Sharwanand: ఆసక్తి రేకెత్తిస్తున్న శర్వానంద్ ఒకేఒక జీవితం మోషన్ పోస్టర్..
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ..
Sharwanand: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ మంచి హిట్స్ అందుకుంటున్నారు శర్వానంద్. ఈ క్రమంలోనే ఇప్పుడు ఒకేఒక జీవితం అనే సినిమాలో నటిస్తున్నారు. శర్వా కెరీర్ లో రూపొందుతోన్న 30వ చిత్రం ఇది. ఈ సినిమా ద్వారా శ్రీ కార్తిక్ దర్శకుడిగా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు – ఎస్ ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచిరెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ న యూ రిలీజ్ చేశారు. ఈ వీడియో చాలా ఇంట్రస్టింగ్ గా అనిపిస్తోంది.
శర్వానంద్ పోషించిన ఆది పాత్రకి సంభందించి స్నీక్ పీక్ ప్రోమోను విడుదల చేయగా ఆ వీడియో సినిమాపై అంచనాలను పెంచుతోంది . ఈ వీడియోలో పాట పాడటానికి ఆది ని స్టేజ్ మీదకు పిలుస్తుండగా.. హీరోయిన్ కూడా వెళ్లి పాడమని ప్రోత్సహిస్తుంది. స్టేజ్ దగ్గర క్రౌడ్ గోల చేస్తుండగా.. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ గిటార్ ను చూపించారు. అలాగే ఓ టేప్ రీకార్డర్ ను చూపిస్తూ..కొన్ని సైన్స్ ఫిక్షన్ అంశాలతో వీడియోను డిజైన్ చేశారు. ఈ వీడియో చివరిలో శర్వా గిటార్ పట్టుకొని కూర్చున్న స్టైల్ ను చూపించారు. వీడియో చూస్తుంటే ఇది ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ అని అర్ధమవుతుంది. అలాగే ఈ సినిమాకు ‘పెళ్లి చూపులు’ దర్శకుడు తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్నారు. రీతువర్మ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే అక్కినేని అమల కీలక పాత్ర పోషిస్తున్నారు. జేక్స్ బీజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :