Karthika Deepam: మోనిత గతం వెలుగులోకి.. అంజిని పట్టుకుంటే నిజం తెలుస్తుందంటున్న దీప..

Karthika Deepam: కార్తీక దీపం సీరియల్ ఈరోజు 1095వ ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది. ఈ రోజు సీరియల్ లోని హైలెట్స్ చూద్దాం. దీప కార్తీక్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో కార్తీక్ వస్తాడు..

Karthika Deepam: మోనిత గతం వెలుగులోకి.. అంజిని పట్టుకుంటే నిజం తెలుస్తుందంటున్న దీప..
Karthika Deepam
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Surya Kala

Updated on: Jul 19, 2021 | 12:49 PM

Karthika Deepam: కార్తీక దీపం సీరియల్ ఈరోజు 1095వ ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది. ఈ రోజు సీరియల్ లోని హైలెట్స్ చూద్దాం. దీప కార్తీక్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో కార్తీక్ వస్తాడు.. వెంటనే మోనిత నాటకం ఎలా ఉంది.. బాగా రక్తి కట్టిందా అంటుంది. నీకు ఎలా తెలుసు.. అని అడిగితే .. అది జాలి సానుభూతి కోసం కాదు.. సాక్ష్యం కోసం మీకు ఫోన్ చేసింది. నిజంగా ఆత్మహత్య చేసుకునేవాళ్ళు ఐతే ఇలా ఫోన్ చేసి చెప్పారు.. అంటే.. అవును నేను వెళ్లే లోపే అన్ని అరేంజ్మెంట్స్ చేసింది. రోషిణి కూడా అప్పుడే వచ్చింది. ఇంత నాటకమా అంటాడు కార్తీక్. అప్పుడు దీప.. మోనిత కడుపు నాటకం తెలిసినపుడే కదా మన జీవితాలు బాగుపడేది అంటూ.. నేను సరోజక్క ఇంటికి వెళ్లి వస్తాను అంటుంది.

శ్రావ్య, ఆదిత్య లు ఆనందరావు అనుమానం గురించి మాట్లాడుకుంటారు.. మరోవైపు కార్తీక్.. రోషిణి మోనిత చెప్పిందే నమ్మి.. నన్ను అరెస్ట్ చేస్తే.. డాడీకి అంతా తెలిసిపోతుంది.. తట్టుకోలేరు.. ఏమి చెయ్యాలి.. అంటూ ఆలోచిస్తుంటే.. ఇంతలో ఆనందరావు వచ్చి.. నువ్వు కోడలు బాగానే ఉంటున్నారుగా అని అంటే.. చూశారుగా డాడీ అంటాడు. కోడలు పిల్లలు ఏరి అంటే.. వాళ్ళు బయటకు వెళ్లారు అంటాడు కార్తీక్.. ఆనందరావు నాకు పని ఉంది మళ్ళీ కలుస్తా అంటూ … పిల్లలకు గిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోతాడు.

దీప భాగ్యంతో మోనితని ఎలా ఆపాలి ఆలోచిస్తుంది.. నా భర్తను దక్కించుకోవడానికి ఎంతకైనా తెగించేలా ఉంది. ఇక 25వ తేదీ వచ్చేస్తుంది. ఈలోపు దానిని వదిలించుకోవాలి. నాకు డాక్టర్ బాబుకు మనశాంతి లేదు అంటూ బాధపడుతుంది.. భాగ్యం ఏమి చెయ్యాలో చెప్పు.. అంటే.. దీప భాగ్యానికి ఓ ఐడియా చెబుతుంది.. ఇది సూపర్ దెబ్బకి మోనిత రోగం కుదురుతుంది అంటూ..భాగ్యం అక్కడి నుంచి వెళ్తుంది.

ఆనందరావు రిజిస్టర్ ఆఫీస్ కు వెళ్లి.. తన ఫ్రెండ్ కొడుకు సుధాకర్ ని పలకరిస్తాడు.. పెళ్లిళ్లు లేవా ఖాళీగా ఉంది అంటే.. సుధాకర్ కంప్యూటర్ లో ఉన్న ఓ ప్రొఫెల్ ని చూపిస్తూ.. ఇదిగో వీళ్ళు 25న పెళ్లి చేసుకోబోతున్నారు అంటే ఆ ఫొటోలో ఉన్న కార్తీక్ మోనిత లను చూస్తాడు.. ‘వీళ్లా వీళ్లా పెళ్లి చేసుకోబోయేది అంటున్న ఆనందరావు తో రిజిస్ట్రేషన్ అధికారి.. అవునండీ చాల విచిత్రమైన కేసు.. ఇద్దరూ డాక్టర్లే… ఇంకో విచిత్రం ఏమిటంటే.. సాక్షి సంతకాలు అతనిభార్య, తల్లి పెడతారని చెప్పింది మహా తల్లి అంటూ ఇలాంటి ఘోరాలు మాకు అలవాటు లెండి అంటాడు. షాక్ లో ఉన్న ఆనందరావు అక్కడ నుంచి బయలుదేరుతూ.. కార్తీక్ మోనితని పెళ్లి చేసుకోబోతున్నాడా నాకోడలు, పిల్లలు ఏమైపోతారు అని ఆలోచిస్తుంటాడు ..

దీప ఏసీపీ రోషిణి ఇంటికి వస్తుంది.. అప్పుడే ఎవరితో మాట్లాడుతున్న రోషిణి దీపకు వాటర్ బాటిల్ ఇచ్చి తాగమంటుంది. మోనిత గురించి నా అనుమానాలు చెప్పడానికి వచ్చా అంటే.. నాకు కార్తీక్ విషయంలో కొని అనుమానులున్నాయని అంటుంది.. అయితే ముందే చెప్పండి అంటుంది దీప.. ప్రియమణిని ఎంక్వైరీ చేశాను.. కార్తీక్ మోనితని పెళ్లి చేసుకోబోయాడని చెప్పింది, నువ్వేమో ఫ్రెండ్స్ అంటున్నావు అంటే.. అబద్దమా అంటే.. కాదు నిజమే అంటుంది.. దీప. ‘మరి వాళ్లు స్నేహితులు మాత్రమే అన్నావు అంటే.. అది కూడా నిజమే అంటుంది దీప.. మరి స్నేహానికి పెళ్ళికి ముడి పెట్టడం ఏమిటి అంటుంది రోషిణి. రోషానికి ఉక్రోషానికి ముడిపెట్టినప్పుడు జరిగిన సంఘటన అది.. మీకో పిట్ట కథ చెప్పనా అంటూ… మోనిత కార్తీక్ ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి.. నా ముందే కారులో ఎక్కించుకుని వెళ్ళినప్పుడు నాకు ఉక్రోషం వచ్చింది. నేను నా ఇంటికి వెళ్లి ఆటో కడిగా అంటూ గతంలో తానూ చేసిన పని చెబుతూ.. అలాంటిదే నా భర్త మోనిత ని పెళ్లి చేసుకోవడం అంటుంది.

మా ఇద్దరి కలపాలని మా అత్తగారు నాకు సపోర్ట్ చెయ్యడం ఆయనకి నచ్చేది కాదు. మేము విడిగా ఉన్నమని మా అత్తగారు మమ్మల్ని కలపాలని ప్రయత్నించిన ప్రతిసారీ ఆయన మోనిత అనే ఒక బూచిని చూపించి బెదిరించేవారు.. బురదలోకి దూకుతా దూకుతా అని బెదిరించేవాడు ఎప్పుడైనా బురదలోకి దూకుతాడా ఆయన దూకలేదు.. కానీ ఆ మోనిత బురద అంటించి దూకేశాడు అంటోంది అంటూ రోషిణికి మోనిత కార్తీక్ వ్యక్తిత్వం గురించి చెబుతుంది.

మరి ఆ కడుపు కథ ఏమిటి.. దీనికి కూడా ఓ పిట్ట కథ చెబుతావా అంటే.. లేదు డాక్టర్ బాబు ఎలాంటి వాడో నాకు తెలుసు.. అందుకే 10 ఏళ్ళు అయన కోసం ఎదురుచూసే.. నేను ఏమైనా మోనితలా మోజు పడిన దానిలా మోనిత చెప్పేవరకూ ఆయనకు ఏ విషయం తెలియదంటున్నారు.. అయన తప్పు చేస్తే తప్పించుకునే వ్యక్తి కాదు.. అంటే మోనిత కడుపు అబద్ధమా అంటే.. కాదు కానీ మోనిత ఎదో దాచిపెడుతుంది.. నా భర్త మంచితనాన్ని తనస్కు అనుకూలంగా మార్చుకుంటుంది.. మోనిత నా భర్తని ప్రేమించలేదు.. మోజు పడింది.. మోనితని గమనించిన స్త్రీగా నాకు బాగా తెలుసు.. నేను మోనిత పెళ్లి చేసుకుంటాను అని దైర్యంగా చెప్పిన వ్యక్తి.. ఇప్పుడు కడుపు విషయంలో అలాగే చెప్పేవారు అంటే.. నీ భర్త అందరిలాంటి వ్యక్తి కదా ఏ బలహీన క్షణాల్లోనైనా తప్పు చేసి ఉండొచ్చు కదా అంటే… అదే నిజమైతే నా భర్త తప్పు చేస్తే.. మీరు ఏ శిక్షవేసినా అంగీకరిస్తా అంటుంది దీప. నిజానికి అబద్ధానికి మోనిత రేఖ గీసింది.. ఆ రేఖ గురించి చెప్పాలంటే.. మీకు అంజి గురించి చెప్పాలి అంటుంది దీప.

అంజి ఎవరు అంటే… ఒక డ్రైవర్ అంటూ.. హిమ హత్య.. మోనిత దీప, అంజిల ఫోన్ పగులగొట్టిన విషయం చెబుతుంది. టెక్నాలజీ లేని రోజుల నుంచి.. టెక్నాలజీ పెరిగిన రోజులు దాకా ఈ మోనిత తప్పులే చేస్తూ దిగ్విజయంగా తప్పించుకుంటూనే ఉంది అన్న మాటలు చెబుతుంది రోషిణికి అంజిని పట్టుకుంటే.. అన్ని నిజాలు బయటకు వస్తాయి మేడం అంటుంది.. రేపు ఆనందరావు కార్తీక్ ని పెళ్లి విషయం నిలదీస్తాడు..

Also Read:

ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే హీరో.. నటకీరిటి రాజేంద్ర ప్రసాద్ బర్త్ స్పెషల్..

అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!