- Telugu News Photo Gallery Business photos Bajaj ktm 250 adventure price in india reduced by about rs 25000 details inside
Bajaj KTM 250: కొత్త బైక్ కొనుగోలు చేసేవారికి బంపర్ ఆఫర్.. ఈ బైక్‌పై రూ.25 వేల వరకు తగ్గింపు..!
Bajaj KTM 250: ప్రస్తుతం పలు వాహన కంపెనీలు కస్టమర్లకు బంపర్ ఆఫర్ ఇస్తు్న్నాయి. భారీగా డిస్కౌంట్లు ఇస్తున్నాయి. కరోనా కాలంలో భారీగా నష్టపోయిన పలు వాహనాల..
Updated on: Jul 17, 2021 | 11:27 AM

Bajaj KTM 250: ప్రస్తుతం పలు వాహన కంపెనీలు కస్టమర్లకు బంపర్ ఆఫర్ ఇస్తు్న్నాయి. భారీగా డిస్కౌంట్లు ఇస్తున్నాయి. కరోనా కాలంలో భారీగా నష్టపోయిన పలు వాహనాల కంపెనీలు.. ప్రస్తుతం వ్యాపారాన్ని ముందుకు సాగించేందుకు కస్టమర్లకు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.

ఇక కొత్తగా బైక్ కొనుగోలు చేయాలని భావించే వారికి శుభవార్త అందించింది బజాజ్. అదిరిపోయే ఓ ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రముఖ వాహన తయారీ కంపెనీ బజాజ్ ఆటో టూవీలర్ కొనుగోలుదారులకు శుభవార్త అందించింది.

కేటీఎం 250 అడ్వెంచర్ బైక్ ధరను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ ఈ బైక్ ధరను రూ.25 వేల వరకు తగ్గించేసింది. అయితే ఈ తగ్గింపు కొంత కాలమే అందుబాటులోఉంటుందని కంపెనీ తెలిపింది. అంటే ఆగస్ట్ నెల చివరి వరకు మాత్రమే తగ్గింపు ప్రయోజనం పొందవచ్చని కంపెనీ వివరించింది.

టూవీలర్ అమ్మకాలను పెంచుకోవాలనే లక్ష్యంతో బజాజ్ కంపెనీ ఈ మేరకు తాత్కాలికంగా ధరను తగ్గించేసిందని తెలుస్తోంది. ఇప్పుడు ఈ బైక్ ధర రూ.2.3 లక్షలకు దిగివచ్చింది. ఇకపోతే ఈ బైక్‌లో 250 సీసీ ఇంజిన్ ఉంటుంది.



