AP-TS Water Disputes: ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ జలవివాదం.. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన ఎంపీ జీవీఎల్..

AP-TS Water Disputes: ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై బీజేపీ నేత, ఎంపీ జీవీఎల్ స్పందించారు.

AP-TS Water Disputes: ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ జలవివాదం.. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన ఎంపీ జీవీఎల్..
GVL
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 18, 2021 | 4:08 PM

AP-TS Water Disputes: ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై బీజేపీ నేత, ఎంపీ జీవీఎల్ స్పందించారు. ఆదివారం నాడు ఇదే అంశంపై మీడియాతో మాట్లాడిన ఆయన.. కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై కొన్ని రాజకీయ పార్టీలు అనవసరపు వివాదాన్ని సృష్టిస్తున్నాయని అన్నారు. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ చట్టాలకు అనుగుణంగా ఇచ్చిందని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాన్ని సద్ధమణిగేలా చేసేందుకు చట్టానికి అనుగుణంగా సరైన సమయంలో కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను స్వాగతిస్తున్నానని జీవీఎల్ ప్రకటించారు. కేంద్రం జారీ చేసిన ఈ గెజిట్‌ను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు స్వాగతిస్తున్నారని, ఒక రకంగా ఊపిరి పీల్చుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వాలపై ప్రజల్లో అపఖ్యాతి వచ్చినప్పుడల్లా.. తప్పులను కేంద్రంపై మోపుతున్నారని రాష్ట్రాల ప్రభుత్వాలపై జీవీఎల్ విమర్శలు గుప్పించారు. ఆన్‌గోయింగ్ ప్రాజెక్టుల నిర్వహణలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకుంటాయన్నారు. అయితే, దీనిపై కొంతమంది తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నారని, ఇది సరికాదని అన్నారు.

ఇదిలాఉంటే.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించి కార్పోరేషన్ పదవులపైనా జీవీఎల్ స్పందించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల వారిని అక్కున చేర్చుకుంటామని చెప్పి.. కొన్ని వర్గాలకు మాత్రమే కొమ్ముకాసేలా వ్యవహరించిందన్నారు. శనివారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కార్పొరేషన్ పదవులతో ప్రజలను మభ్య పెడుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉప ముఖ్యమంత్రులు ఎంతమంది ఉన్నారో, వారి శాఖలు చెబితే పదివేల రూపాయలు ఇస్తానని జీవీఎల్ ఛాలెంజ్ విసిరారు. ఉప ముఖ్యమంత్రుల స్థాయి వారికే.. వారికి ఏం అధికారాలు ఉన్నాయో కూడా తెలియని ఎద్దేవా చేశారు. ఇక.. ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన పదవుల సంగతిపై వైసీపీ నేతలే సమాధానం చెప్పాలని జీవీఎల్ వ్యాఖ్యానించారు.

Somu Veerraju

మరోవైపు ఏపీ నామినేటెడ్ పోస్టులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా కామెంట్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు సముచిత పదవులు ఇచ్చామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారని, కానీ సోషల్ మీడియాలో మాత్రం ఒక వర్గానికే చాలా పోస్టులతో పాటు కీలక పదవులు ఇచ్చారని చక్కర్లు కొడుతోందని అన్నారు. ఏ ప్రభుత్వాలు ఉంటే ఆ వర్గాలకి అవకాశం ఇస్తున్నారని గతంలో ప్రచారం జరిగిందని, శనివారం నాడు ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లోనూ అదే జరిగిందని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ అన్ని వర్గాలను అక్కున చేర్చుకుంటారని, కీలక పదవులతో పాటు అన్ని పదవుల్లోనూ సామాజిక న్యాయం పాటిస్తారని వీర్రాజు చెప్పుకొచ్చారు.

Also read:

IND vs SL 1st ODI Live: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. టీమిండియాలో ఇద్దరు ఆటగాళ్ల తొలి ప్రదర్శన

Khiladi Lady: ఈమె లేడీ కాదు…కిలాడీ.. నాలుగు పెళ్లిళ్లు.. ఎన్నో మోసాలు

Amazon Gift Voucher: అమెజాన్‌ బంపర్‌ ఆఫర్‌.. ఉచితంగా 10 వేల గిఫ్ట్ వోచర్‌.. ఈ రెండు షరతులు తప్పనిసరి