IND vs SL 1st ODI Live: శ్రీలంకపై భారత్ ఘన విజయం.. రాణించిన ధావన్.. ఇషాన్ కిషన్..
India vs Sri Lanka 1st ODI Live Score: చాలా రోజులు తరువాత టీమిండియా మరోసారి గ్రౌండ్‌లోకి అడుగు పెట్టింది. శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఈ రోజు మొదటి వన్డేలో తలపడనుంది.
IND vs SL 1st ODI Live: చాలా రోజులు తరువాత టీమిండియా మరోసారి గ్రౌండ్‌లోకి అడుగు పెట్టింది. శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఈ రోజు మొదటి వన్డేలో తలపడనుంది. టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. శ్రీలంక 50 ఓవర్లకు 9 వికెట్లు నష్టపోయి 262 పరుగులు చేసింది. చివర్లో కరుణరత్నె ధాటిగా ఆడటంతో స్కోరుబోర్డు ముందుకు వెళ్లింది. 43 పరుగులు చేసిన కరుణరత్నె నాటౌట్‌గా నిలిచాడు. అతడికి చమీరా చక్కటి సహకారం అందించాడు. దీంతో భారత్ లక్ష్యం 263 పరుగులుగా నిర్ణయించారు. భారత్ బౌలర్ల వేగానికి మొదటగా తడబడిన శ్రీలంక వికెట్లు పడుతున్నా చివరలో ధాటిగా ఆడారు. దీంతో గౌరవప్రదమైన స్కోరు సాధించారు. ఇక భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేశారు.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా 263 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. ఓపెనర్లుగా పృధ్వీషా , శిఖర్ ధావన్ క్రీజులోకి వచ్చారు. చమీరా వేసిన తొలి ఓవర్‌లోనే రెండు, మూడు బంతులు బౌండరీలుగా మలిచారు. ఇషాన్ కిషన్ హాప్ సెంచరీ సాధించాడు. కేవలం 33 బంతుల్లోనే అర్ద సెంచరీ పూర్తి చేశాడు. అసలంకా బౌలింగ్‌లో వరుసగా ఫోర్లు కొట్టడంతో హాప్ సెంచరీ పూర్తయింది. ఇషాన్ ఇప్పటివరకు తన ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. శిఖర్ ధావన్‌తో కలిసి 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
అనంతరం శిఖర్ ధావన్‌కి మనీశ్ పాండే జోడయ్యాడు. ఇద్దరు కలిసి లంక బౌలర్లను ఊచకోత కోశారు. ఈ క్రమంలో శిఖర్ హాఫ్ సెంచరీ సాధించాడు. ధనంజయ వేసిన 30 ఓవర్ నాలుగో బంతిని భారీ షాట్ ఆడబోయి మనీశ్ ఔటయ్యాడు. దీంతో 215 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. దీంతో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్, శిఖర్ ధావన్ కలిసి మిగతా పని పూర్తి చేశారు. దీంతో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
సీనియర్ ఆటగాళ్లు లేకపోవడంతో కెప్టెన్‌గా శిఖర్ ధావన్ వ్యవహరిస్తున్నాడు. తొలిసారిగా కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. జట్టులో ఎక్కువమంది యువ ఆటగాళ్లు మాత్రమే ఉన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల పేలవమైన ప్రదర్శనతో శ్రీలంక జట్టు చాలా బలహీనంగా ఉంది. దాసున్ షానకా నాయకత్వంలో శ్రీలంక ఇండియాతో తలపడనుంది. ఇరుజట్లలో చాలామంది కొత్తవారే ఉండటంతో మ్యాచ్ చాలా ఆసక్తిగా మారింది.
భారత్: శిఖర్ ధావన్ (కెప్టెన్), పృథ్వీ షా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), మనీష్ పాండే, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్.
