Oppo A16: ఒప్పో నుంచి మరో కొత్త బడ్జెట్ ఫోన్ .. ధర రూ.10 వేలలోనే.. ఫీచర్స్‌ వివరాలు..!

Oppo A16: కస్టమర్లను పలు స్మార్ట్‌ఫోన్‌ మరింతగా ఆకట్టుకుంటున్నాయి. పలు మొబైల్‌ తయారీ కంపెనీలు రకరకాల ఫీచర్స్‌తో కొత్త కొత్త మోడళ్లను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. పలు.

Oppo A16: ఒప్పో నుంచి మరో కొత్త బడ్జెట్ ఫోన్ .. ధర రూ.10 వేలలోనే.. ఫీచర్స్‌ వివరాలు..!
Oppo A16
Follow us

| Edited By: Subhash Goud

Updated on: Jul 18, 2021 | 5:02 PM

Oppo A16: కస్టమర్లను పలు స్మార్ట్‌ఫోన్‌ మరింతగా ఆకట్టుకుంటున్నాయి. పలు మొబైల్‌ తయారీ కంపెనీలు రకరకాల ఫీచర్స్‌తో కొత్త కొత్త మోడళ్లను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. పలు ఫోన్‌ తయారీ కంపెనీలు పోటా పోటీగా స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి. ఇక తాజాగా ఒప్పో నుంచి మరో ఫోన్‌ మార్కెట్లో విడుదలైంది. ఒప్పో ఏ16 స్మార్ట్‌ఫోన్‌ ఇండోనేషియాలో విడుదల చేసింది. గతేడాది అక్టోబర్‌లో విడుదలైన ఒప్పో ఏ15కు తర్వాత వెర్షన్‌గా ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. దీని అంచులు సన్నగానూ, ఫోన్ కిందవైపు మందంగానూ ఉండనుంది. వాటర్‌డ్రాప్ నాచ్ తరహా డిస్‌ప్లేను ఇందులో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.

ఒప్పో ఏ16 ధర

ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్‌తో ఉన్న ఈ ఫోన్ ధర భారత కరెన్సీలో సుమారు రూ.9,800 నిర్ణయించారు. క్రిస్టల్ బ్లాక్, పెరల్ బ్లూ, స్పేస్ సిల్వర్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు విడుదల చేయనున్నారో కంపెనీ వెల్లడించలేదు. త్వరలో భారత్‌లో కూడా విడుదలయ్యే అవకాశం ఉందని పలు వ్యాపారవేత్తలు చెబుతున్నారు.

ఒప్పో ఏ16 స్పెసిఫికేషన్లు

ఆండ్రాయిడ్ 11 ఆధారిత కలర్ఓఎస్ 11.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ రన్‌ అవుతుంది. ఇందులో 6.52 అంగుళాల హెచ్‌డీ+ డిస్ ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్, టచ్ శాంప్లింగ్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉంది. స్క్రీన్ టు బాడీ రేషియో 88.7 శాతంగా ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌ను ఇందులో పొందుపర్చారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది. అలాగే ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండగా, వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్‌గా ఉండగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను కూడా ఇందులో అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు.

ఇవీ కూడా చదవండి:

Amazon Gift Voucher: అమెజాన్‌ బంపర్‌ ఆఫర్‌.. ఉచితంగా 10 వేల గిఫ్ట్ వోచర్‌.. ఈ రెండు షరతులు తప్పనిసరి

OnePlus TV: వినియోగదారులకు షాకింగ్‌.. భారీగా పెరిగిన స్మార్ట్‌టీవీల ధరలు..రూ.7000 వరకు పెంపు

RBI: మాస్టర్‌ కార్డు నిషేధంతో రూపే కార్డుకు మేలు జరుతుందా..? ఆర్బీఐ ఆదేశాల ప్రభావం ఆ ఐదు బ్యాంకులపై..!

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మండే ఎండలో జాగ్రత్త.. మీ కళ్లు జర భద్రం..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

సామాన్యులకి అందుబాటులో పోర్టబుల్ ఫ్రిడ్జ్‌లు..

వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచే మసాలాలు..!ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలం

కేవలం 25 బంతుల్లోనే ఊహకందని ఊచకోత.. ఆ ప్లేయర్ 29 సిక్సర్లతో.!

లోక్ సభ ఎన్నికల వేళ సవాళ్ల పర్వం.. హరీష్ వర్సెస్ సీఎం రేవంత్..
లోక్ సభ ఎన్నికల వేళ సవాళ్ల పర్వం.. హరీష్ వర్సెస్ సీఎం రేవంత్..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో