Karthika Deepam: వంటలక్క ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. కార్తీక దీపం సీరియల్ ఇప్ప్పుడపుడే అవ్వదట.. సీక్వెల్ కూడా ప్లాన్
Karthika Deepam: తెలుగు సీరియల్స్ అనగానే ఆడవాళ్లే చూస్తారు అన్న అభిప్రాయం ఉండేది.. కానీ కార్తీకదీపం ఆ టాక్ ని చెరిపేసింది. ఈ సీరియల్ కు తెలుగు బుల్లి తెర..
Karthika Deepam: తెలుగు సీరియల్స్ అనగానే ఆడవాళ్లే చూస్తారు అన్న అభిప్రాయం ఉండేది.. కానీ కార్తీకదీపం ఆ టాక్ ని చెరిపేసింది. ఈ సీరియల్ కు తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు పట్టంగట్టారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ ఆడామగ అనే బేధం లేకుండా వంటలక్కకు అభిమానులే.. సోషల్ మీడియాలో వంటలక్క పాత్రకు ఫ్యాన్స్ పేజీ ఉందంటే ఈ క్యారెక్టర్ ఎంతగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు.. అయితే మలయాళం మాతృక అయినా కొంతమేర తెలుగులో మార్పులతో ప్రసారమవుతుంది. ఈ సీరియల్ లోని వంటలక్క, డాక్టర్ బాబు లే కాదు.. పనిమనిషి ప్రియమణి క్యారెక్టర్ కూడా ఆకట్టుకుంది.. ప్రతి ఒక్కరి మనసులో స్థానం చోటు చేసుకుంది. వెయ్యికి పైగా ఎపిసోడ్స్ ప్రసారమవుతున్న ఈరోజు టీఆర్ఫీ రేటింగ్ లో టాప్ లో దూసుకుపోతూనే ఉంది. ఈ నేపథ్యంలో కార్తీక దీపం డైరెక్టర్ కాపుగంటి రాజేంద్ర ఈ సీరియల్ గురించి ఈ సీరియల్ లో పాత్రల సహా సీక్వెల్ పై ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు.
కార్తీక దీపం సీరియల్ ఏ విధంగా బుల్లి తెర ఫ్యాన్స్ ఆకట్టుకుందంటే… ఆ సీరియల్ ప్రసారమైన సమయంలో స్టార్ హీరో సినిమాలపై ప్రభావం పడేటంతగా… ఇక మిగతా సీరియల్స్ మాత్రమే కాదు.. అనేక షో లు కూడా కార్తీక దీపం క్రేజ్ ముందు నిలవలేకపోతున్నాయి. అయితే ఈ సీరియల్ ఇంతగా హిట్ కావడానికి మనకు కనిపించే నటీనటులే కాదు.. తెరవెనుక పనిచేసే టెక్నీషియన్స్ కష్టం కూడా చాలా ఉంటుంది.
ఈ సీరియల్ ను డైరెక్ట్ చేస్తున్న కాపుగంటి రాజేంద్ర ఒకప్పుడు వెండి తెరపై దర్శకుడిగా డబ్బు భలే జబ్బు వంటి సినిమాలను తెరకెక్కించాడు. మోహన్ బాబు, సౌందర్యాలు శివశంకర్ సినిమా ప్లాప్ తో బుల్లి తెరపై దర్శకుడిగా అడుగు పెట్టాల్సి వచ్చింది. ఇక కార్తీక దీపం సీరియల్ లతో దర్శకుడి బాగానే ఆకట్టుకున్నారు. ఆయితే గత కొన్ని రోజులుగా కార్తీక దీపం సిరియల్ కు త్వరలో శుభం కార్డు పడుతుందని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇదే విషయంపై దర్శకుడు స్పందిస్తూ.. సిరియల్ బిజినెస్ పరంగా రేటింగ్ పరంగా బాగున్నప్పడు అంత త్వరగా పూర్తి అవ్వదని తెలిపారు. బోర్ కొడుతుందని అనుకున్న సమయానికి మళ్ళీ ఏదో ఒక ట్విస్ట్ తో హైలెట్ చేస్తుంటామని కార్తీక దీపం 2పై ఇంకా ఆలోచించలేదని అంటూ.. రేటింగ్ బావున్నంత వరకు సీరియల్ కొనసాగుతుందని ఓపెన్ గానే చెప్పారు. సో కార్తీక దీపం సీరియల్ అభిమానులు ఇక ఈ సీరియల్ ఎప్పుడు అయిపోతుందో అని ఆలోచించాల్సిన పనిలేదన్నమాట.. రోజు రోజుకీ ఎలాంటి ట్విస్టులు వస్తాయో అని మాత్రమే ఆలోచించాలీ అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: ఒక జన్మలో చేసిన తప్పుకి ఎన్నిజన్మకైనా శిక్షతప్పదు.. ఇదే కర్మ. దృతరాష్ట్రుడికి పుత్రశోకమే ఉదాహరణ