AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MAA Elections 2021: “మా” ఎలక్షన్స్ పై బాలయ్య సంచలన వ్యాఖ్యలు.. కౌంటర్ ఇచ్చిన మెగా బ్రదర్..

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్‏గా మారాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి అధ్యక్ష పదవికి పోటీ పెరిగింది.

MAA Elections 2021: మా ఎలక్షన్స్ పై బాలయ్య సంచలన వ్యాఖ్యలు.. కౌంటర్ ఇచ్చిన మెగా బ్రదర్..
Nagababu
TV9 Telugu Digital Desk
| Edited By: Rajitha Chanti|

Updated on: Jul 16, 2021 | 5:27 PM

Share

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్‏గా మారాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి అధ్యక్ష పదవికి పోటీ పెరిగింది. ఎప్పుడూ కేవలం ఇద్దరు మాత్రమే పోటీ చేసే ఎన్నికల్లో ఈసారి ఐదుగురు పోటీ చేస్తామని ప్రకటించడంతో.. మా ఎన్నికలు రాజకీయంగా మారిపోయాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అభ్యర్థులు బహిరంగంగా ప్రచారాలు చేస్తూ.. విమర్శించుకుంటున్నారు. ఇప్పటికే మా ఎన్నికల్లో లోకల్, నాన్ లోకల్ అనే వివాదం నడుస్తుండగా.. తాజాగా నందమూరి బాలకృష్ణ మాటలు మరింత వేడి పుట్టించాయి.

నిన్న బాలకృష్ణ మా ఎన్నికలపై స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ పరిశ్రమలో సరికొత్త చర్చకు దారితీశాయి. “ఇన్నిరోజులు టాలీవుడ్ ప్రముఖులు తెలంగాణ ప్రభుత్వంతో సన్నిహితంగా ఉన్నారు. వారు అడిగితే ప్రభుత్వం ఒక్క ఎకరం భూమి ఇవ్వదా ? అందులో ‘మా’ కు శాశ్వత భవనం నిర్మించవచ్చు కదా” అంటూ బాలయ్య ప్రశ్నించారు. ఇప్పటి వరకు ‘మా’కు శాశ్వత భవనం ఎందుకు నిర్మించలేదు? అని నిలదీశారు. అలాగే ‘మా’కు భవనం నిర్మిస్తానని చెప్పిన మంచు విష్ణుకు తన మద్ధతు ఉంటుందని తెలిపారు.

అయితే బాలయ్య వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు మాట్లాడుతూ.. ఎన్నికలను ఏకగ్రీవం చేయాలనుకోవడం చాలా తప్పు. ఎవరిని అధ్యక్షుడిగా ఎన్నుకోవాలో మా సభ్యులు నిర్ణయిస్తారన్నారు. అలాగే మా బిల్డింగ్ గురించి ప్రస్తావిస్తూ.. గతంలో మురళీ మోహన్ గారు ప్రెసిడెంట్‏గా ఉన్నప్పటి నుంచి మా బిల్డింగ్ గురించి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఎవరు దాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోయారు. ప్రస్తుతం చాంబర్‏లో ఉన్న చిన్న ఆఫీస్ రూమ్‏లో మా కార్యక్రమాలు చేస్తున్నాం. దీనికి గతంలో చేసిన ప్రెసిడెంట్స్ కారణం అని చెప్పుకొచ్చారు. అలాగే.. ఎన్నికల నుంచి తప్పుకుంటామనడం సరైనది కాదని.. పోటీలో నిల్చోవాలని అన్నారు. ఇక మంచు విష్ణు మా బిల్డింగ్ కడతాను అన్నారు. కానీ స్థలం ఎక్కడుందో తెలుసా ? అని అన్నారు.

ఇక ప్రకాశ్ రాజ్ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో మూడు గ్రామాలను దత్తత తీసుకున్నారని.. ఆయన మా బిల్డింగ్ కోసం కృషి చేస్తానని చెప్పారని.. అందుకే ఆయనకు మద్దతు ఇస్తున్నట్లుగా చెప్పారు.

Also Read: Kudi Yedamaithe Review: అనుక్షణం సస్పెన్స్ థ్రిల్లింగ్.. ఎన్నో మలుపులతో అమలాపాల్ “కుడి ఎడమైతే”.. ఎలా ఉందంటే..

Anupama Parameswaran: ఆటలో మునిగిపోయానంటున్న అనుపమ పరమేశ్వరన్.. బానిసయ్యానంటూ షాకింగ్ కామెంట్స్..