AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Siddharth: యంగ్‌ ఏజ్‌లో మరణించిన తారల్లో సిద్ధార్థ్‌ ఒకరంటూ వీడియో.. దీనిపై హీరో ఎలా స్పందించాడంటే..

Siddharth: లైక్స్‌, వ్యూస్‌ పరామవధిగా యూట్యూబ్‌ ఛానళ్లలో ఫేక్‌ కంటెంట్‌ బాగా పెరిగిపోతోంది. ముఖ్యంగా అర్థం పర్థం లేని థంబ్‌నైల్స్‌తో యూజర్లను ఎలాగైనా అట్రాక్ట్‌ చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ఇతరుల మనోభావాలను...

Siddharth: యంగ్‌ ఏజ్‌లో మరణించిన తారల్లో సిద్ధార్థ్‌ ఒకరంటూ వీడియో.. దీనిపై హీరో ఎలా స్పందించాడంటే..
Sidhharth Twitter
Narender Vaitla
| Edited By: Phani CH|

Updated on: Jul 19, 2021 | 9:41 AM

Share

Siddharth: లైక్స్‌, వ్యూస్‌ పరామవధిగా యూట్యూబ్‌ ఛానళ్లలో ఫేక్‌ కంటెంట్‌ బాగా పెరిగిపోతోంది. ముఖ్యంగా అర్థం పర్థం లేని థంబ్‌నైల్స్‌తో యూజర్లను ఎలాగైనా అట్రాక్ట్‌ చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ఇతరుల మనోభావాలను సైతం లెక్కచేయకుండా హెడ్డింగ్‌లను పెడుతున్నారు. తాజాగా హీరో సిద్ధార్థ్‌ ఇలాంటి చేదు అనుభవాన్నే ఎదుర్కొన్నాడు. చిన్న వయసులోనే మరణించిన సౌత్‌ ఇండియాకు చెందిన 10 మంది తారలు అంటూ ఓ వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ అయింది. ఈ వీడియో థంబ్‌నైల్‌పై ఆర్తి అగర్వాల్‌, సౌందర్య ఫొటోలతో పాటు హీరో సిద్ధార్థ ఫొటో కూడా ఉంది. దీంతో ఈ థంబ్‌నైల్‌ స్ర్కీన్‌ షాట్‌ను ట్వీట్ చేసిన సిద్ధు అభిమాని ఒకరు.. ‘ఈ థంబ్‌నైల్స్‌ ఏంటి అసలు? దారుణం, అరాచకం. వ్యూస్‌ కోసం ఏమైనా చేస్తారా?’ అంటూ కామెంట్‌ చేశాడు.

దీంతో ఈ ట్వీట్‌ గమనించిన సిద్ధార్థ్‌.. ‘ఇది చాలా ఏళ్ల క్రితమే జరిగింది. అప్పట్లోనే నేను ఈ వీడియోపై యూ ట్యూబ్‌కు ఫిర్యాదు కూడా చేశాను. దీనికి యూట్యూబ్‌ వారు స్పందిస్తూ.. ‘క్షమించండి.. ఈ వీడియోతో ఎలాంటి సమస్య లేదు’ అంటూ సమాధానం ఇచ్చారని ట్వీట్ చేశారు. ఈ లెక్కన సిద్ధార్థ్‌ చేసిన ఫిర్యాదుకు యూట్యూబ్‌ సరిగ్గా స్పందిచ్చలేదన్నమాట. ఇక ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. సిద్ధార్థ్‌ అభిమానులు ఆయనకు మద్ధతుగా నిలుస్తున్నారు. ఇదిలా ఉంటే చాలా రోజుల పాటు తెలుగు సినిమాకు దూరంగా ఉంటూ వస్తోన్న సిద్ధార్థ్‌ తాజాగా ఆర్‌ఎక్స్‌ 100 ఫేమ్‌ అజయ్‌ భూపతి తెరకెక్కిస్తోన్న ‘మహా సముద్రం’ సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో శర్వానంద్‌ కూడా నటిస్తున్నాడు.

Also Read: Upasana-Namrata: ఒకే ఫేమ్ లో మెగా కోడలు ఉపాసన, కూతురు శ్రీజ, మహేష్ బాబు భార్య నమ్రతలు.. సోషల్ మీడియాలో హల్ చల్

Karthika Deepam: వంటలక్క ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. కార్తీక దీపం సీరియల్ ఇప్ప్పుడపుడే అవ్వదట.. సీక్వెల్ కూడా ప్లాన్

NTR-Koratala: వరస సినిమాలతో ఎన్టీఆర్ బిజిబిజీ.. కొరటాలతో పాన్ ఇండియా మూవీ.. భారీ బడ్జెట్