Venkatesh: డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్న వెంకీ.. రానాతో కలిసి నయా వెబ్ సిరీస్‏కు ప్లాన్..

ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఓటీటీ హావా నడుస్తోంది. ఎప్పటికప్పుడూ సరికొత్త కంటెంట్‏ను ప్రేక్షకులకు అందించడంలో సక్సెస్ అవుతున్నాయి ఓటీటీ ఫ్లాట్‏ఫామ్స్.

Venkatesh: డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్న వెంకీ.. రానాతో కలిసి నయా వెబ్ సిరీస్‏కు ప్లాన్..
Venkatesh
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Rajitha Chanti

Updated on: Jul 19, 2021 | 7:58 AM

ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఓటీటీ హావా నడుస్తోంది. ఎప్పటికప్పుడూ సరికొత్త కంటెంట్‏ను ప్రేక్షకులకు అందించడంలో సక్సెస్ అవుతున్నాయి ఓటీటీ ఫ్లాట్‏ఫామ్స్. అందుకే స్టార్ హీరోహీరోయిన్స్ కూడా డిజిటల్ అరంగేట్రం చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారుతూ సినిమాలు చేస్తేనే ప్రేక్షకులు చూస్తారని.. ఓల్డ్ ట్రెండ్‏తో సినిమాలను తెరకెక్కిస్తే.. జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. స్టార్ ఉన్నంత మాత్రాన భారీ బడ్జెట్ పెట్టినంత మాత్రాన సినిమాలు ట్రెండ్‏కు తగ్గట్లుగా లేకుంటే చూస్తారనుకోవడం పెద్ద తప్పు అవుతుంది. అదే విషయాన్ని వెంకటేష్ కూడా నమ్ముతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. మారుతున్న కాలంతోపాటు..తాను కూడా ఓటీటీలో వెబ్ సిరీస్ చేసేందుకు రెడీగా ఉన్నట్లు చెప్పాడు..

నెట్‏ఫ్లిక్స్‏లో ఒక వెబ్ సిరీస్ ను చేసేందుకు సిద్దం అయినట్లుగా వెంకటేష్ చెప్పేశాడు. ఈ వెబ్ సిరీస్‏లో వెంకటేష్ మాత్రమ కాకుండా.. రానా దగ్గుబాటి కూడా నటించనున్నాడట. అలాగే వీరిద్దరితోపాటు..మరో స్టార్ హీరో కూడా నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. మంచి సబ్జెక్ట్ కావడంతో వెంకీ ఈ వెబ్ సిరీస్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా చెప్పుకొచ్చాడు. ముందు ముందు మంచి సబ్జెక్ట్స్ తనవద్దకు వస్తే.. తప్పకుండా వెబ్ సిరీస్‏లలో నటించేందుకు ఓకే చెప్తానని చెప్పారు. అటు భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూనే చాలా మంది స్టార్ ఓటీటీల్లో కనిపించేందుకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే నాగార్జున్ వెబ్ సిరీస్ సబ్జెక్ట్ పై చర్చలు జరుపుతున్నట్లుగా ప్రకటించారు. వెంకటేష్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన చిత్రం నారప్ప.. జూలై 20న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. ఇందులో వెంకటేష్ సరసన ప్రియమణి నటిస్తుంది.

Also Read: Aadhi Pinisetty: మరోసారి విలన్‏గా మెప్పించడానికి సిద్ధమవుతున్న స్టార్ హీరో.. ఎనర్జిటిక్ హీరోకు ధీటుగా ఆది పినిశెట్టి..

Bigg Boss 5 Telugu: సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న బిగ్‌బాస్‌ కంటెస్టెంట్ల పేర్లు.. తుది జాబితా ఇదేనా?

Tamannah: అందంగా ఉండటానికి అసలు సిక్రెట్ అదే.. షాకింగ్ విషయాలను చెప్పిన మిల్కీబ్యూటీ..

Taapsee Pannu : కొత్త అవతారమెత్తిన అందాల భామ తాప్సీ.. హీరోయిన్ నుంచి ప్రొడ్యూసర్ గా..