Akhil Akkineni: ఆ సంస్థ నిర్మాణంలో అక్కినేని యంగ్ హీరో లవ్ స్టోరీ.. మరో ప్రాజెక్ట్‌కు అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా ?
నాగార్జున వారసుడిగా సినీ అరంగ్రేట్ చేసిన అఖిల్ అక్కినేని హిట్ కోసం ట్రై చేస్తున్నాడు. కెరీర్ ఆరంభం నుంచి వరుస ప్లాపులను చవిచూస్తున్న అఖిల్..
నాగార్జున వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ అక్కినేని హిట్ కోసం చాలా కష్ట పడుతున్నారు. కెరీర్ ఆరంభం నుంచి వరుస ప్లాపులను చవిచూస్తున్న అఖిల్.. ప్రస్తుతం రిలీజ్‌కు సిద్దంగా ఉన్న “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సినిమా పైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. బొమ్మరిల్లు సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండడం.. గీతా ఆర్ట్స్ బాన్యర్ లో ఈ చిత్రం తెరకెక్కుతుండడంతో… ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో విపరీతమైన అంచనాలున్నాయి. అయితే ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ.. తెలుగు ప్రేక్షకులను ఊరిస్తోంది. ఇక ఈ సినిమా తరువాత అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే సినిమాను మొదలు పెట్టారు. హీరోలను కొత్తగా చూపించే సురేందర్ రెడ్డి ఈ సినిమా కోసం అఖిల్‌తో సిక్స్ పాక్ బాడీని చేపించారు. ఇక ఇప్పటికే రిలీజైన అఖిల్ ఏజెంట్ లుక్స్ అందర్నీ ఆకట్టుకుంటూ నెట్టింట వైరల్ గా మారాయి కూడా..! కరోనా సెకండ్ వేవ్ తరువాత ఇటీవలే మొదలైన ఈ సినిమా షూట్ శరవేగంగా సాగుతోంది. అయితే తాజాగా ఈ యంగ్ హీరో మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
అఖిల్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో ఓ లవ్ స్టోరీ చేయబోతున్నట్లుగా ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ సినిమాకు డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అఖిల్ నటిస్తోన్న ఏజెంట్ సినిమా పూర్తైన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లుగా సమాచారం. ఇక అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” మూవీ ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ మూవీ అఖిల్ కెరీర్లో బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Tamannah: అందంగా ఉండటానికి అసలు సిక్రెట్ అదే.. షాకింగ్ విషయాలను చెప్పిన మిల్కీబ్యూటీ..
Maestro: “మాస్ట్రో” సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్.. నితిన్‌తో స్టెప్పులేయనున్న అందాల భామ..