Telangana-Andhra: ఇక్కడేమో నాటు పడవల్లో.. అక్కడేమో బైక్ పెట్రోల్ ట్యాంక్‌లో.. వాటే క్రియేటివీటీ..

Telangana-Andhra: రాష్ట్రాల సరిహద్దుల్లో నక్సల్స్ కదలికలపై తప్ప - అక్రమ దందాలపై పూర్తిగా నిఘా కొరవడింది. ఫలితంగా తెలంగాణ - మహారాష్ట్ర..

Telangana-Andhra: ఇక్కడేమో నాటు పడవల్లో.. అక్కడేమో బైక్ పెట్రోల్ ట్యాంక్‌లో.. వాటే క్రియేటివీటీ..
Liqour 2
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 18, 2021 | 5:38 PM

Telangana-Andhra: రాష్ట్రాల సరిహద్దుల్లో నక్సల్స్ కదలికలపై తప్ప – అక్రమ దందాలపై పూర్తిగా నిఘా కొరవడింది. ఫలితంగా తెలంగాణ – మహారాష్ట్ర మధ్య గోదావరి మార్గంలో జోరుగా లిక్కర్ అక్రమ రవాణా సాగుతోంది. అయితే మూడో కంటికి తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న ఈ లిక్కర్ దందా టీవీ9 కెమెరాకు చిక్కింది. నాటు పడవల్లో మూడోకంటికి తెలియకుండా సాగుతున్న ఆ దందాను చూస్తే మన ఎక్సైజ్ శాఖ ఎలా మామూళ్ల మత్తులో మూలుగుతుందో అర్థం అవుతుంది. గోదావరి మార్గంలో దర్జాగా సాగుతున్న ఆ అక్రమమద్యం దందాకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

గోదావరిలో జాలర్లు చేపలు పట్టడం కోసం ఉపయోగించే నాటు పడవలు.. అక్రమార్కులు లిక్కర్ రవాణాకు ఉపయోగిస్తున్నారు. దర్జాగా పట్టపగలే అక్రమంగా లిక్కర్ బాటిళ్లను రాష్ట్రాలు దాటిస్తున్నారు. పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంతా కొరిగిందన్న చందంగా.. లిక్కర్ మాఫియా దందా నడుస్తోంది. టీవీ9 కెమెరాకు చెందిన దృశ్యాలను చూస్తే పట్టపగలే లిక్కర్ వ్యాపారులు ఎంత దర్జాగా దందా నిర్వహిస్తున్నారో అర్థం అవుతుంది. తెలంగాణ లిక్కర్ పక్క రాష్ట్రాలకు నాటు పడవల్లో అక్రమంగా రవాణా అవుతున్నా మామూళ్ల మత్తులో మూలుగుతున్న స్థానిక ఎక్సైజ్ అధికారులు కళ్ళప్పగించి చూస్తున్నారు. ఫలితంగా గోదావరి మార్గంలో జోరుగా సాగుతున్న ఆ లిక్కర్ దందాకు అడ్డుచెప్పేవారే లేకుండాపోయారు.

లిక్కర్ మాఫియా ఇక్కడ సిండికేటై దోచుకుంటున్నది చాలదన్నట్లు పక్క రాష్ట్రాలపై కన్నేసింది. మహారాష్ట్రలో మద్యపానం నిషేధం ఉన్న ప్రాంతాల్లో ఈ మద్యం అమ్మి అధికంగా సొమ్ముచేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే గోదావరి మార్గంలో ఇలా నాటు పడవల్లో లిక్కర్‌ను మహారాష్ట్రకు తరలిస్తున్నారు. ఈ దందా అంతా మహారాష్ట్ర- తెలంగాణ సరిహద్దుల్లోని గోదావరి తీరంలో, కాళేశ్వరం ప్రాంతంలో జరుగుతుంది. మహారాష్ట్రలోని గడ్చిరోలి, చంద్రపూర్ జిల్లాల్లో కొన్ని సంవత్సరాల నుండి మధ్యపాన నిషేధం అమలు జరుగుతుంది. దింతో కొంతమంది వ్యాపారులు ఇల్లీగల్ దందాకు తెరలేపారు. ఇందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మద్యం వ్యాపారులతో ఒప్పందం కుదుర్చుకొని గోదావరి మార్గంలో మద్యం తరలిస్తున్నారు. కాళేశ్వరం వద్ద గోదావరి నదిపై అంతర్ రాష్ట్ర వంతెన వున్నప్పటికీ ఎవరి కంట పడకుండా నాటు పడవల్లో రాష్ట్రాలు దాటిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని కాళేశ్వరం, మహదేవ్‌పూర్ మద్యం దుకాణాల నుండి ఈ లిక్కర్ తరలిస్తున్నారు. గోదావరి ఒడ్డున వీటి కాటన్లు మార్చి గన్నీ బ్యాగ్‌లలో మద్యం బాటిళ్లను ప్యాక్ చేస్తున్నారు. తెలంగాణ కాటన్స్, లేబుల్, బాటిల్స్ బ్యాచ్ నెంబర్లు ఎవరూ గుర్తుపట్టకుండా అక్కడే లిక్కర్ కాటన్స్ మొత్తం కాలబెడుతున్నారు. గత కొద్ది రోజుల నుండి గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న ఈ ఇల్లీగల్ దందా తాజాగా టీవీ9 కెమెరా కు చిక్కింది. గోదావరి మార్గంలో తరలిస్తున్న ఈ మద్యంను సిరొంచ తాలూకాలోని అంకీస ఆసరేళ్లి, అరుడా, టకుమట్ల, మొట్ల తేకాడ, లక్ష్మీపూర్, అంబట్ పల్లి, రామజాపూర్ గ్రామాలకు తరలిస్తున్నారు.

