ఇదేం పెళ్లి పిలుపు.. వచ్చే అతిథులకు రూల్స్.. ఆ షరతులు చూస్తే షాక్ అవ్వాల్సిందే..
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కీలక ఘట్టం.. సామాన్యుల నుంచి ధనికులు.. రాజ కుటుంబీకుల వరకు ఇలా ప్రతి ఒక్కరు తమ పెళ్లిని ఎంతో ఘనంగా చేసుకోవాలని కోరుకుంటారు.

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కీలక ఘట్టం.. సామాన్యుల నుంచి ధనికులు.. రాజ కుటుంబీకుల వరకు ఇలా ప్రతి ఒక్కరు తమ పెళ్లిని ఎంతో ఘనంగా చేసుకోవాలని కోరుకుంటారు. అలాగే..సాధ్యమైనంతవరకు తమ బంధువులను.. స్నేహితులు అందరూ తమ పెళ్లికి రావాలని సాధారంగా ఆహ్వానిస్తుంటారు. కుటుంబసమేతంగా పెళ్లికి వచ్చి నాలుగు అక్షింతలు వేసి.. ఆశీర్వాదించి వెళ్లండి.. భోజనం తిని వెళ్లండని ఆహ్వానం పలుకుతారు. ఇక ఇటీవల పలు వెడ్డింగ్ కార్డ్స్ కూడా పలు రకరకాలుగా క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఓ వెడ్డింగ్ ఇన్విటేషన్ మాత్రం చాలా వెరైటీగా క్రియేట్ చేశారు. అందులో పెళ్లికి వచ్చే అతిథులకు కొన్ని రూల్స్ పెట్టారు. అదేంటీ రూల్స్ పెట్టడం అనుకుంటున్నారా ? నిజమే.. తమ పెళ్లికి వచ్చే అతిథులకు కొన్ని షరతులు పెట్టారు. ఈ ఆహ్వాన పత్రిక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ వెరైటీ వెడ్డింగ్ ఆహ్వాన పత్రికలో పెళ్లికి వచ్చే అతిథులు.. ఏం చేయాలి.. ఏం చేయకూడదు అనే రూల్స్ అందులో ఉన్నాయి. ముఖ్యంగా పెళ్లికి వచ్చే అతిథులెవరు పెళ్లికూతురుతో మాట్లాడొద్దు. కనీసం 75 డాలర్లు అంటే రూ. 5500 గిఫ్ట్ ఇవ్వాలని షరతులు పెట్టాలి. ఓ వెడ్డింగ్ ప్లానర్ పెళ్లికి వచ్చే అతిథుల సంఖ్యను నిర్ధారించుకోవడానికి ఓ మెయిల్ పంపించారు. అందులోనూ పెళ్లిలో పాటించాల్సిన రూల్స్ కూడా చెప్పారు. ఈ మెయిల్‌ను రెడిట్‌లో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్ అవుతుంది. గుడ్ మార్నింగ్.. ఇది పెళ్లికి కచ్చితంగా ఎంత మంది వస్తారో తెలుసుకోవడానికి చేస్తున్న మెయిల్. ఇందులోనే కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. ముందుగానే మీతోపాటు ఎవరైనా వస్తున్నారా చెప్పండి అని మెయిల్ పంపాడు సదరు వెడ్డింగ్ ప్లానర్. అందులో రూల్స్ ఇలా ఉన్నాయి.
1. పెళ్లికి కనీసం 15 నుంచి 30 నిమిషాల ముందు రావాలి. 2. తెలుపు, గోధుమ రంగు దుస్తులు ధరించకూడదు. 3. పోనీటెయిల్ తప్ప రకరకాల జడలు వేసుకోవద్దు. 4. ముఖానికి పూర్తిగా మేకప్ వేసుకోవద్దు. 5. సెర్మనీని ఎవరూ రికార్డు చేయవద్దు. 6. పెళ్లి కూతురుతో అసలు మాట్లాడొద్దు. 7. చివరిగా ప్రతి ఒక్కరూ కనీసం 75 డాలర్లు, అంతకన్నా ఎక్కువ గిఫ్ట్ తీసుకుని వస్తేనే లోనికి అనుమతిస్తాం.
ఇలా రకరకాల రూల్స్ పెట్టారు సదరు వెడ్డింగ్ ప్లానర్. ఇది చూసిన నెటిజన్లు.. తమదైన స్టైల్లో కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: KGF-2: రాకీబాయ్ క్రేజ్ అంటే మాములుగా ఉండదు మరి.. విడుదలకు ముందే కేజీఎఫ్-2 రికార్డ్స్..