Maestro: “మాస్ట్రో” సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్.. నితిన్‌తో స్టెప్పులేయనున్న అందాల భామ..
Thamannah: ఇటీవల విడుదలైన "చెక్", "రంగ్ దే" సినిమాలతో తీవ్ర నిరాశకు గురయ్యాడు హీరో నితిన్. దీంతో తదుపరి సినిమాతో ఎలాగైనా హిట్ అందుకోవడానికి
Thamannah: ఇటీవల విడుదలైన “చెక్”, “రంగ్ దే” సినిమాలతో తీవ్ర నిరాశకు గురయ్యాడు హీరో నితిన్. దీంతో తదుపరి సినిమాతో ఎలాగైనా హిట్ అందుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ “అందుకున్న” అంధాదున్ సినిమా రీమేక్‌గా “మాస్ట్రో” మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నభా నటేష్ హీరోయిన్గా నటిస్తుంది. అయితే ఇందులో మిల్కీబ్యూటీ తమన్నా కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ కోసం తమన్నా డబ్బింగ్ కూడా చెప్పెస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన బేబి ఓ బేబి అనే సాంగ్ సినిమాపై మరింత హైప్‌ని క్రియేట్ చేసింది. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది.
నితిన్.. నభా నటేష్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్ చేయబోతుందట. నితిన్, తమన్నాల మధ్య ఓ ప్రమోషనల్ సాంగ్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించబోతున్నారట. మేర్లపాక గాందీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ మరో రెండు రోజుల్లో పూర్తికానున్నట్లుగా సమాచారం. ఆ తర్వాత వెంట వెంటనే ట్రైలర్, సాంగ్స్ విడుదల చేసింది.. సాధ్యమైనంత తొందరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారట మేకర్స్. ఈ చిత్రాన్ని నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితా రెడ్డి, రాజ్ కుమార్ అకెళ్లా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు.
Tamannah: అందంగా ఉండటానికి అసలు సిక్రెట్ అదే.. షాకింగ్ విషయాలను చెప్పిన మిల్కీబ్యూటీ..
Taapsee Pannu : కొత్త అవతారమెత్తిన అందాల భామ తాప్సీ.. హీరోయిన్ నుంచి ప్రొడ్యూసర్ గా..