ఇంత బహిరంగంగా మద్యం రాష్ట్రాలు దాటుతుంటే ఎక్సైజ్ శాఖ ఏంచేస్తుందని స్థానికులు ప్రశిస్తున్నారు. మధ్య నిషేధం ఉన్న గ్రామాల్లో అమ్మకాలు జరిపి అధిక సంపాదన కోసమే ఇలా బరితెస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇలాంటి వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, గోదావరి తీరం వెంట చీమ చటుక్కుమన్నా పసిగట్టే ఖాకీలు ఇంత దర్జాగా దందా జరుగుతుంటే ఏం చేస్తున్నట్టో.

ఏపీలో మరీ విచిత్రంగా.. తెలంగాణ పరిస్థితి ఇలాఉంటే.. ఆంధ్రాలో మరోరకమైన దందా నడుస్తోంది. అధికారుల నుంచి తప్పించుకునేందుకు రకరకాల జిత్తులు పన్నుతున్నారు. ఊహించని రీతిలో ప్లాన్స్ వేస్తూ మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. అయితే, దొంగలకే ఇంత తెలివితేటలు ఉంటే.. వాళ్లను పట్టుకునే పోలీసులకు ఎంత ఉండాలి.. అందుకే వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఆ ప్రయత్నాలన్నింటినీ చిత్తు చేస్తూ అడ్డంగా బుక్ చేసేస్తున్నారు. కాగా, తాజాగా ఓ యువకుడు అక్రమంగా మద్యాన్ని తరలించిన విధానం చూస్తే ముక్కున వేలేసుకుంటారు. ఆదివారం నాడు.. కృష్ణా జిల్లాలోని వీరులపాడు మండలం పెద్దాపురం చెక్‌పోస్ట్ వద్ద అక్రమంగా మద్యం తరలిస్తున్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తొలుత పెద్దగా అనుమానించని పోలీసులు.. ఆ తరువాత అతని ప్రవర్తనలో తేడా కొట్టడంతో అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే అతని బైక్‌ని పక్కకు ఆపి చెక్ చేయగా.. అందులో కనిపించిన వాటిని చూసి షాక్ అయ్యారు పోలీసు. ద్విచక్రవాహనం పెట్రోల్ ట్యాంక్‌ను కట్ చేసి ఒక ర్యాక్‌గా ఏర్పాటు చేశారు. అందులో మద్యం సీసాలు పెట్టి తరలిస్తున్నారు. ఇది చూసిన పోలీసులు.. అక్రమంగా తరలిస్తున్న 34 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. బైక్‌ను సీజ్ చేశారు. అలాగే.. వీటిని తరలిస్తున్న కేతనకొండకు చెందిన వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Also read:

Etela Rajender: ఈటెల రాజేందర్ సరికొత్త వ్యూహం!.. తెరపైకి బీజేపీ అభ్యర్థిగా జమునా రెడ్డి.. అసలు కారణమదేనా?..

Kodali Nani: చంద్రబాబు, టీడీపీ నేతలపై మరోసారి తీవ్రంగా స్పందించిన మంత్రి కొడాలి నాని.. ఆయనెప్పుడైనా అలా చేశారా? అంటూ..

AP-TS Water Disputes: ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ జలవివాదం.. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన ఎంపీ జీవీఎల్..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!