OnePlus TV: వినియోగదారులకు షాకింగ్.. భారీగా పెరిగిన స్మార్ట్‌టీవీల ధరలు..రూ.7000 వరకు పెంపు
OnePlus TV: వన్‌ప్లస్ తన టీవీల ధరను మనదేశంలో భారీగా పెంచేసింది. ఈ మధ్యకాలంలో మార్కెట్లోకి విడుదలైన వన్‌ప్లస్ యూ1ఎస్ టీవీల ధరలు కూడా పెరగడం గమనార్హం. కొన్ని..
OnePlus TV: వన్‌ప్లస్ తన టీవీల ధరను మనదేశంలో భారీగా పెంచేసింది. ఈ మధ్యకాలంలో మార్కెట్లోకి విడుదలైన వన్‌ప్లస్ యూ1ఎస్ టీవీల ధరలు కూడా పెరగడం గమనార్హం. కొన్ని టీవీల ధరలు స్వల్పంగా పెరుగగా, మరి కొన్ని టీవల ధరలు ఏకంగా 17.5 శాతం పెరగడం విశేషం. ధర ఎందుకు పెరిగిందో కారణం తెలియలేదు. అయితే ఓఫెన్ సెల్ ప్యానెల్ ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరగడమే దీనికి కారణం అని తెలుస్తోంది. దీంతో చాలా కంపెనీలు ఇప్పటికే తమ టీవీల ధరలను మనదేశంలో పెంచాయి. ఇప్పుడు వన్‌ప్లస్ కూడా ఆ జాబితాలో చేరింది.
ఇక వన్‌ప్లస్ గత సంవత్సరం జూలైలో భారత్‌లో వై-సిరీస్ టీవీలను విడుదల చేసింది. ఇందులో 32 అంగుళాలు, 43 అంగుళాల వేరియంట్లు ఉన్నాయి. ఇటీవలే ఇందులో 40 అంగుళాల వేరియంట్ కూడా విడుదలైంది. ఈ సంవత్సరం మేలో ఈ వేరియంట్‌ను వన్‌ప్లస్ లాంచ్ చేసింది.
వన్‌ప్లస్ వై-సిరీస్ టీవీల్లో 32 అంగుళాల వేరియంట్ ధర రూ.12,999 నుంచి ఏకంగా రూ.18,999కు పెరిగింది. ఇందులో అలాగే 40 అంగుళాల వేరియంట్ ధర కూడా రూ.23,999 నుంచి రూ.26,499కు పెరిగింది. 43 అంగుళాల వేరియంట్ ధరను రూ.26,399 నుంచి రూ.29,499కు పెంచింది.
అలాగే వన్‌ప్లస్ టీవీ యూఎస్ సిరీస్ ధరలు కూడా పెరిగాయి. ఇందులో 50 అంగుళాల వేరియంట్ ధర రూ.39,999 నుంచి రూ.46,999కు పెరిగింది. 55 అంగుళాల వేరియంట్ ధరను రూ.47,999 నుంచి రూ.52,999కు, 65 అంగుళాల వేరియంట్ ధరను రూ.62,999 నుంచి రూ.68,999కు పెంచారు. ఇందులో 50 అంగుళాల వేరియంట్ ధర ఏకంగా రూ.7,000 పెంచగా, 55 అంగుళాల వేరియంట్ ధర రూ.5,000, 65 అంగుళాల వేరియంట్ ధర రూ.6,000 పెంచేసింది కంపెనీ.