మేం అధికారంలోకి వస్తే… మీ ప్రయోజనాలు కాపాడుతాం.. బ్రాహ్మణులకు బీఎస్పీ అధినేత్రి మాయావతి హామీ..
యూపీలో తాము అధికారంలోకి వస్తే బ్రాహ్మణుల ప్రయోజనాలను కాపాడుతామని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి హామీ ఇచ్చారు. ఈ నెల 23 న అయోధ్యలో 'బ్రాహ్మిణ్ సమ్మేళన్' నిర్వహిస్తామని ఆమె ప్రకటించారు.
యూపీలో తాము అధికారంలోకి వస్తే బ్రాహ్మణుల ప్రయోజనాలను కాపాడుతామని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి హామీ ఇచ్చారు. ఈ నెల 23 న అయోధ్యలో ‘బ్రాహ్మిణ్ సమ్మేళన్’ నిర్వహిస్తామని ఆమె ప్రకటించారు. యూపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బ్రాహ్మణులు బీజేపీకి ఓటు వేయబోరని ఆశిస్తున్నానని, ఆ రోజునుంచి (23న) తమ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్.సి. మిశ్రా ఆధ్వర్యాన ఓ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ఆమె చెప్పారు. మా పార్టీ పాలనలోనే మీ ప్రయోజనాలకు రక్షణ ఉంటుందని వారిలో భరోసా కల్పిస్తామన్నారు. ధన బలంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దళితులను ఎంతగా తమవైపు తిప్పుకోజూసినా వారు (దళితులు) తమ పార్టీ వెంటే ఉన్నారని మాయావతి చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మా పార్టీ ఓడిపోయినా దళితుల ఓట్ల శాతం మాత్రం తమకు చెక్కుచెదరలేదని ఆమె తెలిపారు.సమాజ్ వాదీ పార్టీకి కూడా వారి ఓట్లు వెళ్లలేదన్నారు.2007 లో మీరు ..బ్రాహ్మణులు మాకు మద్దతునిచ్చారు.. అలాగే రాబోయే ఎన్నికల్లోనూ సపోర్ట్ ఇవ్వండి అని ఆమె కోరారు.
యూపీలోని బీజేపీ ప్రభుత్వం మిమ్మల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుందని, కానీ మీరు అప్రమత్తంగా ఉండాలని మాయావతి కోరారు. 2007 లో జరిగిన ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ బ్రాహ్మణ వర్గం నుంచి 85 మంది అభ్యర్థులను నిలబెట్టింది. అప్పుడు వీరి 11 శాతం ఓట్లు బహుజన్ సమాజ్ పార్టీకే పడ్డాయి. అందువల్లే మాయావతి నాటి పరిస్థితిని ఇప్పుడు గుర్తు చేశారు.అయోధ్యలో 23 న జరిగే సమ్మేళన్ కు బ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆమె కోరారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Telangana Corona: తెలంగాణకు ఉపశమనం.. భారీగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు..
Viral Video: ఇంట్లో దాచిన 2 లక్షలు.. అన్యాయంగా ఎలుకల పాలు..!! వీడియో