KGF-2: రాకీబాయ్ క్రేజ్ అంటే మాములుగా ఉండదు మరి.. విడుదలకు ముందే కేజీఎఫ్-2 రికార్డ్స్..
KGF-2 Teaser: కన్నడ రాక్‌స్టార్ యశ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన "కేజీఎఫ్" చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

KGF-2 Teaser: కన్నడ రాక్‌స్టార్ యశ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన “కేజీఎఫ్” చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. కన్నడ సినీ పరిశ్రమలో కేజీఎఫ్ చిత్రం ఓ సంచలనం సృష్టించింది. దీంతో అప్పటివరకు కేవలం కన్నడ స్టార్ హీరోగా ఉన్న యశ్.. పాన్ ఇండియా లెవల్లో సూపర్ స్టార్‌గా మారాడు. ఈ చిత్రాన్ని అద్భుతంగా చిత్రీకరించడంతో.. ప్రశాంత్ నీల్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇక కేజీఎఫ్ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న “కేజీఎఫ్-2” కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా వాస్తవానికి ఈరోజే (జూలై 16న) విడుదల కావాల్సి ఉంది. కానీ.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మూతపడడం.. ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుతుండడంతో థియేటర్లు ఓపెన్ కావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే 100 శాతం ప్రేక్షకులతో రోజుకు నాలుగు షోలు ప్రదర్శించినప్పుడే సినిమాను విడుదల చేయనున్నట్లుగా ఇటీవలే చిత్రయూనిట్ ప్రకటించింది.
ఇదిలా ఉంటే.. విడుదలకు ముందే కేజీఎఫ్-2 మూవీ రికార్డ్స్ సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా టీజర్ మరో మైలురాయిని అధిగమించింది. తాజాగా ఈ మూవీ టీజర్ 200 మిలియన్ల వ్యూస్ దక్కించుకుని రికార్డ్ సృష్టించింది. ఈ ఏడాది జనవరిలో విడుదలైన ఈ సినిమా టీజర్.. ప్రేక్షకులకు విశేషంగా ఆకట్టుకుంది. ఇందులోని యాక్షన్ సన్నివేశాలు, గత సినిమా కథను గుర్తుచేస్తూ.. జరగబోయే కథను వివరిస్తూ విడుదల చేసిన ఈ టీజర్‌కు ప్రేక్షకులకు రొమాలు నిక్కబోడుచుకున్నాయి. అంతేకాకుండా.. ఈ వీడియో 8.4 మిలియన్లకుపైగా లైక్స్, 11 మిలియన్లకుపైగా కామెంట్స్, వంద కోట్లకుపైగా ఇంప్రెషన్స్ సంపాదించింది. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, రవీనా టండన్ కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ టీజర్ 200 మిలియన్ల వ్యూస్ సాధించడంపై చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ “గ్యాంగ్స్టర్స్ ఎప్పుడూ క్రేజీగానే ఉంటారు” అంటూ ట్వీట్ చేశారు.
ట్వీట్..
You gangsters are just the craziest!!! Thank you for making our monster unstoppable and fearless ?#KGF2Teaser200MViewshttps://t.co/Bmoh4Tz9Ry pic.twitter.com/9HEWFernhf
— Prashanth Neel (@prashanth_neel) July 16, 2021
Also Read: Nayanthara: నెట్‌ఫ్లిక్స్‌లోకి “బాహుబలి” వెబ్ సిరీస్.. కీలకపాత్రలో లేడి సూపర్ స్టార్.?
MAA Elections 2021: “మా” ఎలక్షన్స్ పై బాలయ్య సంచలన వ్యాఖ్యలు.. కౌంటర్ ఇచ్చిన మెగా బ్రదర్..



