Taapsee Pannu : కొత్త అవతారమెత్తిన అందాల భామ తాప్సీ.. హీరోయిన్ నుంచి ప్రొడ్యూసర్ గా..

తెలుగు సినిమాతో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారింది అందాల భామ తాప్సీ.  ఝుమ్మంది నాదం సినిమాతో ఎంట్రీఇచ్చిన చిన్నది.

Taapsee Pannu : కొత్త అవతారమెత్తిన అందాల భామ తాప్సీ.. హీరోయిన్ నుంచి ప్రొడ్యూసర్ గా..
Taapsee Pannu
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ravi Kiran

Updated on: Jul 19, 2021 | 6:20 AM

Taapsee Pannu : తెలుగు సినిమాతో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారింది అందాల భామ తాప్సీ.  ఝుమ్మంది నాదం సినిమాతో ఎంట్రీఇచ్చిన చిన్నది. ఆతర్వాత పలు సినిమాలతో ఆకట్టుకుంది. ఇక తెలుగులో బిజీ హీరోయిన్ గా కంటిన్యూ అవుతున్న సమయంలోనే బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతోంది. హీరోయిన్ గా రాణిస్తున్న ఈ  సొట్టబుగ్గల సుందరి ఇప్పుడు నయా అవతారం లోకి మారనుంది. హీరోయిన్ నుంచి ప్రొడ్యూసర్ గా షిఫ్ట్ అవ్వనుంది. దీనిలో భాగంగా ‘ఔట్ సైడర్ ఫిలిమ్స్’ పేరిట తాజాగా ఓ ప్రొడక్షన్ హౌస్ ను నెలకొల్పింది. సూపర్ 30′ ’83’ ‘సూర్మ’ ‘పికూ’ ‘ముబాకరన్’ వంటి సినిమాలను నిర్మించిన ప్రముఖ బాలీవుడ్ నిర్మాత రచయిత ప్రంజల్ ఖంద్ దియా భాగస్వామ్యంలో తాప్సీ సినిమాలు నిర్మించనుంది. తాప్సీ తన ‘అవుట్ సైడర్స్ ఫిలింస్’ ప్రొడక్షన్ హౌజ్ లో ఫస్ట్ సినిమాని ప్రకటించారు.

అజయ్ భాల్ దర్శకత్వంలో ”బ్లర్” అనే చచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జీ స్టూడియోస్ మరియు ప్రంజల్ ఖంద్ దియాలతో కలిసి తాప్సీ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. అంతే కాదు తనలా ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేని టాలెంట్ వుండి, ఛాన్సుల కోసం ఎదురుచూస్తున్న యువకులకు మా సినిమాల ద్వారా అవకాశాలు కల్పిస్తాం’ అని చెప్పుకొచ్చింది తాప్సీ. ఇదిలా ఉంటే తాప్సీ లీడ్ రోల్ చేసిన ‘హసీనా దిల్ రుబా’ సినిమా ఓటీటీ వేదికగా విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంటోంది. ఇది ఆమె కెరీర్లో డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయిన ఫస్ట్ సినిమా ఇది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Kudi Yedamaithe: కలలో ఏమి జరిగిందో.. ఎగ్జాక్ట్‌‌‌గా అదే జరుగుతోంది.. ఆకట్టుకుంటున్న కుడిఎడమైతే ట్రైలర్..

సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో విజయ్ సేతుపతి.. రాక్షసుడు సీక్వెల్ కోసం రంగంలోకి మక్కల్ సెల్వన్..?

Parasuram: అభిమానులకు అదిరిపోయే న్యూస్ చెప్పిన పరశురామ్.. విజిల్స్ పక్కా అంట..