Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTR-Koratala: వరస సినిమాలతో ఎన్టీఆర్ బిజిబిజీ.. కొరటాలతో పాన్ ఇండియా మూవీ.. భారీ బడ్జెట్

NTR-Koratala: బాహుబలి సినిమా తర్వాత తెలుగు చలన పరిశ్రమ తన మార్కెట్ను పెంచుకోవడం పై దృష్టిపెట్టింది. దీంతో దాదాపు ఇటీవల తెరకెక్కుతున్న స్టార్ హీరోల సినిమాలన్నీ..

NTR-Koratala: వరస సినిమాలతో ఎన్టీఆర్ బిజిబిజీ.. కొరటాలతో పాన్ ఇండియా మూవీ.. భారీ బడ్జెట్
Ntr Shiva
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Surya Kala

Updated on: Jul 18, 2021 | 4:04 PM

NTR-Koratala: బాహుబలి సినిమా తర్వాత తెలుగు చలన పరిశ్రమ తన మార్కెట్ను పెంచుకోవడం పై దృష్టిపెట్టింది. దీంతో దాదాపు ఇటీవల తెరకెక్కుతున్న స్టార్ హీరోల సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగానే రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాకు ఎంచుకునే తారాగణం నుంచి అన్ని విషయాలపై సినీ ప్రేమికులను ఆకట్టుకునే విషయంపై దర్శకనిర్మాతలు దృష్టి పెడుతున్నారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొరటాల శివ కాంబోలో రాబోతున్న సినిమా కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ మవీనే. ఈ సినిమా బడ్జెట్‌కు సంబంధించిన వార్త సోషల్‌ మీడియాలో హల్చల్‌ చేస్తోంది. ఎ

ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మూవీ సాంగ్స్ మినహా పూర్తి కావడంతో ఎన్టీఆర్ .. కొత్త సినిమాలపై దృష్టి పెట్టాడు. తారక్ చేతిలో ఉన్న మూడు ప్రాజెక్టులు ఇప్పుడు అందరిలోనూ భారీ అంచనాలను పెంచేస్తున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ .. దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఆ తర్వాత కొరటాల శివ .. ప్రశాంత్ నీల్ ప్రాజెక్టులకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ రెండు సినిమాల్లో ప్రశాంత్ నీల్ సినిమా మాత్రమే పాన్ ఇండియా సినిమా అని అనుకున్నారు. కానీ కొరటాల సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలోనే రూపొందనుందని సమాచారం.

ఎన్టీఆర్ – కొరటాల సినిమా బడ్జెట్ 200 కోట్లు అని టాక్‌ వినిపిస్తోంది. అంతేకాకుండా కల్యాణ్ రామ్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు. వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఉద్దేశంతోనే, ఆయా భాషలకి చెందిన పాన్‌ ఇండియా ఆర్టిస్టులను సెలక్ట్‌ చేసే ప్రయత్నంలో ఉన్నారట. ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగు కంప్లీట్‌ అయిన వెంటనే ఎన్టీఆర్.. కొరటాల ప్రాజెక్టుపై ఫోకస్‌ చేయనున్నారట . ‘జనతా గ్యారేజ్’ హిట్ తర్వాత ఎన్టీఆర్ – కొరటాల కాంబో రూపొందుతున్న సినిమా కావడంతో నందమూరి ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్‌గా కైరా అద్వాని పేరు వినిపిస్తోంది..అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

Also Read: వెంట్రుకలు నల్లగా ఒత్తుగా పెరగడానికి, బట్టలతపై జుట్టు మొలవడానికి ఈ సింపుల్ చిట్కాలు మీకోసమే