శ్రీలంక: Dasun Shanaka (కెప్టెన్), Avishka ఫెర్నాండో, Minod Bhanuka (వికెట్ కీపర్), Bhanuka రాజపక్స కాగా, ధనంజయ డి సిల్వా, చారిట Aslanka, Wanindu Hasaranga, Isuru ఉదాన, లక్షణ్ Sandakan, Dushmanta Chamira, Chamika Karunaratne
Toss & Team News from Colombo:
Sri Lanka have won the toss & elected to bat against #TeamIndia in the first #SLvIND ODI.
Follow the match ? https://t.co/rf0sHqdzSK
Here’s India’s Playing XI ? pic.twitter.com/eYNANlZ9ij
— BCCI (@BCCI) July 18, 2021
LIVE NEWS & UPDATES
-
భారత్ ఘన విజయం..
భారత్ ఘన విజయం సాధించింది. 262 పరుగుల లక్ష్యాన్ని సునాయసనంగా ఛేదించింది. ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యం సాధించింది.
-
విజయానికి చేరువలో భారత్.. 34 ఓవర్లకు భారత్ 250/3
భారత్ విజయానికి చేరువలో ఉంది. 34 ఓవర్లకు భారత్ మూడు వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. ఇంకా విజయానికి 12 పరుగుల దూరంలో ఉంది. మరోవైపు కెప్టెన్ శిఖర్ ధావన్ సెంచరీ దిశగా వెళుతున్నాడు.
-
-
32 ఓవర్లకు భారత్ 223/3
32 ఓవర్లకు భారత్ మూడు వికెట్లను కోల్పోయి 223 పరుగులు చేసింది. చమీరా వేసిన ఈ ఓవర్లో 5 పరుగులు మాత్రమే వచ్చాయి. భారత్ విజయానికి ఇంకా 40 పరుగులు కావాలి
-
మూడో వికెట్ కోల్పోయిన భారత్..
భారత్ మూడో వికెట్ కోల్పోయింది. మనీశ్ పాండే ఔటయ్యాడు. ధనంజయ వేసిన 30 ఓవర్ నాలుగో బంతిని భారీ షాట్ ఆడని మనీశ్.. శనకాకు దొరికిపోయాడు. దీంతో 215 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. క్రీజులో ధావన్, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు.
-
30 ఓవర్లకు భారత్ 210/2
30 ఓవర్లకు భారత్ రెండు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. చమీర్ వేసిన ఈ ఓవర్లో కేవలం 2 పరుగులు మాత్రమే వచ్చాయి. ధావన్ 66 పరుగులు, మనీశ్ 26 పరుగులతో ఆడుతున్నారు. విజయానికి ఇంకా 53 పరుగులు కావాలి.
-
-
200 దాటిన భారత్
28 ఓవర్లకు భారత్ 200 పరుగులు దాటింది. ధావన్ 59 పరుగులతో కొనసాగుతుండగా మనీశ్ పాండే 24 పరుగులతో ఆడుతున్నాడు. ఇద్దరు కలిసి యాభై పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
-
26 ఓవర్లో 16 పరుగులు
సందకన్ వేసిన 26 ఓవర్లో భారత్ 16 పరుగులు పిండుకుంది. మనీశ్ పాండే ఒక సిక్సర్, ఫోర్ బాదగా చివరగా ధావన్ మరో ఫోర్ కొట్టాడు. దీంతో భారత్ రెండు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.
-
హాఫ్ సెంచరీ చేసిన శిఖర్ ధావన్..
కెప్టెన్ శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ చేశాడు. భారత్ 25 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఈ ఓవర్లో తొలి బంతికి సింగిల్ తీసి వన్డేల్లో 33వ హాఫ్ సెంచరీ చేశాడు. మనీశ్ పాండే 10 పరుగులతో ధావన్‌కి సహకరిస్తున్నాడు. విజయానికి ఇంకా 86 పరుగులు కావాలి
-
మెయిడిన ఓవర్.. 23 ఓవర్లకు భారత్ 163/2
23 ఓవర్లకు భారత్ రెండు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఈ ఓవర్‌లో మనీశ్ పాండే ఆరు బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు సాధించలేదు.
