బుల్లెట్ గాయాల వల్లే ఫోటోజర్నలిస్టు డానిష్ సిద్దిఖీ మరణించాడు.. కాబూల్ లోని భారత ఎంబసీ ప్రకటన..

Umakanth Rao

Umakanth Rao | Edited By: Phani CH

Updated on: Jul 18, 2021 | 7:03 PM

శరీరానికి తగిలిన పలు బుల్లెట్ గాయాల వల్లే భారత ఫోటోజర్నలిస్టు డానిష్ సిద్దిఖీ మరణించాడని కాబూల్ లోని భారత ఎంబసీ తెలిపింది. కాబూల్ నుంచి ఆయన మృతదేహం ఇండియాకు చేరనుంది.

బుల్లెట్ గాయాల వల్లే ఫోటోజర్నలిస్టు డానిష్ సిద్దిఖీ మరణించాడు.. కాబూల్ లోని భారత ఎంబసీ ప్రకటన..
Danish Siddiqui

Follow us on

శరీరానికి తగిలిన పలు బుల్లెట్ గాయాల వల్లే భారత ఫోటోజర్నలిస్టు డానిష్ సిద్దిఖీ మరణించాడని కాబూల్ లోని భారత ఎంబసీ తెలిపింది. కాబూల్ నుంచి ఆయన మృతదేహం ఇండియాకు చేరనుంది. జామియా మిలియాలోని స్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక్కడే ఖననం చేయాలనీ సిద్దిఖీ కుటుంబ సభ్యులు కోరారని ఇందుకు అంగీకరించామని జామియా మిలియా ఇస్లామియా వీసీ తెలిపారు. ఎంతో భవిష్యత్తు ఉన్న సిద్దిఖీ మరణం తమను కలచివేసిందని ఆయన చెప్పారు. ఇక్కడి గ్రేవ్ యార్డు కేవలం ఈ యూనివర్సిటీ ఉద్యోగులు, వారి మైనర్ పిల్లలకు మాత్రమే ఉద్దేశించినదని ఆయన చెప్పారు. రాయిటర్స్ వార్తా సంస్థకు పని చేసిన సిద్దిఖీ 2018 లో పులిట్జర్ అవార్డు అందుకున్నారు. 2005 నుంచి 2007 వరకు ఏజెకె మాస్ కమ్యూనికేషన్ రీసెర్చ్ సెంటర్ లో చదివారు.. ఆయన తండ్రి ఇదే సెంటర్ లో ఫ్యాకల్తీ ఎడ్యుకేషన్ డీన్ గా పని చేశారు.

పాకిస్తాన్ తో గల స్పిన్ బోల్డాక్ ప్రాంతంలో ఆఫ్ఘన్ దళాలకు, తాలిబన్లకు మధ్య జరుగుతున్న పోరులో సిద్దిఖీ మరణించారు. ఆఫ్ఘన్ దళాల తరఫున ఆయన ఈ వార్ జోన్ ని కవర్ చేయడానికి వచ్చినట్టు తెలిసింది. ఆయన మృతిపై తాలిబన్లు స్పందిస్తూ ఆయన వార్ జోన్ లోకి ఎలా వచ్చారో, ఎవరి కాల్పుల్లో మరణించాడో తమకు తెలియదన్నారు. జర్నలిస్టులు ఎవరైనా ఇలా వార్ జోన్ లోకి వచ్చేముందు తమకు తెలియజేయాలని వారు అంటున్నారు., సిద్దిఖీ మృతికి విచారం ప్రకటించారు. ఇంత జరిగినా ఆఫ్ఘన్ వైపు నుంచి మాత్రం ఈ జర్నలిస్టు మృతి పట్ల ఒక్క ప్రకటన కూడా రాలేదు. నిజానికి ఆఫ్ఘానిస్తాన్ కి ఇండియా ఎంతో సాయపడుతోందని వార్తలు వచ్చాయి. కానీ ఆ ప్రభుత్వం నుంచి సిద్దిఖీ మృతిపై స్పందన లేదు.

మరిన్ని ఇక్కడ చూడండి: మేం అధికారంలోకి వస్తే…మీ ప్రయోజనాలు కాపాడుతాం..బ్రాహ్మణులకు బీఎస్పీ అధినేత్రి మాయావతి హామీ

Viral Video: శ్వాస తీసుకోదు..!! ఆక్సిజన్ అవసరం లేదు..!! భూమిపై జీవిస్తున్న ఓ మిస్టరీ జీవి.. వీడియో

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu