AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhi Pinisetty: మరోసారి విలన్‏గా మెప్పించడానికి సిద్ధమవుతున్న స్టార్ హీరో.. ఎనర్జిటిక్ హీరోకు ధీటుగా ఆది పినిశెట్టి..

'మలుపు', 'వైశాలీ', 'యూటర్న్' వంటి చిత్రాలతో తెలుగులోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు టాలెంటెడ్ హీరో ఆది పినిశెట్టి. కేవలం హీరోగానే కాకుండా..

Aadhi Pinisetty: మరోసారి విలన్‏గా మెప్పించడానికి సిద్ధమవుతున్న స్టార్ హీరో.. ఎనర్జిటిక్ హీరోకు ధీటుగా ఆది పినిశెట్టి..
Aadhi Pinisetty
TV9 Telugu Digital Desk
| Edited By: Rajitha Chanti|

Updated on: Jul 19, 2021 | 7:32 AM

Share

‘మలుపు’, ‘వైశాలీ’, ‘యూటర్న్’ వంటి చిత్రాలతో తెలుగులోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు టాలెంటెడ్ హీరో ఆది పినిశెట్టి. కేవలం హీరోగానే కాకుండా.. ప్రతి నాయకుడి పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాడు. గతంలో అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన “సరైనోడు” సినిమాలో ఆది పినిశెట్టి.. విలన్ పాత్రలో నటించి.. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. ఆది నుంచి అంతగా మూవీ అప్‏డేట్స్ రాలేదు. తాజాగా ఈ హీరో ఇప్పుడు మరోసారి విలన్ పాత్రలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడట. అది కూడా ఎనర్టిటిక్ స్టార్ హీరో రామ్ సినిమాలో కనిపించబోతున్నట్లుగా సమాచారం.

రామ్ పోతినేని, కృతిశెట్టి జంటగా.. లింగుస్వామి దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. హైదరాబాద్, విశాఖపట్నం ప్రాంతాలలో ఈ మూవీ షెడ్యూల్స్ ప్లాన్ చేశారట మేకర్స్. యాక్షన్ ఎంటర్ టైనర్‏గా రాబోతున్న ఈ మూవీలో విలన్ పాత్రను కూడా చాలా ఢిపరెంట్‏గా, పవర్ ఫుల్‏గా ఉండేలా ప్లాన్ చేశాడట డైరెక్టర్. అయితే అందుకోసం ఓ సాలీడ్ విలన్ కోసం చూస్తున్నట్లుగా సమాచారం. దీంతో ఈ మూవీలో ఆది పినిశెట్టిని విలన్ పాత్ర కోసం తీసుకోబోతున్నట్లుగా తెలస్తోంది. . ఆ మధ్య వరకూ ఇందులో మాధవన్ విలన్ గా నటిస్తాడనే ప్రచారం జరిగింది. కానీ దాన్ని ఆయన స్వయంగా ఖండించాడు. ఆ తర్వాత ఆర్య పేరు వెలుగులోకి వచ్చింది.  ప్రస్తుతం ఆది పినిశెట్టి చేతిలో నాలుగు సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు.

Also Read: Bigg Boss 5 Telugu: సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న బిగ్‌బాస్‌ కంటెస్టెంట్ల పేర్లు.. తుది జాబితా ఇదేనా..?

Tamannah: అందంగా ఉండటానికి అసలు సిక్రెట్ అదే.. షాకింగ్ విషయాలను చెప్పిన మిల్కీబ్యూటీ..

Taapsee Pannu : కొత్త అవతారమెత్తిన అందాల భామ తాప్సీ.. హీరోయిన్ నుంచి ప్రొడ్యూసర్ గా..

Sharwanand: ఆసక్తి రేకెత్తిస్తున్న శర్వానంద్ ఒకేఒక జీవితం మోషన్ పోస్టర్..