-
భారత్ 20 ఓవర్లకు 153/2
భారత్ 20 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. విజయానికి 30 ఓవర్లలో 110 పరుగులు చేయాల్సి ఉంది. కెప్టెన్ శిఖర్ ధావన్ 35 పరుగులు, మనీశ్ పాండే 2 పరుగులు క్రీజులో ఉన్నారు.
-
శిఖర్ ధావన్ 1000 పరుగులు
ఇండియా కెప్టెన్ శిఖర్ ధావన్ శ్రీలంకపై 1000 పరుగులు పూర్తిచేశాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో కేవలం 17 ఇన్నింగ్స్‌ల్లోనే వేయి పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అంతేకాకుండా వన్డేల్లో 6000 పరుగులు పూర్తి చేశాడు.
? Milestone Alert ?
Congratulations to @SDhawan25 on completing 6⃣0⃣0⃣0⃣ ODI runs ? ? #TeamIndia #SLvIND
Follow the match ? https://t.co/rf0sHqdzSK pic.twitter.com/OaEFDeF2jB
— BCCI (@BCCI) July 18, 2021
-
అరంగేట్రంలోనే హాఫ్ సెంచరీలు
ఇషాన్ తన పుట్టిన రోజున హాఫ్ సెంచరీ సాధించడం ఆనందదాయకం. మార్చిలోనే ఇషాన్ ఇంగ్లాండ్‌తో టి 20 అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీతో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అర్ధ సెంచరీ చేశాడు. ఇప్పుడు వన్డే అరంగేట్రంలో కెప్టెన్ శిఖర్ ధావన్‌తో కలిసి బ్యాటింగ్ చేస్తూ అర్ధ సెంచరీ సాధించాడు.
-
ఇషాన్ కిషన్ ఔట్..
ఇషాన్ కిషన్ ఔట్ అయ్యాడు. సందకాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి యత్నించి మినోద్‌కి దొరికిపోయాడు. దీంతో భారత్ 143 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ధావన్ 23 పరుగులు, మనీశ్ పాండే 0 పరుగులు క్రీజులో ఉన్నారు. ఇషాన్ కిషన్ 59 పరుగులు చేశాడు.
-
ఇషాన్ కిషన్ తొలి హాప్ సెంచరీ
ఇషాన్ కిషన్ హాప్ సెంచరీ సాధించాడు. కేవలం 33 బంతుల్లోనే అర్ద సెంచరీ పూర్తి చేశాడు. అసలంకా బౌలింగ్‌లో వరుసగా ఫోర్లు కొట్టడంతో హాప్ సెంచరీ పూర్తయింది. ఇషాన్ ఇప్పటివరకు తన ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. శిఖర్ ధావన్‌తో కలిసి 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. భారత్ విజయానికి 35 ఓవర్లలో 136 పరుగులు సాధించాలి.
5⃣0⃣ on T20I debut ✅ 5⃣0⃣ on ODI debut ✅@ishankishan51 knows a thing or two about making a cracking start ? ? #TeamIndia #SLvIND
Follow the match ? https://t.co/rf0sHqdzSK pic.twitter.com/i4YThXGRga
— BCCI (@BCCI) July 18, 2021
-
13 ఓవర్లకు భారత్ 109/1
అసలంక వేసిన ఈ ఓవర్‌లో టిమిండియా 13 పరుగులు రాబట్టింది. మరోవైపు ధావన్ ఆచితూచి ఆడుతున్నాడు. ఇషాన్ కిషన్ హాప్ సెంచరీ వైసు దూసుకెళుతున్నాడు. 39 పరుగులతో ధాటిగా ఆడుతున్నాడు.
-
100 పరుగులు దాటిన భారత్..
263 లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 12 ఓవర్లో 100 పరుగులు దాటింది. గెలుపు కోసం ఇంకా 163 పరుగుల వేటలో ఉంది. రన్ రేట్ 9తో ఆట కొనసాగుతుంది. ఇషాన్ కిషన్ ధాటిగా ఆడుతున్నాడు.
