Parasuram: అభిమానులకు అదిరిపోయే న్యూస్ చెప్పిన పరశురామ్.. విజిల్స్ పక్కా అంట..

సూపర్ స్టార్ మహేష్ శరవేగంగా సర్కారు వారి పాట సినిమాను పూర్తి చేసేపనిలో ఉన్నాడు. గీతగోవిందం సినిమాతో ప్రేక్షకులను మెప్పించి మంచి హిట్ అందుకున్న పరశురామ్ దర్శకత్వంలో..

Parasuram: అభిమానులకు అదిరిపోయే న్యూస్ చెప్పిన పరశురామ్.. విజిల్స్ పక్కా అంట..
Mahesh
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jul 15, 2021 | 9:08 AM

సూపర్ స్టార్ మహేష్ శరవేగంగా సర్కారు వారి పాట సినిమాను పూర్తి చేసేపనిలో ఉన్నాడు. గీతగోవిందం సినిమాతో ప్రేక్షకులను మెప్పించి మంచి హిట్ అందుకున్న పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇటీవలే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ను మొదలుపెట్టేసారు. హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కీలక షెడ్యూల్ ను ఆగస్టు వరకు పూర్తి చేస్తారట. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని చూస్తున్నారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమాలో మహేష్ కు జోడీగా అందాల భామ కీర్తిసురేష్ నటిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందని మొదటి నుంచి వినిపిస్తున్న టాక్. ఇక ఈ మూవీలో మహేష్ సూపర్ స్టైలిష్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఇటీవల దర్శకుడు పరశురామ్ మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.  అభిమానులు మహేష్ ను ఎలా అయితే చూడాలని అనుకుంటున్నారో అలా తాను చూపించబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. అంతే కాదు మహేష్ బాబు అంటే తనకు చాలా అభిమానం అని. ఈ సినిమాను మహేష్ ఫ్యాన్ గా డైరెక్ట్  చేస్తున్నట్లుగా తెలిపారు. కామెడీ సన్నివేశాలు ఇంకా విజిల్ మూమెంట్స్ సినిమాలో చాలా ఉంటాయని.. మహేష్ బాబులోని కామెడీ యాంగిల్ ను ఈ సినిమాలో విభిన్నంగా చూపించబోతున్నామని అన్నారు. అలాగే కామెడీ తోపాటు యాక్షన్ సన్నివేశాలు కూడా ప్రేక్షకుల చేత విజిల్స్ వేయిస్తాయని పరశురామ్ అన్నారు.  ఈ సినిమాలో కీలక పాత్రను యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తున్నారు. ఇక ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ వస్తుందని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Rajini Kanth: “అన్నాతే” కంప్లీట్ చేయడానికి కోల్‏కత్తాలో అడుగుపెట్టిన రజినీ.. సూపర్ స్టార్ ఫైనల్ షెడ్యూల్..

Actress Pragathi: పాపం ఎంత కష్టమొచ్చింది.. ట్రెడ్‏మిల్ పై నటి ప్రగతి వర్కవుట్స్ మాములుగా లేవుగా..

Kathi Mahesh: కత్తి మహేష్ మృతి కేసులో మరో ట్విస్ట్.. టీవీ9తో ఆసక్తికర విషయాలు చెప్పిన కత్తి మహేష్ కారు డ్రైవర్