T20 World Cup 2021: సూపర్ 12లో దాయాదుల పోరు; గ్రూపు 2లో భారత్, పాకిస్తాన్ టీంలు
టీ 20 ప్రపంచ కప్‌లో సూపర్ 12 లో గ్రూప్ 2 లో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడనున్నాయి.
T20 World Cup 2021: రాబోయే టీ20 ప్రపంచ కప్‌లో సూపర్ 12లో భారత్, పాకిస్తాన్ టీంలు తలపడనున్నాయి. సూపర్ 12లో గ్రూప్ 2లో టీమిండియా.. పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లతో తలపడనుంది. ఈమేరకు నేడు ఐసీసీ సూపర్ 12 గ్రూపులతో పాటు, రౌండ్ 1లోని రెండు గ్రూపుల్లో తలపడే జట్లను ప్రకటించింది. టీ20 వరల్డ్ కప్ యూఏఈ వేదికగా అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు జరగనున్న సంగతి తెలిసిందే.
మార్చి 20, 2021 నాటికి టీంల ర్యాకింగ్స్ ఆధారంగా ఎంపిక చేసినట్లు ఐసీసీ తెలిపింది. సూపర్ 12 లో రెండు గ్రూపులు ఉన్నాయి. ఇందులో గ్రూపు 1లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌లతోపాటు రౌండ్ 1లో తలపడిన జట్లలో గ్రూపు ఏ విజేత, గ్రూపు బీలో రన్నర్‌గా నిలిచిన జట్లు ఉండనున్నాయి. టీమిండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లతో పాటు గ్రూపు ఏలో రన్నర్ టీం, గ్రూపు బీలో విన్నర్ టీంలు ఉన్నాయి. అలాగే రౌండ్ 1 లో రెండు గ్రూపులు ఉన్నాయి. వీటిలో గ్రూపు ఏ లో శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా టీంలు పోటీపడనున్నాయి. ఇక గ్రూప్ బీ లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పీఎన్‌జీ, ఓమన్ టీంలు ఉన్నాయి. ఈరెండు గ్రూపుల్లోని విజేతలు, రన్నర్‌లుగా నిలిచిన టీంలు సూపర్ 12 లోని జాయిన కానున్నాయి.
ఈ మేరకు ఐసీసీ యాక్టింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జియోఫ్ అలార్డైస్ మాట్లాడుతూ, ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్‌లో పోటీపడే గ్రూపులను ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఆయా గ్రూపుల్లో కొన్ని అద్భుతమైన మ్యాచులు జరగనున్నాయని ఆశిస్తున్నాం. కరోనాతో భారత్‌లో జరగాల్సిన ఈ టోర్నీ, యూఏఈకి తరలించాం. మరో మూడు నెలల్లో టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. కచ్చితంగా మంచి ఎంటర్టైన్‌మెంట్ లభిస్తుందని నమ్మకంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు.
గ్రూపులు:
రౌండ్ 1
గ్రూప్ ఏ: శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా గ్రూప్ బీ: బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పాపువా న్యూ గినియా, ఒమన్
సూపర్ 12 :
గ్రూప్ 1: ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఏ1, బీ2 గ్రూప్ 2: ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, ఏ2, బీ1
Also Read:
Tokyo Olympics 2021: ఒలింపిక్స్‌లో తొలిసారి ఎంట్రీ ఇవ్వనున్న క్రీడలేవో తెలుసా?