-
8 ఓవర్లకు భారత్ 84/1
8 ఓవర్లకు భారత్ 84/1. ధనంజయ వేసిన ఈ ఓవర్లో టీమిండియా 12 పరుగులు సాధించింది. యంగ్ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్(23)చివరి మూడు బంతుల్లో బౌండరీలు బాదాడు. మరోవైపు ధావన్(11) నెమ్మదిగా ఆడుతున్నాడు.
-
తొలివికెట్ డౌన్ .
టీమిండియా తొలివికెట్ ను కోల్పోయింది. దుకుడుగా ఆడుతున్న పృథ్వీషా ఔటయ్యాడు. ధనంజయ వేసిన 5.3ఓవర్ కు భారీ షాట్ ఆడబోయి ఫెర్నాండో చేతికి చిక్కాడు. దాంతో భారత్ 58 పరుగుల వద్ద మొదటి వికెట్ ను కోల్పోయింది. ఈ ఓవర్లో ఒక వికెట్ కోల్పోయి 11 పరుగులు సాధించింది భారత్
-
4 ఓవర్లకు భారత్ 45/0
4 ఓవర్లకు భారత్ 45/0. నాలుగో ఓవర్లకే టీమిండియా స్కోరు 45 పరుగులకు చేరింది. పృథ్వీషా రెచ్చిపోయాడు. ఉదాన వేసిన ఈ ఓవర్లో హ్యాట్రిక్ ఫ్లోర్లు సాధించాడు. ఈ ఓవర్లో మొత్తం 14 పరుగులు వచ్చాయి.
-
3 ఓవర్లకు భారత్ 31/0
3 ఓవర్లకు భారత్ 31/0. చమీర వేసిన మూడో ఓవర్ లో భారత్ 9పరుగులు రాబట్టింది. ధావన్ (6) బౌండరీతో ఖాత తెరిచాడు. ఆపై మరో 5పరుగులు వచ్చాయి.
-
2 ఓవర్లకు భారత్ 22/0
2 ఓవర్లకు భారత్ 22/0. ఉదాన వేసిన రెండో ఓవర్‌లో పృథ్వీ షా రెండు బౌండరీలు బాదాడు. ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి.
-
బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా
శ్రీలంక నిర్దేశించిన 263 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు టీమిండియా బరిలోకి దిగింది. ఓపెనర్లుగా పృధ్వీషా , శిఖర్ ధావన్ క్రీజులోకి వచ్చారు. చమీరా వేసిన తొలి ఓవర్‌లోనే రెండు, మూడు బంతులు బౌండరీలుగా మలిచారు.
-
50 ఓవర్లకు శ్రీలంక 262/9
50 ఓవర్లకు శ్రీలంక తొమ్మిది వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. చివర్లో కరుణరత్న దాటిగా ఆడటంతో స్కోరు బోర్డు ముందుకు వెళ్లింది. 43 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతడికి చమీరా చక్కటి సహకారం అందించాడు. భారత్ లక్ష్యం 263 పరుగులు.
-
49 ఓవర్లకు శ్రీలంక 243/8
శ్రీలంక తొమ్మిదో వికెట్ కోల్పోయింది. చమీరా 13 ఔటయ్యాడు. హార్దిక్ పాండ్య వేసిన 49 ఓవర్లో ఒక సిక్సర్, ఒక ఫోర్ బాదాడు. దీంతో ఈ ఓవర్లో 13 పరుగులు లభించాయి. మరోవైపు కరుణరత్న సైతం దాటిగా ఆడుతున్నాడు.
-
తొమ్మిదో వికెట్ కోల్పోయిన శ్రీలంక
శ్రీలంక తొమ్మిదో వికెట్ కోల్పోయింది. చమీరా 13 ఔట్
-
ఎనిమిదో వికెట్ కోల్పోయిన శ్రీలంక
శ్రీలంక ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ఉదాన 8 పరుగులకు ఔటయ్యాడు. దీంతో శ్రీలంక 222 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్య వేసిన 46 ఓవర్లో ఐదో బంతిని భారీ షాట్ ఆడబోయిన ఉదాన చాహల్ చేతికి చిక్కాడు. దీంతో హార్దిక్‌కు తొలి వికెట్ దక్కింది.
