Tamannah: అందంగా ఉండటానికి అసలు సిక్రెట్ అదే.. షాకింగ్ విషయాలను చెప్పిన మిల్కీబ్యూటీ..
టాలీవుడ్ సినీ పరిశ్రమలోని ప్రస్తుతం ఉన్న టాప్ హీరోయిన్స్‌లలో తమన్నా ఒకరు. అతి తక్కువ కాలంలోనే తన తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ
టాలీవుడ్ సినీ పరిశ్రమలోని ప్రస్తుతం ఉన్న టాప్ హీరోయిన్స్‌లలో తమన్నా ఒకరు. అతి తక్కువ కాలంలోనే తన తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది మిల్కీబ్యూటీ. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకున్న తమన్నా.. కోలీవుడ్, బాలీవుడ్ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు పదిహేళ్లుగా సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న ఈ మిల్కీబ్యూటీ.. ఇటీవల డిజిటల్ ఫ్లాట్‌ఫాంపై కూడా సక్సెస్ అందుకుంది. తాజాగా ఈ అమ్మడు తన బ్యూటీ సీక్రెట్ ఏంటో చెప్పి అందరికి షాకిచ్చింది.
వెండితెరపైనే కాకుండా.. డిజిటల్ ఫ్లాట్‌ఫాంలోనూ దూసుకుపోతున్న తమన్నా.. తాజాగా మాస్టర్ చెఫ్ అనే కుకింగ్ షో ద్వారా బుల్లితెరపైకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆహారపు అలవాట్లే అందాన్ని, శరీరాకృతిని కంట్రోల్లో ఉంచుతాయని చెప్పింది తమన్నా. ఇక ప్రతి రోజు సాయంత్రం ఐదున్నర గంటలకు భోజనం చేసి, మళ్లీ తెల్లవారి ఉదయం ఆరు గంటలకు టిఫిన్ చేసేదాన్నని.. 12 గంటల పాటు ఏమి తినకుండా ఉండడం వలన తన చర్మ కాంతి మెరుగుపడడమే కాకుండా.. చక్కగా నిద్రపట్టేదని చెప్పుకొచ్చింది. ఈ కారణంగానే గతంలో కంటే ఎక్కువ ఉత్సాహంగా ఉంటున్నానంటూ చెప్పుకొచ్చింది. ఇటీవల ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ముఖ సౌందర్యం గురించి తెలిపింది. ముఖ సౌందర్యం కోసం వేసుకునే స్పెషల్ ఫేస్ ప్యాక్ ఏంటీ అని ప్రశించగా..తమన్నా క్రేజీ ఆన్సర్ ఇచ్చింది. ఉదయాన్నే లేచిన వెంటనే తన లాలాజాలం (సలైవా)ను ముఖానికి అప్లై చేస్తానని చెప్పి షాకిచ్చింది. సలైవా స్కిన్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడంలో బాగా పని చేస్తుందని కూడా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తమన్నా.. “ఎఫ్ 3” సినిమాతోపాటు.. “మాస్ట్రో”, “సీటీమార్”, “గుర్తుందా శీతాకాలం” సినిమాల్లో నటింస్తుంది.
Also Read: Allu Arjun: అల్లు అర్జున్ ఇంట్లో హల్చల్ చేస్తోన్న రెండు దెయ్యాలు.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో.