యూపీ ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తుకు సిద్ధం.. మాదీ ఓపెన్ మైండ్.. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ
యూపీ లో జరగనున్న ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తుకు తాము సిద్ధమని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రకటించారు. తమది క్లోజ్డ్ మైండ్ కాదని, ఓపెన్ మైండ్ అని చమత్కరించారు.
యూపీ లో జరగనున్న ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తుకు తాము సిద్ధమని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రకటించారు. తమది క్లోజ్డ్ మైండ్ కాదని, ఓపెన్ మైండ్ అని చమత్కరించారు. భావ సారూప్యం గల ఏ పార్టీతో నైనా పొత్తుకు రెడీ అని, రాష్ట్రంలో బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని ఆమె చెప్పారు. కోవిడ్ పాండమిక్ సమయంలో తాము ఎంతో కృషి చేశామని, సమస్యలను ప్రభుత్వ దృష్టికి తెచ్చామని ఆమె అన్నారు. ఫోటోలకు పూలదండలు వేయడం తమ పార్టీ నైజం కాదని..పేర్కొన్నారు..30=32 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉండడంవల్ల పార్టీ బలహీనపడింది.. అయితే ఎన్నో ప్రయత్నాలు జరిగాక మళ్ళీ పార్టీ జవసత్వాలను కూడగట్టుకోగలిగింది అని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు కాంగ్రెస్ లో ఎంతో శక్తి ప్రవేశించింది అన్నారు. .తనను ‘పొలిటికల్ టూరిస్టు’ గా బీజేపీ పేర్కొనడాన్ని ఆమె ఖండించారు. ఆ పార్టీలో కూడా ‘టూరిస్టులు’ ఉన్నారని కౌంటర్ ఇచ్చారు. .అంతకుముందు తమ పార్టీ కార్యకర్తలసమావేశంలో మాట్లాడిన ఆమె.. కార్యకర్తలే పార్టీకి బలమన్నారు.
యూపీలో జరగనున్న ఎన్నికల్లో కార్యకర్తలంతా సమష్టిగా పని చేసి కాంగ్రెస్ విజయానికి తమ వంతు కృషి చేయాలని ప్రియాంక గాంధీ కోరారు. ఇది మీ విజయమవుతుందని వ్యాఖ్యానించారు. మీ మద్దతు వల్లే పార్టీ స్థిరంగా నిలబడిందని ఆమె చెప్పారు. యూపీలో వచ్ఛే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. 403 సీట్లున్న అసెంబ్లీకి సభ్యులను ఓటర్లు ఎన్నుకోవాల్సి ఉంటుంది. అసెంబ్లీ కాలపరిమితి వచ్చే ఏడాది మార్చి 14 తో ముగుస్తుంది. త్వరలో తమ పార్టీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ప్రియాంక వెల్లడించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: HECL Job Notification: టెన్త్, ఇంటర్ పాసైన నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మంచి జీతంతో ప్రభుత్వ ఉద్యోగానికి నోటిఫికేషన్
బుల్లెట్ గాయాల వల్లే ఫోటోజర్నలిస్టు డానిష్ సిద్దిఖీ మరణించాడు.. కాబూల్ లోని భారత ఎంబసీ ప్రకటన..