-
45 ఓవర్లకు శ్రీలంక 210/7
45 ఓవర్లకు శ్రీలంక 7 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్య వేసిన ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం కరుణరత్నె 9 పరుగులు, ఉదాన నెమ్మదిగా ఆడుతున్నారు. చాహల్ తన 10 ఓవర్లలో 52 పరుగులకు 2 వికెట్లు పడగొట్టాడు.
-
ఏడో వికెట్ కోల్పోయిన శ్రీలంక
శ్రీలంక ఏడో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ షానకా 39 పరుగులు ఔట్ అయ్యాడు. చాహల్ వేసిన 44 ఓవర్లో లాంగాఫ్‌లో భారీ షాట్ ఆడిన షానకా.. హార్దిక్ పాండ్య చేతికి చిక్కాడు. దీంతో 205 పరుగుల వద్ద శ్రీలంక ఏడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో కరుణరత్నె 9 పరుగులు, ఉదాన ఆట కొనసాగిస్తున్నారు.
-
40 ఓవర్లకు శ్రీలంక 186/6
40 ఓవర్లకు శ్రీలంక 6 వికెట్లు నష్టపోయి 186 పరుగులు చేసింది. దీపక్ చాహర్ వేసిన ఈ ఓవర్లో మూడో బంతికి హసరంగ 8 పరుగులు ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో శనక 30 పరుగులు, కరుణరత్నో 1 పరుగుతో ఆట కొనసాగిస్తున్నారు.
-
ఆరో వికెట్ కోల్పోయిన శ్రీలంక
శ్రీలంక ఆరో వికెట్ కోల్పోయింది. హసరంగ 8 పరుగులు ఔటయ్యాడు. దీపక్ చాహర్ రెండో వికెట్ సాధించాడు. పరుగుల వేగాన్ని పెంచే బాధ్యతతో క్రీజులోకి వచ్చిన హసరంగ దీపక్ చాహర్ వేసిన డెలివరీని తక్కువగా అంచనా వేసి కెప్టెన్‌కి శిఖర్ ధావన్‌కి అడ్డంగా దొరికిపోయాడు. డైవింగ్ చేస్తూ శిఖర్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. దీంతో శ్రీలంక 186 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది.
-
ఐదో వికెట్ కోల్పోయిన శ్రీలంక
శ్రీలంక ఐదో వికెట్ కోల్పోయింది. హాప్ సెంచరీ వైపు దూసుకెళుతున్న చరిత్ అసలంక (38) ఔట్ అయ్యాడు. దీపక్ చాహర్ వేసిన 37 ఓవర్లో కీపర్ ఇషాంత్ కిషన్‌కి చిక్కాడు. దీంతో శ్రీలంక 166 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. క్రీజులో శనక 19 పరుగులు, హసరంగ 0 పరుగులతో కొనసాగుతున్నారు.
-
35 ఓవర్లకు శ్రీలంక 151/4
శ్రీలంక150 పరుగులు దాటింది. 35 ఓవర్లకు నాలుగు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. కుల్‌దీప్ వేసిన ఈ ఓవర్లో 2 పరుగులు మాత్రమే వచ్చాయి. శ్రీలంక జట్టు రన్ రేట్ ఓవర్‌కి ఐదు పరుగులు మాత్రమే ఉంది. భారీ స్కోరు చేయాలంటే వేగంగా ఆడటం తప్పనిసరి. అయితే షానకా, అసలంకా మధ్య భాగస్వామ్యం పెరుగుతుండటం శ్రీలంకకు శుభ పరిణామం అని చెప్పవచ్చు.
-
32 ఓవర్లకు శ్రీలంక 141/4
శ్రీలంక 32 ఓవర్లకు నాలుగు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. భారత బౌలర్లు పకడ్బందీగా బౌలింగ్ చేస్తుండటంతో శ్రీలంక బ్యాట్స్‌మెన్ తడబడుతూ ఆడుతున్నారు. కృనాల్ పాండ్య వేసిన ఈ ఓవర్లో 2 పరుగులు మాత్రమే వచ్చాయి. శనక 11 పరుగులతో అసలంక 21 పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
కుల్దీప్‌కి రెండు వికెట్లు దక్కడంపై ఇర్పాన్ సంతోషం వ్యక్తం..
కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు సాధించడంతో భారత అభిమానులు సంతోషంగా ఉన్నారు. కానీ భారత మాజీ క్రికెటర్లు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కుల్దీప్ మళ్లీ వికెట్లు సాధించడం చూసి చాలా సంతోషంగా ఉన్నానని మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు.
Happiness is seeing @imkuldeep18 getting wickets. #wickettaker
— Irfan Pathan (@IrfanPathan) July 18, 2021
-
30 ఓవర్లకు శ్రీలంక 132/4
శ్రీలంక 30 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. ఈ ఓవర్‌లో చాహల్ 3 పరుగులు ఇచ్చాడు. శనక 5 పరుగులు, చరిత్ 19 పరుగులు నిలకడగా ఆడుతున్నారు.
-
28 ఓవర్లకు శ్రీలంక 126/4
28 ఓవర్లకు శ్రీలంక నాలుగు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. చాహల్ ఈ ఓవర్లో 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. శనక 3, చరిత్ 17 పరుగులతో ఆట కొనసాగిస్తున్నారు.
-
25 ఓవర్లకు శ్రీలంక 117/4
25 ఓవర్లకు శ్రీలంక నాలుగు వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ సగం ముగిసింది. ఈ ఓవర్లో కృనాల్ రెండు పరుగులు మాత్రమే ఇచ్చి ధనుంజయను ఔట్ చేశాడు. ప్రస్తుతం క్రీజులో శనక 0, చరిత్ 13 ఆట కొనసాగిస్తున్నారు. కాగా శ్రీలంక 4 వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో ఆడుతుంది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ వికెట్లు సాధిస్తున్నారు.
-
నాలుగో వికెట్ కోల్పోయిన శ్రీలంక.. డిసిల్వా ఔట్..
శ్రీలంక నాలుగో వికెట్ కోల్పోయింది. కృనాల్ పాండ్యాకు మొదటి వికెట్ లభించింది. ధనుంజయ డిసిల్వా ఔట్ అయ్యాడు. 27 బంతులను ఎదుర్కొన్న డిసిల్వా కేవలం 14 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక బౌండరీ మాత్రమే ఉంది. దీంతో శ్రీలంక 117 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది.
-
24 ఓవర్లకు శ్రీలంక 115/3
24 ఓవర్లకు శ్రీలంక 3 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. చాహల్ ఈ ఓవర్లో 7 పరుగులు ఇచ్చాడు. చరిత్ 12, ధనంజయ 13 పరుగులతో ఆడుతున్నారు.
-
100 పరుగులు దాటిన శ్రీలంక..
శ్రీలంక 21 ఓవర్లకు 100 పరుగులు దాటింది. మూడు వికెట్ల నష్టానికి 106 పరుగులతో కొనసాగుతోంది. ఈ ఓవర్ నాలుగో బంతిని ధనంజయ (10) బౌండరీగా మలిచాడు. చరిత్ 6 పరుగులు అతడికి తోడుగా ఉన్నాడు.
-
మెయిడిన్ ఓవర్ చేసిన కృనాల్ పాండ్య
ఒకే ఓవర్లో 2 వికెట్లు పడగొట్టిన కుల్దీప్ శ్రీలంకను కోలుకోని దెబ్బ కొట్టాడు. దీంతో ఒత్తిడితో ఆడుతున్న బ్యాట్స్‌మెన్ పై కృనాల్ పాండ్యను ప్రయోగించారు. కృనాలో ఏకంగా 18 ఓవర్‌ను మెయిడిన్ ఓవర్‌గా చేశాడు. దీంతో శ్రీలంక బ్యాట్స్‌మెన్ పరుగులు చేయాలంటే ఆగచాట్లు పడుతున్నారు.
