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్య, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, దీపక్ చాహర్, నవదీప్ సైనీ, చేతన్ సకారియా

Also Read:

Tokyo Olympics 2021: ఒలింపిక్స్‌లో తొలిసారి ఎంట్రీ ఇవ్వనున్న క్రీడలేవో తెలుసా?

Tokyo olympics 2021: టోక్యో ఒలింపిక్స్‌లో హార్వర్డ్ గ్రాడ్యుయేట్.. కాలేయంలో కణితితో ట్రయల్స్‌లో పాల్గొని సరికొత్త రికార్డు..!

T20 World Cup 2021: సూపర్ 12లో దాయాదుల పోరు; గ్రూపు 2లో భారత్, పాకిస్తాన్ టీంలు