AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టెస్టు క్రికెట్‌లో 400 పరుగులు కొట్టిన తొలి బ్యాట్ప్‌మెన్‌.. 99 ఏళ్ల వరకు రికార్డు చెక్కుచెదరలేదు

క్రికెట్‌లో మూడంకెల స్కోర్ దాటాలని ప్రతీ బ్యాట్స్‌మెన్‌ కోరుకుంటాడు. అందుకే చెత్త బంతులను వదిలేస్తూ.. చూడ చక్కనైన షాట్స్‌తో..

టెస్టు క్రికెట్‌లో 400 పరుగులు కొట్టిన తొలి బ్యాట్ప్‌మెన్‌.. 99 ఏళ్ల వరకు రికార్డు చెక్కుచెదరలేదు
Cricketer
Ravi Kiran
|

Updated on: Jul 16, 2021 | 7:16 PM

Share

క్రికెట్‌లో మూడంకెల స్కోర్ దాటాలని ప్రతీ బ్యాట్స్‌మెన్‌ కోరుకుంటాడు. అందుకే చెత్త బంతులను వదిలేస్తూ.. చూడ చక్కనైన షాట్స్‌తో శతకానికి చేరువవుతుంటారు. ఆ మార్క్‌ను చేరుకోగానే బ్యాట్స్‌మెన్‌ ఆనందానికి అవధులు ఉండవు. మరి డబుల్ సెంచరీ సాధిస్తే.? ట్రిపుల్ సెంచరీని అందుకుంటే.?.. ఈ రికార్డులు ఇప్పటి బ్యాట్స్‌మెన్లు అలవోకగా చేధిస్తారని మీరు అనుకోవచ్చు. కానీ టెస్ట్ క్రికెట్‌లో 400 పరుగులు సాధించిన ఓ ఆటగాడి రికార్డును 99 ఏళ్ల వరకు ఎవ్వరూ బద్దలకొట్టలేకపోయారు.. అతడెవరో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆ ఆటగాడి పేరు ఆర్చీ మాక్లారెన్. ఇంగ్లాండ్ తరపున 35 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన అతడు.. కౌంటీ క్రికెట్ ఛాంపియన్‌షిప్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించాడు. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే మ్యాచ్ 1895వ సంవత్సరం జూలై 16న జరిగింది. లాంక్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆర్చీ.. సోమర్‌సెట్‌పై 424 పరుగులు సాధించాడు. అప్పట్లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇది అత్యధిక వ్యక్తిగత స్కోర్. దాదాపు 99 సంవత్సరాల పాటు ఈ రికార్డు చెక్కుచెదరలేదు. ఆ తర్వాత వెస్టిండీస్ లెజెండ్ బ్రియాన్ లారా 1994వ సంవత్సరంలో దీనిని బద్దలు కొట్టాడు.

424 మ్యాచ్‌ల్లో 47 సెంచరీలు, 22 వేలకు పైగా పరుగులు..

కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ ఆర్చీ మెక్‌క్లారెన్ ఫస్ట్-క్లాస్ కెరీర్ అద్భుతంగా ఉంది. మొత్తం 424 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఆర్చీ.. 34.15 సగటుతో 22,236 పరుగులు చేశాడు. ఇందులో 47 సెంచరీలు, 95 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Also Read:

గోడ నుంచి వింత శబ్దాలు.. తీరా చూసి ఖంగుతిన్న అధికారులు.!

ఈ ఫోటోలో పిల్లి దాగుంది.. దాన్ని గుర్తించడం చాలా కష్టం.. మీరు కనిపెట్టగలరా.?

వరల్డ్‌ స్నేక్‌ డే రోజు.. శ్రీవారి భక్తులకు భారీ నాగుపాము షాక్..!

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్‌కార్డుల పంపిణీకి తేదీ ఖరారు..