-
మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక.. మినోద్ ఔట్..
శ్రీలంకకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మూడో వికెట్ కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న మినోద్ ఔట్ అయ్యాడు. కుల్‌దీప్‌కి రెండో వికెట్ దక్కింది. 16 ఓవర్లో నాలుగోబంతిని మినోద్ గాల్లోకి ఆడగా పృథ్వీషా క్యాచ్ అందుకున్నాడు. కులదీప్ ఈ ఓవర్లో 2 వికెట్లు పడగొట్టి 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 17 ఓవర్లకు శ్రీలంక 3 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ధనుంజయ డిసిల్వా 1, చరిత్ అసలంక క్రీజులో ఉన్నారు.
-
రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక.. రాజపక్స ఔట్..
దూకుడుగా ఆడుతున్న రాజపక్స ఔట్ అయ్యాడు. 22 బంతుల్లో 24 పరుగులు చేసిన రాజపక్స కుల్‌దీప్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. భారీ షాట్ ఆడబోయిన రాజపక్స కెప్టెన్ శిఖర్ ధావన్ చేతికి చిక్కాడు. 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 24 పరుగులు చేశాడు. 85 పరుగుల వద్ద శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది.
-
15 ఓవర్లకు శ్రీలంక 82/1
15 ఓవర్లకు శ్రీలంక ఒక వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది. కుల్‌దీప్ వేసిన ఈ ఓవర్లో రెండో బంతిని రాజపక్స బౌండరీ తరలించాడు. ఆ తర్వాత బంతి అతడి పాదాలకు తాకింది. కానీ అంపైర్ ఔట్ ఇవ్వలేదు. రాజపక్స 23 పరుగులు, మినోద్ 21 పరుగులతో ఆట కొనసాగిస్తున్నారు.
-
భారీ సిక్సర్ బాదిన రాజపక్స
భానుక రాజపక్స దూకుడుగా ఆడుతున్నాడు. చాహల్ వేసిన 14 ఓవర్లో మూడో బంతిని సిక్సర్ బాదాడు. శ్రీలంక ఒక వికెట్ నష్టానికి 76 పరుగులు చేసింది.
-
సిక్సర్‌తో పరుగుల వేట ప్రారంభించిన రాజపక్సే
వన్డేలో అరంగేట్రం చేసిన భానుక రాజపక్స సిక్సర్ తో కెరీర్ ప్రారంభించాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ రాజపక్సే చాహల్ వేసిన 10 ఓవర్లో ఆఖరి బంతిని స్లాగ్ స్వీప్ చేసి మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ సాధించాడు. అది అద్భుతమైన షాట్. కాగా 13 ఓవర్లకు శ్రీలంక 68 పరుగులకు ఒక వికెట్ కోల్పోయింది. కుల్‌దీప్ యాదవ్ బౌలింగ్‌కి దిగాడు. ఈ ఓవర్లో 7 పరుగులు ఇచ్చాడు. కాగా ఆఖరి బంతిని రాజపక్స స్వీప్ షాట్‌తో బౌండరీ సాధించాడు. మినోద్ 19 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
-
10 ఓవర్లకు శ్రీలంక 55/1
భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి వన్డేలో 10 ఓవర్లు ముగిసాయి. మొదటగా బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక 10 ఓవర్లకు ఒక వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. యుజ్వేంద్ర చాహల్ మొదటి ఓవర్‌లోనే వికెట్ సాధించాడు. దూకుడుగా ఆడుతున్న అవిష్కా ఫెర్నాండో మనీశ్ పాండేకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో భనుక రాజపక్స, మినోద్ ఆడుతున్నారు.
-
మొదటి వికెట్ కోల్పోయిన శ్రీలంక
శ్రీలంక మొదటి వికెట్ కోల్పోయింది. అవిష్కా ఫెర్నాండో అవుట్. ఇతడు 35 బంతుల్లో 34 పరుగులు చేశాడు. 2 ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు. ఒక వికెట్ నష్టానికి శ్రీలంక స్కోరు.. 49/0
-
ఇన్నింగ్స్‌లో మొదటి సిక్స్
ఫెర్నాండో ఇన్నింగ్స్‌లో మొదటి సిక్స్ బాదాడు. దీపక్ చాహర్ ఓవర్‌లో ఐదో బంతిని సిక్స్‌లా మలిచాడు. అద్భుతమైన షాట్.
-
మెయిడిన్ ఓవర్..
6 ఓవర్లకు శ్రీలంక 26/0. దీపక్ చాహర్ సూపర్ బౌలింగ్. మెయిడిన్ ఓవర్ చేశాడు. లైన్ అండ్ లెన్త్‌తో బంతులు విసిరాడు. మినోద్ 4 పరుగులు, ఫెర్నాండో 20 ఆచితూచి ఆడుతున్నారు.
-
5 ఓవర్లకు శ్రీలంక 26/0
ఈ ఓవర్ భువీ అద్భుతంగా వేశాడు. కేవలం 3 పరుగులు మాత్రమే సమర్పించాడు. వరుసగా 5 డాట్ బాల్స్ నమోదు చేశాడు. మినోద్ 4 పరుగులు, ఫెర్నాండో 20 పరుగులతో ఆడుతున్నారు.
-
ఆచితూచి ఆడుతున్న లంక ఓపెనర్లు
4 ఓవర్లకు శ్రీలంక 23/0 తో కొనసాగుతుంది. మినోద్ 4 పరుగులు, ఫెర్నాండో 18 పరుగులతో ఆడుతున్నారు. దీపక్ చాహర్ కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. భారత్ బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు.
-
టిమిండియా బౌలర్లను సులభంగా ఆడుతున్న లంక ఓపెనర్లు
టిమిండియా బౌలర్లను శ్రీలంక ఓపెనర్లు సులభంగా ఆడుతున్నారు. భువనేశ్వర్ కుమార్ వేసిన రెండో ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. మూడు ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక స్కోరు.. 20/0
-
రెండు ఓవర్లకు శ్రీలంక 14/0
దీపక్ చాహర్ మరో ఎండ్ నుంచి బౌలింగ్ ఆరంభించాడు. ఒకే ఓవర్‌లో 10 పరుగులు ఇచ్చాడు. 3, 4 బంతులను ఫెర్నాండో బౌండరీకి తరలించాడు. మినోద్ ఇంకా ఖాతా ప్రారంభించలేదు.
-
ఫెర్నాండో వరుసగా ఫోర్లు కొట్టాడు..
చాహర్‌కు మంచి ఆరంభం లభించలేదు. అవిష్కా ఫెర్నాండో వరుసగా రెండు బంతుల్లో రెండు ఫోర్లు కొట్టాడు.
-
శ్రీలంక ఇన్నింగ్స్ ప్రారంభమైంది
శ్రీలంక ఇన్నింగ్స్ ప్రారంభమైంది. భారత్ తరఫున బౌలింగ్ బాధ్యతను భువనేశ్వర్ కుమార్ తీసుకున్నారు. అవిష్కా ఫెర్నాండో, మినోద్ భానుకా శ్రీలంక ఓపెనింగ్ కోసం వచ్చారు. ఇది భానుకా రెండో వన్డే మ్యాచ్ మాత్రమే. మొదటి ఓవర్‌లో 4 పరుగులు వచ్చాయి.
-
సూర్యకుమార్, ఇషాన్ అరంగేట్రం
టీమ్ ఇండియా ఈ రోజు ఇద్దరు కొత్త ఆటగాళ్ళతో వన్డేలో అడుగుపెట్టింది. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ లకు వన్డే క్యాప్స్ ఇచ్చారు. ఈ ఇద్దరు ఆటగాళ్ళు తమ తొలి టీ 20 మ్యాచ్ మార్చిలో ఇంగ్లండ్‌తో ఆడారు. ఇప్పుడు శ్రీలంకతో కలిసి వన్డే అరంగేట్రం చేస్తున్నారు.
Published On - Jul 18,2021 10:11 PM